ఈగల్ టీం ముమ్మరంగా తనిఖీలు
ABN , Publish Date - Apr 22 , 2026 | 12:47 AM
మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టేం దుకు ఈగల్ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో భారీ తనిఖీలు మంగళవారం నిర్వహించారు. ఏలూరు జిల్లా ఎస్పీ కెపిఎస్ కిషోర్ ఆదేశాల మేరకు ఈగల్ ఐజీపీ ఆర్‌కె రవికృష్ణ ఆధ్వ ర్యంలో ఏలూరు రైల్వే స్టేషన్‌లో పోలీస్‌శాఖ, ఎక్సైజ్, జిఆర్‌పి, ఆర్‌పిఎఫ్ అధికారుల సమ న్వయంతో ఈ తనిఖీలు చేశారు.
మాదక ద్రవ్యాల రవాణాపై ఉక్కుపాదం
రైళ్లలో ఈగల్ టీం ముమ్మరంగా తనిఖీలు
ఏలూరు క్రైం, ఏప్రిల్ 21(ఆంధ్రజ్యోతి): మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టేం దుకు ఈగల్ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో భారీ తనిఖీలు మంగళవారం నిర్వహించారు. ఏలూరు జిల్లా ఎస్పీ కెపిఎస్ కిషోర్ ఆదేశాల మేరకు ఈగల్ ఐజీపీ ఆర్‌కె రవికృష్ణ ఆధ్వ ర్యంలో ఏలూరు రైల్వే స్టేషన్‌లో పోలీస్‌శాఖ, ఎక్సైజ్, జిఆర్‌పి, ఆర్‌పిఎఫ్ అధికారుల సమ న్వయంతో ఈ తనిఖీలు చేశారు. ఒడిస్సా రాష్ట్రం నుంచి వచ్చే రైళ్ళపై ప్రత్యేక నిఘా ఉం చారు. అనుమానాస్పద వ్యక్తులను, వారి లగేజీలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ప్రయాణి కులకు, విద్యార్థులకు మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించారు. మాదక ద్రవ్యాల వినియోగం, రవాణాపై ఎన్‌డీపీఎస్ చట్టం చాలా కఠినంగా ఉంటుందని 20 ఏళ్ల వరకు జైలు శిక్ష పడుతుందన్నారు. విద్యార్థులు, యువత చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని అధికారులు కోరారు. మాదక ద్రవ్యాలకు సంబంధించి ఎలాంటి సమాచారమున్నా వెంటనే ఈగల్ టోల్ ఫ్రీ నెంబర్ 1972కి ఫిర్యాదు చేయాలన్నారు. ఈ తనిఖీల్లో ఎక్సైజ్ సీఐ ధనరాజు, ఆగల్ ఆర్‌ఎస్‌ఐ బి ఉదయభాస్కర్, ఎక్సైజ్ ఎస్‌ఐ గౌరీ శంకర్ పాల్గొన్నారు.