పశ్చిమకు విద్యాధికారం
ABN , Publish Date - Nov 23 , 2026 | 12:11 AM
ప్రభుత్వ విద్యా విధానాలను నడిపించేందుకు జిల్లా విద్యాశాఖకు ఇక నుంచి పూర్తి అధికారం రానుంది.
ఐదేళ్లుగా ఏలూరు నుంచి కీలక విధానాలు అమలు
పోస్టుల విభజనపై అధికారుల కసరత్తు
డిసెంబరు నెలాఖరుకు పూర్తిస్థాయి విభజన
జనవరి నుంచి కార్యకలాపాలు ఆరంభం
బదిలీలు, పదోన్నతులు ఇక్కడి నుంచే జరుగుతాయి
భీమవరం రూరల్, నవంబరు 22(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ విద్యా విధానాలను నడిపించేందుకు జిల్లా విద్యాశాఖకు ఇక నుంచి పూర్తి అధికారం రానుంది. కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా జిల్లాల విభజన జరిగి ఐదేళ్లు కావస్తున్న ఇప్పటి వరకు ఏలూరు జిల్లా నుంచే విద్యాశాఖకు సంబంధించిన కీలక విధానాలు అమలు చేస్తున్నారు. వచ్చాయి. కొత్త జిల్లాలకు అధికారుల విభజనలో భాగంగా ప్రభుత్వం విద్యాశాఖలో జిల్లా పోస్టుల విభజన ప్రక్రియ చేపట్టింది. పోస్టులు, ఉద్యోగుల విభజన వేగవంతంగా జరుగుతుంది. డిసెంబరు నెలఖరు కల్లా పోస్టులు విభజన చేయడానికి కార్యాచరణ జరుగుతోంది. దీంతో దాదాపు జనవరి నుంచి పశ్చిమ గోదావరి జిల్లా విద్యాశాఖలో అధికారికంగా పని చేయనుంది. జిల్లా
జిల్లాల విభజన జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇన్చార్జి డీఈవో పోస్టులను కొనసాగిస్తూ వచ్చారు. పోస్టుల విభజన అనంతరం పర్మినెంట్ డీఈఓ పోస్టు ఏర్పాటు చేయ్యల్సి ఉంటుంది. ఆ ప్రక్రియను కొనసాగి స్తున్నారు. కొత్త జిల్లాలకు కావల్సిన డీఈవోల ఏర్పాటు పరిశీలనలో ఉంది. జిల్లా విద్యాశాఖలో కావల్సిన అన్ని ఏర్పాట్లు, పోస్టులు ఈ విభజన విభాగంలోనే జరుగుతాయి. దాంతోపాటు ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో పని చేసే అఽధికారుల సర్దుబాటు కూడా వారి నిర్ణయం మేరకు మార్పులు చేసుకోవచ్చు.
ఇక నుంచి అన్నీ ఇక్కడి నుంచే..
పశ్చిమ గోదావరి జిల్లా విద్యాశాఖలో ఉద్యోగుల బదిలీలు, డీఎస్సీ, ప్రభుత్వ కార్యక్రమాలు ఇప్పటి వరకు ఏలూరు జిల్లా నుంచి నిర్ణయాలు అమలు చేస్తూ వచ్చారు. విద్యాశాఖ పోస్టుల విభజన జరిగిన తరువాత విద్యాశాఖ కార్యకలాపాలు అన్నీ ఇక్కడి నుంచే జరుగుతాయి. ఉపాధ్యా యుల బదిలీలు, పదోన్నతుల ప్రాసెస్ అంతా ఇక్కడే చేయనున్నారు. వచ్చే డీఎస్సీ నియామక ప్రక్రియ కూడా ఇక్కడే జరగనుంది. ఉపాధ్యాయుల సర్దుబాటు, పాఠశాలకు సంబంధించిన విధి విధానాలన్నిటికి జిల్లాలోని విద్యాశాఖకు పూర్తి అధికారం ఉంటుందని అధికారవర్గాలు చెబుతున్నాయి.