Share News

కరుణించని ప్రకృతి

ABN , Publish Date - Jul 24 , 2026 | 12:46 AM

ఎల్‌నినో ప్రభావంతో జూలైలోను వర్షాలు అంతంత మాత్రంగానే కురు స్తున్నాయి. జూన్‌లో జిల్లాలోని 12 మండలాల్లో సాధారణం కన్నా తక్కువగా వర్షపాతాలు నమోదు కాగా జూలైలో పూర్తిగా వర్షాలు మందగించడంతో ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికను జిల్లా వ్యవ సాయ శాఖ సిద్ధ్దం చేసింది.

కరుణించని ప్రకృతి

ఎల్‌నినో.. ప్రత్యామ్నాయ పంటలే మేలు!

జిల్లాలో వర్షాభావ పరిస్థితులు

ఖరీఫ్‌లో ప్రత్యామ్నాయ పంటల సాగు ప్రణాళిక

రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిన జిల్లా వ్యవసాయ శాఖ

వరికి ప్రత్యామ్నాయ పంటలుగా మినుము, పెసర, వేరుశనగ, రాగి, జొన్నలు పంటలు

(ఏలూరుసిటీ–ఆంధ్రజ్యోతి)

ఎల్‌నినో ప్రభావంతో జూలైలోను వర్షాలు అంతంత మాత్రంగానే కురు స్తున్నాయి. జూన్‌లో జిల్లాలోని 12 మండలాల్లో సాధారణం కన్నా తక్కువగా వర్షపాతాలు నమోదు కాగా జూలైలో పూర్తిగా వర్షాలు మందగించడంతో ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికను జిల్లా వ్యవ సాయ శాఖ సిద్ధ్దం చేసింది. ఏఏ పంటలు ప్రత్యామ్నాయంగా సాగు చేయాలి, ఎంతెంత విత్తనాలు అవసరమవుతాయో ప్రణాళికలో పేర్కొంది.

జిల్లాలో 2.10 లక్షల ఎకరాల్లో వరి సాగు జరగాల్సి ఉండగా ఇంతవరకు 50 వేలు ఎకరా ల్లో మాత్రమే నాట్లు పడ్డాయి. వర్షాలు కురియక పోవడంతో పంట తడులకు నీరు అందించలేని పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ పంట లు సాగు చేయకపోతే రైతులు ఆర్థికంగా నష్ట పోవాల్సి వస్తుంది. ఈనేపథ్యలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికను సిద్ధం చేసి ప్రతిపాదనలు పంపాలని కోరడంతో జిల్లా వ్యవ సాయ శాఖ ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక ను సిద్ధం చేసి ప్రతిపాదనలు పంపింది.

ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక ఇలా..

జిల్లాలో 28,092.50 ఎకరాల్లో మినుము, 11,905 ఎకరాల్లో పెసలు, 7142.50 ఎకరాల్లో వేరుశనగ, 237.5 ఎకరాల్లో రాగి, 237.5 ఎక రాల్లో జొన్నలు సాగు చేయాలని ప్రణాళికలో పేర్కొన్నారు. దీని కోసం జిల్లాకు మినుమ విత్త నాలు 2,247 క్వింటాళ్లు, పెసర విత్తనాలు 952 క్వింటాళ్లు, వేరుశనగ విత్తనాలు 3,714 క్వింటా ళ్లు, రాగి విత్తనాలు 19 క్వింటాళ్లు, జొన్న విత్త నాలు 10 క్వింటాళ్లు అవసరం అవుతాయని ఆ ప్రతిపాదనల్లో జిల్లా వ్యవసాయ శాఖ పేర్కొం ది. ఈ పంటలు సాగు చేపట్టడానికి ఆగస్టు 15 వ తేదీని కట్‌ ఆఫ్‌ డేట్‌గా పేర్కొన్నారు.

రాష్ట్రంలో ప్రధాన పంటగా వరి సాగు చేసే జిల్లాల్లో ఏలూరు జిల్లా ఒకటి. జిల్లాలో ఖరీఫ్‌లో సాధారణ సాగు విస్తీర్ణం 2,35,318 ఎకరాలు కాగా ఇందులో వరి సాధారణ విస్తీర్ణం 2,11,412 ఎకరాలుగా వుంది. అంటే ఖరీఫ్‌ సాగులో 90 శాతం వరి పంట సాగే జిల్లాలో జరుగుతోందని చెప్పవచ్చు. ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌లో ఎల్‌నినో ప్రభావం కారణంగా సాధారణం కంటూ తక్కు వ వర్షపాతం, అధిక ఉష్ణోగ్రతలు, దీర్ఘకాలిక వర్షాభావ పరిస్థితులు, కాలువల ద్వారా నీటి లభ్యత తగ్గే అవకాశం ఉంది. జూన్‌ 1వ తేదీ నుంచి జూలై 20వ తేదీ వరకు జిల్లాలో సాధారణ వర్షపాతం 247.4 మిల్లీ మీటర్లు కాగా కేవలం 137.2 మి.మీ మాత్రమే నమో దైంది. అంటే జిల్లాలో 44 శాతం వర్షపాతం లోటు నమోదైంది. ఈ పరిస్థితుల్లో అధిక నీటి అవసరమున్న వరి పంట సాగు రైతులకు అధిక ప్రమాదాన్ని కలిగించే అవకాశం వుంది. సాధారణంగా వరి పంటకు 120 నుంచి 150 రోజులు కాలపరిమితి ఉండి, పంట కాలంలో 1,200 నుంచి 1,600 మి.మీ వరకు నీరు అవసరమవుతుంది. దీనికి బదులుగా మినుము (65–75 రోజులు), పెసర (60–70 రోజులు), వేరుశనగ(100 నుంచి 110 రోజులు), రాగులు (95–110 రోజులు), జొన్నలు (95–110 రోజులు) వంటి ప్రత్యామ్నాయ పంటలు తక్కువ నీటితో సాగు చేయవచ్చు. మెట్ట ప్రాంత మండలాల్లో బోర్ల కింద వరి సాగును వీలైనంత వరకు తగ్గించి, నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని మినుములు, పెసలు, వేరుశనగ, రాగులు, జొన్నలు వంటి ప్రత్యామ్నాయ ఆరుతడి పంట లు సాగును చేపట్టటం రైతులకు మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ పంటలు ఎండ పరిస్థితులను మెరుగ్గా తట్టుకుని రైతు లకు స్థిరమైన దిగుబడిని అందించడంతో పాటు వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించడం లోను దోహదపడతాయి. వర్షాభావ పరిస్థితు లు ఏర్పడితే రైతులకు సహాయంగా రాష్ట్ర ప్రభు త్వం ముందస్తు ప్రణాళికలను సిద్ధం చేసింది. అవసరమైన ప్రాంతాల్లో పంటల వైవిద్యీకర ణను ప్రోత్రహించేందుకు మినుములు, పెసర్లు, వేరుశనగ, రాగులు, జొన్నలు పంటల విత్తనా లను అవసరాన్ని బట్టి అందు బాటులో ఉన్న మేరకు అర్హులైన రైతులకు ప్రభుత్వం అంద జేయాలని నిర్ణయించింది.

ఆరుతడి పంటలు ఉత్తమం

రైతులు వాతావరణ మార్పులను ఎప్పటి కప్పుడు గమనిస్తూ వ్యవసాయ శాఖ సూచిం చిన శాస్త్రీయ సాగు పద్ధతులను అనుసరించి నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని పంటలను ఎంపిక చేసుకోవాలి. జిల్లాకు సంబంధించి సార్వా సాగులో వరికి ప్రత్యామ్నాయంగా పంటలు సాగుకు సంబంధించి ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికను కలెక్టర్‌ వెట్రిసెల్వి పర్య వేక్షణలో సిద్ధం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపించాం. ఎల్‌నినో ప్రభావంతో జిల్లాలో వర్షాలు పూర్తిగా మందగించాయి. ఈ పరిస్థితు ల్లో ఆరుతడి పంటల సాగు ఉత్తమం.

– షేక్‌ హబీబ్‌బాషా, జిల్లా వ్యవసాయ శాఖాధికారి

Updated Date - Jul 24 , 2026 | 12:46 AM