Share News

వంట నూనెల ధర పైపైకి..

ABN , Publish Date - Mar 14 , 2026 | 12:11 AM

ఇజ్రాయెల్‌–ఇరాన్‌ యుద్ధం నేపఽథ్యంలో జిల్లాలో కృత్రిమ కొరత సృష్టిస్తూ ధరలను పెంచేస్తున్నారు. వంట నూనె ధరలు సెగలు పుట్టిస్తున్నాయి.

 వంట నూనెల ధర పైపైకి..

వంట నూనెల ధర పైపైకి..

పాలకొల్లు/తాడేపల్లిగూడెం, మార్చి 13(ఆంధ్రజ్యోతి):ఇజ్రాయెల్‌–ఇరాన్‌ యుద్ధం నేపఽథ్యంలో జిల్లాలో కృత్రిమ కొరత సృష్టిస్తూ ధరలను పెంచేస్తున్నారు. వంట నూనె ధరలు సెగలు పుట్టిస్తున్నాయి. గత నాలుగు రోజులతో పోల్చితే ధరలు మరింత పెరిగాయి. పాల కొల్లులో 15కిలోల డబ్బా నూనెపై రకాన్ని బట్టి డబ్బాకి రూ.150 నుంచి 200 ధర పెంచేశారు. సన్‌ప్లవర్‌ వంట నూనె ధర భారీగా పెంచగా పామాయిల్‌ డబ్బాకి రూ.150 పెంచారు. వేరుశెనగ నూనె ధరలు స్వల్ప ంగా పెరిగాయి. నువ్వులు నూనె(పప్పునూనె) ధరలు పెరగనప్పటికీ విచ్చలవిడిగా పప్పు నూనెలో పామాయిలు కల్తీ కలిపి అమ్మేస్తున్నారు. తాడేపల్లిగూడెంలో నాలు గు రోజులు క్రితం మార్కెట్లో 750 గ్రాముల నూనె ప్యాకెట్‌ ధర రూ.112 ఉండేది. ఇప్పుడు ధర రూ.122కు పెరిగింది. పెద్దపెద్ద మాల్స్‌లో స్టాక్స్‌ తక్కు వగా పెడు తున్నారు. ఇది ఇలా ఉంటే హోల్‌సేల్‌ వ్యాపారులు రిటైల్డ్‌ వ్యాపారు లకు సరి పోయినంత సరకు ఇవ్వడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. లీటర్‌ (910 గ్రాములు) ఉండే పామాయిల్‌ ప్యాకెట్‌ రిటైల్‌గా రూ.130, ఫ్రీడమ్‌ సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ లీటర్‌ ప్యాకెట్‌ రూ.176, వేరుసెనగ ఆయిల్‌ ప్యాకెట్‌ రూ.182కు విక్ర యిస్తున్నారు.

70శాతం ఇతర దేశాలపైనే ఆధారం

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రోజుకు 70టన్నులు నూనె వినియోగిస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. యుద్ధ ప్రభావంతో నూనె దిగు మతులు తగ్గడం ధరలు మరింత పెరుగుతున్నాయి. జిల్లాలో వాడే వంటనూనెలో 70శాతం పైగా ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకున్నదే. దేశంలో దిగుమతి అయ్యే వంట నూనెలో 95 శాతం జల మార్గం ద్వారానే అవుతోంది. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తల వల్ల సముద్ర రవాణాకు అంతరాయం ఏర్పడింది.

ముడి సరుకు లేదు... శుద్ధి లేదు

జిల్లాకు వంటనూనెకు సంబంధించిన ముడి సరుకు జలమార్గం ద్వారానే జరుగుతుంది. కాకినాడ, కృష ్ణపట్నం పోర్టు నుంచే ముడి ఆయిల్‌ వస్తుంది. రిఫై నరీలో శుద్ధి చేసి ప్యాకి ంగ్‌, డబ్బాల్లో నింపి విని యోగదారులకు అందజేస్తుంటారు. సింగపూర్‌, మలేషి యాల్లో పామాయిల్‌ను ఎక్కువగా సాగుచేస్తుంటారు. ఇక సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌కు సంబంధించిన ముడి సరకు ఇండోనేషియా ద్వారా భారత దేశానికి వస్తుంది. యుద్ద ప్రభావంతో జల రవాణాకు కొంత సమస్య ఏర్పడింది. ఇలాంటి పరిస్థి తుల్లో ఇతర దేశాల నుంచి ముడి సరుకు రావడం తగ్గింది. దీంతో ఇక్కడ శుద్ధి చేసే ప్లాంట్లు ఖాళీగా ఉన్నాయి. ఇదే అదనుగా చేసుకుని హోల్‌సేల్‌ వ్యాపా రులు సిండికేట్‌గా మారి సరకు డంప్‌ చేసి ఽధర మరింత పెంచి అమ్మేందుకు మాటు వేసుకుని కూర్చు న్నట్లు ఆరోపణలు వస్తు న్నాయి.

Updated Date - Mar 14 , 2026 | 12:11 AM