Share News

ఎల్‌నినో షాక్‌

ABN , Publish Date - Sep 11 , 2026 | 12:28 AM

సూపర్‌ ఎల్‌నినో ప్రభావం విద్యుత్‌ ఉత్ప త్తిపై పడుతోంది. విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాల్లో తరచూ విద్యుత్‌ ఉత్పత్తికి అంతరాయం ఏర్ప డుతోంది. ఏపీ ఈపీడీసీఎల్‌ పరిధిలో రెండు విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాల్లో 1,320 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి నిలిచిపోయింది.

 ఎల్‌నినో షాక్‌

విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలపై ప్రభావం

హిందూజా, కృష్ణపట్నం థర్మల్‌ స్టేషన్స్‌లో నిలిచిపోయిన 1,320 మెగా వాట్ల ఉత్పత్తి

ఏపీఈపీడీసీఎల్‌ పరిధిలో ఏలూరు జిల్లాకు అత్యధికంగా 214 మెగావాట్ల విద్యుత్‌ లోటు

జిల్లాలో 4 నుంచి 6 గంటలు విద్యుత్‌ కోతలు

(ఏలూరుసిటీ–ఆంధ్రజ్యోతి)

సూపర్‌ ఎల్‌నినో ప్రభావం విద్యుత్‌ ఉత్ప త్తిపై పడుతోంది. విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాల్లో తరచూ విద్యుత్‌ ఉత్పత్తికి అంతరాయం ఏర్ప డుతోంది. ఏపీ ఈపీడీసీఎల్‌ పరిధిలో రెండు విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాల్లో 1,320 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి నిలిచిపోయింది. హిందూజా థర్మల్‌ పవర్‌ స్టేషన్‌లో 520 మెగావాట్లు, కృష్ణపట్నం థర్మల్‌ పవర్‌ స్టేషన్‌లో 800 మెగావాట్ల ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. ఏపీ ఈపీడీసీఎల్‌ పరిఽధిలోని 11 జిల్లాల పరిధిలో గురువారం 937.92 మెగావాట్ల విద్యుత్‌ లోటు ఏర్పడగా, అత్యధికంగా ఏలూరు జిల్లాలో 214 మెగావాట్ల విద్యుత్‌ లోటు ఏర్ప డింది. ఈ కారణంగా జిల్లాలో పగలు, రాత్రి అని లేకుండా 4 నుంచి 6 గంటల వరకు విద్యు త్‌ కోతలు విధించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. పరిశ్రమలకు 33.5 మెగావాట్లు, రూరల్‌లో 180.5 మెగావాట్లకు సంబంధించి విద్యుత్‌ కోత లు విధించాల్సి వచ్చిందని విద్యుత్‌ శాఖ ఉన్న తాధికారులు చెబుతున్నారు. గత ఆరు రోజు లుగా జిల్లాలో ఎమర్జెన్సీ లోడ్‌ రిలీఫ్‌ పేరుతో అప్రకటిత విద్యుత్‌ కోతలు అమలవుతున్నాయి.

విద్యుత్‌ కోతలతో విలవిల

విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాల్లో విద్యుత్‌కు లోటు ఏర్పడడంతో జిల్లాలో ఎమర్జెన్సీ లోడ్‌ రిలీప్‌ పేరిట రోజుకు 4నుంచి 6 గంటల పాటు ఈఎల్‌ఆర్‌ పేరుతో విద్యుత్‌ కోతలు విధిస్తు న్నామని చెబుతున్నా అనధికారంగా గ్రామీణ ప్రాంతాల్లో 6 నుంచి 8గంటల పాటు విద్యుత్‌ కోతలు విఽధిస్తున్నారని చెబుతున్నారు. ఈ అప్రకటిత విద్యుత్‌ కోతల కారణంగా ప్రజలు తీవ్ర అసౌకర్యానికి లోనవుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా వర్షాకాలంలో వేసవి కాలం నడుస్తుండటంతో పగటి పూట ఎండ తీవ్రత తట్టుకోలేకపోవడం, మరో పక్క అప్రక టిత విద్యుత్‌ కోతలతో ప్రజలు తీవ్ర అసౌకర్యా నికి లోనవుతున్నారు. రాత్రి సమయాల్లో విద్యు త్‌ కోతలతో వృద్ధులు, చిన్నారులు తీవ్ర ఇబ్బం దులు ఎదుర్కొంటున్నారు.

సోలార్‌ ఆదుకుంటోంది..

పీఎం సూర్యఘర్‌ పథకంలో సోలార్‌ ప్యానెల్స్‌తో విద్యుత్‌ కనెక్షన్లు ఏర్పాటు చేసుకుని సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తి చేయడం వల్ల కొంత విద్యుత్‌లోటు తగ్గిందని చెబుతున్నారు. సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తి లేకపోతే విద్యుత్‌ కోతలు మరింత తీవ్రంగా ఉండేవని చెబుతున్నారు.

ప్రత్యామ్నాయం తప్పదు!

సూపర్‌ ఎల్‌నినో ప్రభావం జిల్లాలో సార్వా సాగుపై తీవ్ర చూపించింది. సాధారణ వరి విస్తీర్ణం 2.16 లక్షలు ఎకరాలు 1.35 లక్షల ఎక రాల్లోనే సాగు జరిగింది. ఈ పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ పంటలుగా అపరాలు సాగు చేయాలని జిల్లా వ్యవసాయ శాఖ సూచించింది. ఈ మేరకు ఎంత మొత్తంలో విత్తనాలు అవసరమవు తాయో రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతి పాదనలు పంపారు. ప్రత్యామ్నాయ పంటలుగా అపరాల సాగుకు మిను ములు, పెసలు, రాగులు విత్తనాలను రైతులకు 80 శాతం సబ్సిడీపై అందించాలని నిర్ణయించారు. ఐదెకరాలకు మించకుండా ఈ విత్తనాలను అందించనున్న ట్టు జిల్లా వ్యవసాయ శాఖ జేడీ హబీబ్‌బాషా తెలిపారు. ఖాళీగా ఉన్న భూముల్లో తక్కువ నీటితో సాగు చేసే స్వల్పకాలిక పంటలు వేసుకోవాలని రైతులకు సూచించారు. జిల్లాలో నెలకొన్న సూపర్‌ ఎల్‌నినో పరిస్థితుల్లో తక్కువ నీటితో సాగు అయ్యే ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయడానికి రైతులు సన్నద్దమవుతున్నా రు. రాష్ట్ర ప్రభుత్వం 80శాతం రాయితీపై అపరాలు విత్తనాలు సరఫరా చేస్తుండటంతో వాటిని కొనుగోలు చేసి వరితో పాటు ఇతర పంటలు సాగు చేయని భూముల్లో వాటి సాగుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

Updated Date - Sep 11 , 2026 | 12:28 AM