200 కోడిగుడ్లు గాలికొదిలేశారు!
ABN , Publish Date - Apr 14 , 2026 | 12:20 AM
అంగన్వాడీ కేంద్రాలకు చేరాల్సిన కోడిగుడ్లు దాదాపు వారం రోజులుగా మండలంలోని వేంపాడుకు చెందిన ఓ వ్యక్తి ఇంట్లో నిరుపయోగంగా పడి వున్నాయి.
వేంపాడులో పౌష్టికాహారం దుస్థితి
ద్వారకాతిరుమల, ఏప్రిల్ 13(ఆంధ్రజ్యోతి):చిన్నా రులు, గర్భిణులు, బాలింతలకు అందాల్సిన పౌష్టికాహారం కొందరి నిర్లక్ష్యం, ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం కార ణంగా పక్కదారి పడుతోంది. కొన్నిసార్లు నిరుపయోగం గా మారి ప్రభుత్వ లక్ష్యానికి గండిపడుతోంది. తాజాగా అంగన్వాడీ కేంద్రాలకు చేరాల్సిన కోడిగుడ్లు దాదాపు వారం రోజులుగా మండలంలోని వేంపాడుకు చెందిన ఓ వ్యక్తి ఇంట్లో నిరుపయోగంగా పడి వున్నాయి. అయినా అంగన్వాడీ కేంద్ర నిర్వాహకులు ఆ వైపు కన్నెత్తి చూడ డం లేదు. వేంపాడులోని సరిహద్దు సుజాత అనే మహి ళ ఇంటి వద్ద దాదాపు 200 వరకు అంగన్‌వాడీ కేంద్రాని కి చెందిన కోడిగుడ్లు ఉండడాన్ని స్థానికులు గుర్తించారు. ఆ గుడ్లు ఇక్కడ ఎందుకు ఉన్నాయని నిలదీశారు. గత మంగళవారం ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో ఆ గ్రామంలో సిమెంటు రోడ్డు నిర్మాణం పనులు జరిగాయి. అదే సమయంలో అంగన్వాడీ కేంద్రానికి ఆటోలో కోడి గుడ్లు వచ్చాయి. రోడ్డు పనుల వల్ల ఆటో అంగన్వాడీ కేంద్రానికి వెళ్లలేకపోవడంతో టీచర్ వచ్చి మరుసటిరోజు వాటిని తీసుకెళ్తారని చెప్పి సుజాత ఇంటి వద్ద కోడి గుడ్లను దించి ఆటో డ్రైవర్ వెళ్లిపోయాడు. ఇది జరిగి వారం రోజులు గడుస్తున్నా అంగన్వాడీ టీచర్ తనకు సంబంధం లేదన్నట్లు నిర్లక్ష్యం వహించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. టీచర్ నిర్వాకం కారణంగా వారం రోజులుగా గుడ్లు నిరుపయోగంగా మారాయి. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి సమగ్ర విచారణ జరపాలని స్థానికులు కోరుతున్నారు.