Share News

ఈ–క్రాప్‌ పూర్తి

ABN , Publish Date - Oct 06 , 2026 | 12:10 AM

జిల్లాలో సార్వా సీజన్‌కు సంబంధించి ధాన్యం కొనుగోలు ప్రక్రియకు అత్యంత కీలకమైన ఈ క్రాప్‌ నమోదు పూర్తయింది.

ఈ–క్రాప్‌ పూర్తి
సార్వా పంట ఈ క్రాప్‌ నమోదు చేస్తున్న భీమవరం వ్యవసాయాధికారి ప్రసాద్‌ (ఫైల్‌)

2,29,420 ఎకరాల్లో సాగు

6.5 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని అంచనా

ధాన్యం కొనుగోలుకు సర్వం సిద్ధం..

ఐదున్నర లక్షల టన్నుల సేకరణే లక్ష్యం

ముంపు లేకపోవడంతో పెరగనున్న దిగుబడులు

జిల్లాలో సార్వా సీజన్‌కు సంబంధించి ధాన్యం కొనుగోలు ప్రక్రియకు అత్యంత కీలకమైన ఈ క్రాప్‌ నమోదు పూర్తయింది. నాట్లు వేసినప్పటి నుంచి ప్రతి దశలోనూ వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో తిరిగి రైతుల సాగు వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. జిల్లావ్యాప్తంగా రెండు లక్షల 29 వేల 420 ఎకరాల్లో వరి సాగు జరిగినట్లు అధికారికంగా నిర్ధారణ అయింది. కేవలం 77 ఎకరాల్లో మాత్రమే ఇతర పంటలు వేశారని, ఇంకా కొద్దిపాటి భూముల్లో ఈ క్రాప్‌ నమోదు చేయాల్సి ఉందని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సునీత వెల్లడించారు.

(భీమవరం రూరల్‌–ఆంధ్రజ్యోతి):

ప్రభుత్వం ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాల ద్వారా మద్దతు ధరకు ధాన్యం అమ్ముకోవాలంటే ఈ క్రాప్‌ నమోదు తప్పనిసరి. ఆన్‌లైన్‌లో నమోదు పూర్తయిన రైతుల వివరాలు మాత్రమే కొనుగోలు కేంద్రాల్లోని సిస్టమ్‌లో కనిపిస్తాయి. దీని ఆధారంగానే రైతులు తమ పంటను ఎలాంటి ఇబ్బందులు లేకుండా విక్రయించుకునే వీలుంటుంది. ఈ క్రాప్‌లో వివరా లు నమోదు కాని పక్షంలో విక్రయాలకు అవకాశం ఉండదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని రైతులు, వ్యవసాయ అధికారులు సమన్వయంతో అప్రమత్తంగా వ్యవహరించి ఈ క్రాప్‌ నమో దును పూర్తిస్థాయిలో ముగించారు. ఈ ఏడాది ఎల్‌నినో ప్ర భావం వల్ల వర్షాలు తక్కువే కురిసినప్పటికీ.. డెల్టా ప్రాం తంలో వరి సాగుకు నీటి ఇబ్బందులు తలెత్తలేదు. మరోవైపు భారీ వర్షాలు లేకపోవడంతో నారుమడి, నాట్ల దశలో పంట కు ముంపు సమస్య ఎదురుకాలేదు. గడిచిన సీజన్లలో ఏటా దాదాపు 30 వేల నుంచి 50 వేల ఎకరాల వరకు పంట నీట మునిగేది. ఈసారి వాతావరణం అనుకూలించడంతో సార్వా దిగుబడి భారీగా పెరిగే అవకాశం ఉందని రైతులు ఆశా భావం వ్యక్తం చేస్తున్నారు.

అందుబాటులో గోనె సంచులు

జిల్లాలో సాగైన విస్తీర్ణం రెండు లక్షల 29 వేల 420 ఎకరాల నుంచి సుమారు ఆరున్నర లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఇందులో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా ఐదున్నర లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి లక్షా 20 వేల గోనె సంచులు అవసరం కాగా.. ముందుస్తుగా లక్షా 85 వేల గోనె సంచులను అందుబాటులో ఉంచినట్లు పౌరసర ఫరాల శాఖ అధికారులు స్పష్టం చేశారు.

ఏలూరు జిల్లాలో..

ఈ ఏడాది 2.14 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయాలని ప్రణాళిక సిద్ధం చేశారు. సూపర్‌ ఎల్‌నినో ప్రభావంతో జూన్‌, జూలై, ఆగస్టు నెలల్లో వర్షాలు మొఖం చాటేయడంతో సాగు విస్తీర్ణం లక్షా 35 వేల ఎకరాలకు పడిపోయింది. సెప్టెంబరు లో కురిసిన వర్షాలు వరి పంటకు జీవం పోయడంతో సాగు విస్తీర్ణం మరో 51,000 ఎకరాలు పెరిగింది. అయినప్ప టికి దిగుబడి అంచనాలు భారీగా తగ్గి.. 5,10,134 మెట్రిక్‌ టన్నులు వస్తాయని వ్యవసాయ శాఖ భావిస్తోంది.

Updated Date - Oct 06 , 2026 | 12:10 AM