Share News

నిర్ణయం ఆమెదే..

ABN , Publish Date - Oct 22 , 2026 | 01:08 AM

స్థానిక సంగ్రామంలో మహిళా ఓటర్లే మహరాణులుగా నిలిచారు. పురుష ఓటర్ల కంటే కార్పొరేషన్‌తో మొదలుకుని అన్ని పట్టణాల్లో మహిళా ఓటర్లే అధికంగా ఉండటం విశేషం. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 17,439 మంది మహిళా ఓటర్లు పురుషులకంటే అధికంగా ఉండటం విశేషం.

నిర్ణయం ఆమెదే..

నిర్ణయం ఆమెదే..

కార్పొరేషన్‌తో పాటు అన్ని పట్టణాల్లో మహిళా ఓటర్లే అధికం..

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పురుషులకంటే అధికంగా ఉన్న 17,439 మహిళా ఓటర్లు

– ఏలూరు, (ఆంధ్రజ్యోతి)

స్థానిక సంగ్రామంలో మహిళా ఓటర్లే మహరాణులుగా నిలిచారు. పురుష ఓటర్ల కంటే కార్పొరేషన్‌తో మొదలుకుని అన్ని పట్టణాల్లో మహిళా ఓటర్లే అధికంగా ఉండటం విశేషం. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 17,439 మంది మహిళా ఓటర్లు పురుషులకంటే అధికంగా ఉండటం విశేషం. ఈ ఎన్నికల్లో వీరే కీలకంగా మారారు. కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తూ రాజకీయ చైతన్యం నింపేదిశగా మరింత ప్రోత్సాహం ఇస్తున్న వేళ నిర్ణయాత్మకశక్తిగా మారారు.

అన్ని పట్టణాల్లో పైచేయి..

జిల్లా కేంద్రమైన ఏలూరు కార్పొరేషన్‌లో 62 డివిజన్లలో మొత్తం 2,37,332 మంది ఓటర్లు ఉన్నారు. ఇతరులు 51 మంది, మహిళా ఓటర్లు 1,23,332, పురుష ఓటర్లు 1,13,332 మంది ఉన్నారు.ఇక్కడ మహి ళా ఓటర్లు 10,541 మంది అధికంగా ఉన్నారు. నూజివీడులో మొత్తం ఓటర్లు 42,952 మంది కాగా ఇతరులు 6గురు ఉన్నారు. మహిళా ఓటర్లు 22,425, పురుష ఓటర్లు 20,521 మంది ఉండగా, 1904 మంది మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు, జంగా రెడ్డిగూడెంలో మొత్తం ఓటర్లు 48,463 మంది కాగా, ఇతరులు 29 మంది ఉన్నారు. మహిళా ఓటర్లు 25,025 మంది, పురుష ఓటర్లల 23,409 మంది ఉన్నారు. అత్యధికంగా 1616 మంది మహిళా ఓటర్లు ఉన్నారు.

50 శాతానికి పైగా అభ్యర్థిత్వం..

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికలను మహిళలు శాసించనున్నారు. మరోవైపు గెలుపుగుర్రాల కోసం నేతలు అన్వేషిస్తుండగా బరిలో దిగాలనుకునే ఆశా వహులు మంతనాల్లో నిమగ్నమయ్యారు. బీసీ, ఇతర రిజ ర్వేషన్లు కలిపి మొత్తం 50శాతం వారికే ఇవ్వడంతో మ హిళా సాధికారిత పెరగనుంది. మహిళలు మహరాణుల్లా ఎన్నికల్లో పోటీ చేసి.. ఏలికలుగా అవతారం ఎత్తనున్నారు. ఏలూరు జిల్లాలోని ఏలూరు నగరపాలక సంస్థతో పాటు జంగారెడ్డిగూడెం,నూజివీడు, ఆకివీడు, నరసాపురం మున్సి పాల్టీల పరిధిలో మహిళా ఓటర్లే అత్యధికం కావడం విశే షం. కాగా పోటీల్లో పురుషులతో పాటు 50శాతం మంది పోటీకి సైఅంటున్నారు. రిజర్వేషన్లపరంగా సీట్ల కేటాయిం పుతో పాటు ఇంకా అదనంగా జనరల్‌ డివిజన్లలో పోటీ చేసే అవకాశాలుండటంతో మహిళలు ఆయా వార్డుల్లో పురు షులను మించిపోయే అవకాశం ఉంది. ఓటర్ల పరంగా చూస్తే ఈ మూడు చోట్ల కూడా పురుషులపై మహిళా ఓటర్లదే పైచేయిగా ఉంది. ఏలూరు జిల్లాలో 14వేల061 మంది, పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురం, ఆకివీడు రెండు పట్టణాల్లో 3,378 మహిళా ఓటర్ల అధికంగా ఉన్నారు.వీరే అభ్యర్థుల జాతకాలను తమ గుప్పిట్లో ఉంచు కున్నారనడంలో సందేహం లేదు.

నరసాపురంలో సగానికి సగం..

నరసాపురం: పట్టణ పరిధిలో 36 వార్డుల్లోనూ మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. మొత్తం 46,966 మంది ఓటర్లు ఉండగా వారిలో పురుషులు 22,389, మహిళలు 24606 మంది, ట్రాన్స్‌జండర్‌ ఒకరు ఉన్నారు. ఇందులో బీసీలు 20,567, ఎస్టీలు 5,678, ఎస్టీలు 616 మంది ఉన్నారు. మహిళలకు 18 సీట్లు కేటాయించారు.

అధిక శాతం మహిళలే పోటీ..

ఆకివీడు: ఆకివీడు నగర పంచాయతీలో 28 వార్డుల్లో మొత్తం 24,852 ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 11,845 మంది ఉండగా మహిళలు 13,006 మంది ఉన్నారు. ఇతరులు ఒకరు ఉండగా 14 వార్డులను మహిళలకు కేటాయించారు. ఈ నగర పంచాయతీలో అధిక శాతం మహిళలే పోటీ చేయడం విశేషం..

సోషల్‌ మీడియాలో ఎన్నికల సందడి..!

ఏలూరు రూరల్‌:అభ్యర్థులు తమ ప్రచారా లకు పదునుపెట్టారు. వీలైనంత త్వరగా ఓటరు మనస్సు గెలుచుకునేందుకు పోటీ పడుతున్నారు. వీధి చర్చలకు బదులుగా వాట్సాప్‌ సందేశాలు, సోషల్‌ మీడియా స్టేటస్‌ల ద్వారా ఆశావాహులు ఆత్మీయ సందేశాలు పంపుతున్నారు. మరోవైపు పోటీలో ఎవరిని విజయలక్ష్మి వరిస్తుందనే తెలు సుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. సోషల్‌ మీడి యా ద్వారా ప్రజలకు చేరువయ్యే ప్రయత్నం చేస్తు న్నారు. తాము గెలిస్తే గ్రామాలు, పట్టణాలకు ఏం చేస్తామో సందేశాలు పంపుతున్నారు. కర పత్రాలు, గోడలపై రాతలతో మరింతగా ఓటరు వద్దకు తమ సందేశాన్ని చేరవేస్తున్నారు. అభ్యర్థులు ప్రత్యేకంగా పోస్టులు, వీడియోలు రూపొందించి ఓటరుపై సంధిస్తున్నారు.ఎన్నికల సందడి పెరు గుతున్న కొద్దీ సామాజిక మాధ్యమాల్లోకి మరిం త చొచ్చుకెళ్తున్నారు..

కుక్కునూరులో పోలీసుల ఫ్లాగ్‌ మార్చ్‌

కుక్కునూరు, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి):ఏజెన్సీ ప్రాంతం కావడంతో పాటు, కుక్కునూరు మండలం గతంలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతంగా ఉన్న నేప థ్యంలో ఎలాంటి అవాంచనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్‌ శాఖ ముందస్తు భద్రతా చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా పోలీస్‌ అధికారులు, జిల్లా స్పెషల్‌ పార్టీ సిబ్బంది ప్లాగ్‌ మార్చ్‌లో పాల్గొని గ్రామంలోని ప్రధాన రహ దారులు, ముఖ్య కూడళ్లలో కవాతు నిర్వహించారు. ఎన్నికల ప్రకియ్ర పూర్తయ్యే వరకు కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో పోలీస్‌ నిఘా, భద్రతా చర్యలు, కొనసాగుతాయని పోలీస్‌ అధికారులు తెలిపారు. ప్రజలు ఎన్నికల నియమాలు పాటిస్తూ శాంతియుత వాతావరణంలో ఎన్నికల ప్రక్రియకు సహకరించాలని కోరారు. అన్ని గ్రామాల్లో విస్తృతంగా కూంబింగ్‌ ఆపరేషన్లు నిర్వహిస్తామని అను మానాస్పద వ్యక్తులు సంచరిస్తే పోలీసులకు సమాచారమివ్వాలని ఎస్సై రాజా రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

Updated Date - Oct 22 , 2026 | 01:08 AM