అమరావతి ఆర్థిక జోన్‌తో మహర్దశ
ABN , Publish Date - Sep 04 , 2026 | 12:12 AM
అమరావతి ఆర్థికజోన్ ఏర్పాటుతో ఏలూరు జిల్లా రూపురేఖలు సమగ్రంగా మారను న్నా యి. కొద్దినెలల క్రితమే దీనిపై ప్రభుత్వం కసరత్తు చేయగా, అమరావతి ఆర్థిక ప్రాంత సమగ్రాభివృద్ధిలో భాగంగా ఏలూరు జిల్లా ఆర్థిక జోన్‌లోకి చేరింది.
రూపురేఖలు మారనున్న ఏలూరు జిల్లా
త్వరలో సమగ్ర ప్రణాళిక తయారు
(ఏలూరు–ఆంధ్రజ్యోతి)
అమరావతి ఆర్థికజోన్ ఏర్పాటుతో ఏలూరు జిల్లా రూపురేఖలు సమగ్రంగా మారను న్నా యి. కొద్దినెలల క్రితమే దీనిపై ప్రభుత్వం కసరత్తు చేయగా, అమరావతి ఆర్థిక ప్రాంత సమగ్రాభివృద్ధిలో భాగంగా ఏలూరు జిల్లా ఆర్థిక జోన్‌లోకి చేరింది. రాబోయే కాలంలో బృహత్తర ప్రణాళికలను వివిధ రంగాల్లో అమలు చేయను న్నారు. అమరావతి ఎకనమిక్ జోన్‌లో తొమ్మిది జిల్లాలకు చోటు కల్పించారు. ఈ జోన్ అభివృద్ధి వ్యవహారాలపై విజయవాడలో బుధవారం సమ గ్ర వర్క్‌షాపు జరిగింది. దీనికి కలెక్టర్ వెట్రి సెల్వి హాజరై జిల్లా ప్రగతి సూచికలు, రాబోయే కాలంలో ఏయే అంశాల్లో ముందంజ వేయడా నికి వీలున్న రంగాలపై నివేదిక రూపంలో సమ ర్పించారు. విదేశీ పెట్టుబడులు, ఇతర సాంకేతిక పరిజ్ఞానంతో వ్యవసాయం, పరిశ్రమలు, విద్య, వైద్యం, పర్యాటకంగా జిల్లా ప్రగతిబాట పట్టే అవకాశం ఉందని అంచనాలు వేస్తున్నారు.
స్వర్ణాంధ్ర–2047 లక్ష్యసాధన దిశగా..
ఏలూరు జిల్లా వ్యవసాయంలో టాప్ వన్‌లో నిలవగా, పరిశ్రమలు, ఇతర అనుబంధ రంగా ల్లో వెనుకబడి ఉంది. కైకలూరు నియోజక వర్గం జిల్లాలో విలీనం కావడంతో ఆక్వాపరంగా జిల్లా మెరుగ్గానే వుంది. వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర –2047 లక్ష్యసాధనలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు రంగాల్లో విదేశీ పెట్టుబడులను ఆహ్వానించాయి. వీటిని తొమ్మిది జిల్లాలకు కలిపి అన్వయింప చేసి సమగ్రంగా మాస్టర్ ప్లాన్‌లు అమలు చేస్తారు. సూక్ష్మ, స్థూల, మధ్యతరహా పరిశ్రమలను నెలకొల్పడానికి అనువైన స్థలాలు ధరలు అందుబాటులోకి లేకపోవడం ప్రధాన సమస్యగా ఉంది. దీన్ని అధిగమించాల్సి ఉంటుంది. ప్రధానంగా పరిశ్రమలు, పర్యాటక రంగాల పరంగా జిల్లా అభివృద్ధి చెందాల్సి ఉంది.
వేగవంతమైన రవాణా వ్యవస్థ అభివృద్ధి
జిల్లాలో ఎన్‌హెచ్–16, ఎన్‌హెచ్–65, ఎన్‌హెచ్–216 హైవేలు, ఎన్‌హెచ్–365 బీజీ/బీబీ గ్రీన్‌ఫీల్డ్ హైవేలు అందుబాటులోకి రావడంతో వేగవంతమైన రవాణా వ్యవస్థ అభివృద్ధి చెందింది. వర్క్‌షాప్‌లో ప్రధానంగా మౌలిక వసతుల కల్పన, పెట్టుబడులు అన్వేషణ, ఉపాధి కల్పన మార్గాలను అన్వేషించాలని నిర్ణయించారు. ఆసియా అభివృద్ధి బ్యాంకు పరిధిలోని సాంకేతిక సహాయాన్ని, సింగపూర్ దేశం మాస్టర్ ప్లాన్‌లను అమలు చేయనున్నారని సమాచారం.
జీడీపీ రూ.88,472 కోట్లు
ఏలూరు జిల్లా 6,577 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. జనాభా 20.06 లక్షలు కాగా, 5.48 లక్షల కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. జిల్లా స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) రూ.88,472 కోట్లుగా ఉంది. తలసరి ఆదాయం 3 లక్షల 76 వేల 992గా నమో దైంది. ఏడు నియోజకవర్గాల్లో 12.75 లక్షల మంది అక్షరాస్యులు కాగా, అక్షరాస్యత శాతం 70.7 శాతంగా ఉంది. జీడీపీలో అత్యధికంగా కైకలూరు నుంచి రూ.22,507 కోట్లు, దెందు లూరు రూ.15,613 కోట్లు, ఉంగుటూరు రూ.12,521 కోట్లు, నూజివీడు రూ.10,399 కోట్లు, చింతలపూడి రూ.9,752 కోట్లు, పోల వరం రూ.8,842 కోట్లు, ఏలూరు రూ.5,580 కోట్ల జీడీపీని సమకూరుస్తున్నాయి. వీటిని ఇంకా ఏ విధంగా పెంచాలో రాబోయే కాలం లో ప్రభుత్వం సూచనలు, సలహాలు ఇవ్వ నుంది.