Share News

ముగిసిన పుర ప్రచారం

ABN , Publish Date - Oct 31 , 2026 | 12:33 AM

జిల్లాలో మూడు పురాల్లో ఈనెల 21న నుంచి మైక్‌లు, తీన్‌ మార్‌లతో హోరెత్తిన ప్రచారం పర్వం శుక్ర వారం సాయంత్రంతో తెరపడింది.

ముగిసిన పుర ప్రచారం
నూజివీడు ప్రచార ర్యాలీలో మంత్రి పార్థసారథి, టీడీపీ శ్రేణులు..

పోటాపోటీగా ప్రధాన పార్టీలు ర్యాలీలు.. ఓట్ల అభ్యర్థన

రేపు జరిగే పోలింగ్‌ పైనే అభ్యర్థులతో పాటు అందరి దృష్టి

నూజివీడులో చీకటి ఒప్పందాలు..

స్థానిక సంస్థల గెలుపుపై ప్రభావం చూపనున్న పుర పోరు ఫలితాలు

(ఏలూరు/టూటౌన్‌/నూజివీడు/టౌన్‌/ జంగారెడ్డిగూడెం,ఆంధ్రజ్యోతి): జిల్లాలో మూడు పురాల్లో ఈనెల 21న నుంచి మైక్‌లు, తీన్‌ మార్‌లతో హోరెత్తిన ప్రచారం పర్వం శుక్ర వారం సాయంత్రంతో తెరపడింది. ఇక నవం బరు 1న ఉదయం 7 గంటల నుంచి 5 గంటల వరకు జరిగే పోలింగ్‌ పైనే పార్టీల అన్ని దృష్టి సారించనున్నాయి. ప్రచారం చివరి రోజు ప్రధాన పార్టీలు, స్వతంత్రులు అట్టహాసంగా తమ గుర్తులను సూచిస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకోవడంపై దృష్టి సారించారు. ఏలూరు లోని కూటమి పార్టీల అభ్యర్థులు, మేయర్‌ అభ్యర్థి రెడ్డి అప్పలనాయుడు తరపున ఎమ్మెల్యే బడేటి చంటి ప్రచారంలో పాల్గొ న్నారు. వైసీపీ తరపున గంటా మోహన్‌ రావును గెలిపించాలంటూ వైసీపీ ఇన్‌చార్జి మామిళ్లపల్లి జయప్రకాశ్‌ కూడా చివరి రోజు ప్రచారం సాగించారు. ఇక స్వతంత్ర అభ్యర్థులు తమ గుర్తులను చూపిస్తూ ప్ర చారం సాగిం చారు. మూడు పురాల్లోనూ అన్ని చోట్ల ప్రచారాల్లో అద్దె కార్యకర్తలను భారీగా ఉపయోగించారు. దీంతో రోడ్లన్నీ సందడిగా మారాయి.

నూజివీడులో..

నూజివీడులో ప్రధాన పక్షాలైన తెలుగుదేశం, వైసీపీలు తమ శ్రేణులతో పోటాపోటీ ర్యాలీలను నిర్వహించాయి. మంత్రి, నూజివీడు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి ఆధ్వర్యంలో చైర్మన్‌ అభ్యర్థి బర్రె ఇళయరాజా, వార్డు కౌన్సిలర్‌ అభ్యర్థులతో మంత్రి క్యాంపు కార్యాలయం నుం చి భారీ ర్యాలీ నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్‌ అప్పారా వు, ఛైర్మన్‌ అభ్యర్థి లవకుమార్‌ల ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు.

ఇరు పార్టీలకు ప్రతిష్టాత్మకం

నూజివీడు పురపాలక విజయాన్ని తెలుగుదేశం, వైసీపీ రెండు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. పురపాలకంలో విజయం సాధిస్తే కొద్ది రోజుల్లో జరగనున్న జిల్లా, మండల పరిషత్‌ ఎన్నికలలో తమ విజయం సునాసయం అవుతుందని ఆ పార్టీల నాయకులు భావిస్తున్నారు. దీంతో విజయానికి రెండు పార్టీలు తమ వ్యూహాలలో మునిగి ఉన్నాయి. ఓటరు నాడీ రాజకీయ నేతలకు అందడం లేదు. నూజివీడులో చైర్మన్‌ అభ్యర్థికి వచ్చే మెజార్టీ గురించి ఎవరు ఢంకా బజాయించి చెప్పడం లేదు. దీనికి ప్రధాన కారణం క్రాస్‌ ఓటింగ్‌ జరుగుతుందనే ఆందోళన వీరిలో ఉండడమే. మరోవైపు నూజివీడులో చీకటి ఒప్పందాలకు తెర తీసినట్టు ప్రచారం జరుగుతోంది. వార్డుల్లో కొన్ని పనుల విషయంలో, చైర్మన్‌ ఓటు కౌన్సిలర్‌ ఓటు విషయంలో కొన్ని వార్డులలో చీకటి ఒప్పందాలకు రెండు పార్టీలు పాల్పడ్డాయని విస్తృతంగా ప్రచారం సాగుతోంది.

జంగారెడ్డిగూడెంలో..

జంగారెడ్డిగూడెంలో చివరి రోజు కూటమి పార్టీలు, వైసీపీ ప్రచారా లతో హోరెత్తించారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కూటమి పార్టీలు, మధ్యాహ్నం నుంచి వైసీపీ భారీగా డీజేలు,తీన్‌మార్‌ డప్పులతో పట్టణ ప్రధాన వీధుల్లో ప్రచారం సాగించారు. మినీ వ్యాన్‌పై కూటమి పార్టీల తరపున నిర్వహించిన ప్రచార ర్యాలీలో చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్‌కుమార్‌ పాల్గొన్నారు. చైర్‌పర్సన్‌ అభ్యర్ధి రొంగల అనూషను, 32 మంది కూటమి పార్టీల అభ్యర్థులను గెలిపించాలని ఎమ్మెల్యే కోరారు. అలాగే వైసీపీ చైర్‌పర్సన్‌ అభ్యర్థి మేకా సత్యవతి, 32 వార్డుల అభ్యర్ధులను గెలిపించాలని వైసీపీ నియోజకవర్గ కన్వీనర్‌ కంభం విజయరాజు, వైసీపీ నాయకులు జెట్టి గురునాథరావు ప్రచార ర్యాలీ నిర్వహించారు.

పకడ్బందీగా ఓట్ల లెక్కింపు : కలెక్టర్‌

ఏలూరు టూటౌన్‌ : ఏలూరు నగర పాలక సంస్థ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియలో చిన్న పొరపాటుకు కూడా తావులేకుండా సిబ్బందికి శిక్షణ అందించాలని కలెక్టర్‌ కే.వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. సీఆర్‌ఆర్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో శుక్రవారం కౌంటింగ్‌ సూపర్‌వైజర్లు, సిబ్బందికి శిక్షణ ఏర్పాటు చేశారు. జేసీ అభిషేక్‌గౌడతో కలిసి శిక్షణ కార్యక్రమాన్ని పరిశీలించిన కలెక్టర్‌ మాట్లాడుతూ ఓట్ల లెక్కింపు కార్యక్రమం పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించాలన్నా రు. ఓటు చెల్లుబాటుపై కౌంటింగ్‌ సూపర్‌వైజర్‌, అధికారికి సమస్య ఎదురైతే రిటర్నింగ్‌ అధికారి దృష్టికి తేవాలన్నారు. స్ర్టాంగ్‌రూమ్‌ల భద్రత, కౌంటింగ్‌ కేంద్రాల్లో అవసరమైన ఏర్పాట్ల విషయంలో ఎటువంటి లోపాలు లేకుండా అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు.

Updated Date - Oct 31 , 2026 | 12:33 AM