సహకారంలో ఈ–ఆడిట్
ABN , Publish Date - Mar 02 , 2026 | 12:56 AM
సహకార సంఘాల్లో ప్రతీ రోజు జరిగే లావాదేవీలపై ఈ–ఆడిట్ విధానం వర్తింప చేయనున్నారు. ఇప్పటి వరకు కేవలం చార్టర్డ్ అక్కౌంటెంట్లతో ఆయా సంఘాల్లో ఆడిట్‌ను చేయించేవారు. దీనివల్ల లావాదేవీల్లో అక్రమాలు, అవి నీతి వ్యవహరాలు పక్కదారి పట్టేవి. సొసైటీల్లో కంప్యూటరీకరణ కొద్ది నెలల క్రితం పూర్తయింది. ప్రతి లావా దేవీ నిర్వహణపై పారదర్శకత, అక్ర మాలకు కళ్లెం వేసేందుకు ఈ–ఆడి ట్ విధానం దోహదం చేయనుంది.
లావాదేవీల్లో పారదర్శకత కు పెద్దపీట
డీసీసీబీ మొండిబకాయిలకు మోక్షం
నిరంతర పర్యవేక్ష ణతో సంఘాలు పటిష్టవంతం
ఏలూరు, మార్చి1 (ఆంధ్రజ్యోతి): సహకార సంఘాల్లో ప్రతీ రోజు జరిగే లావాదేవీలపై ఈ–ఆడిట్ విధానం వర్తింప చేయనున్నారు. ఇప్పటి వరకు కేవలం చార్టర్డ్ అక్కౌంటెంట్లతో ఆయా సంఘాల్లో ఆడిట్‌ను చేయించేవారు. దీనివల్ల లావాదేవీల్లో అక్రమాలు, అవి నీతి వ్యవహరాలు పక్కదారి పట్టేవి. సొసైటీల్లో కంప్యూటరీకరణ కొద్ది నెలల క్రితం పూర్తయింది. ప్రతి లావా దేవీ నిర్వహణపై పారదర్శకత, అక్ర మాలకు కళ్లెం వేసేందుకు ఈ–ఆడి ట్ విధానం దోహదం చేయనుంది.
జిల్లా వ్యాప్తంగా సహకార సంఘాల్లో 2025–26 ఆర్థిక సంవత్సరం నుంచి ఈ–ఆడిట్ విధానం అమలు చేయడానికి కొద్ది నెలలు క్రితం సహకారశాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై అప్పట్లో నాబార్డు, ఆప్కాబ్ ప్రతినిధులు డీసీసీ బీ ప్రధాన కార్యాలయంలో ఆడిటర్లకు విధి విధానాలపై శిక్షణ నిర్వహించారు. ఈ నేపథ్యం లో డీసీసీబీ సీఈవో జి.సింహాచలం, డీసీవో ఆరిమిల్లి శ్రీనివాస్‌లు నిరంతరం ఆన్‌లైన్ ద్వా రా చేసిన లావాదేవీలపై పర్యవేక్షణ ఉండేలా జాగ్ర త్తలు తీసుకుంటున్నారు.
ఏప్రిల్ నుంచి అమలులోకి..
ఏలూరు జిల్లాలో 157 సహకార సంఘాలు న్నాయి. ఇందులో 45 మంది సహకారశాఖ ఆడిటర్లు పనిచేస్తున్నారు. గతేడాది ఏప్రిల్ 1నుంచి ఈ ఏడాది మార్చి నెలాఖరు వరకు జరిగే లావాదేవీలపై నిరంతర ఆడిట్ (కంక్ రెంట్ ఆడిట్) ప్రతీ సొసైటీ పరిధిలో ఆన్‌లైన్ లో చేస్తున్నారు. దీనిని ఏప్రిల్ 1 నుంచి సహకారశాఖ ఆడిటర్లు ఆన్‌లైన్‌లోనే తనిఖీలు చేపట్టి సంఘాల వారీగా వాస్తవాలను నిగ్గు తేల్చనున్నారు. దీనిపై వారికి త్వరలో శిక్షణలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ– ఆడిట్ విధానం వల్ల సొసైటీ ఆర్థిక పరిస్థితి తేలనుంది. డీసీసీబీకి సొసైటీల వారీగా ఉన్న మొండి బకాయిలు ఎంత మేర ఉన్నాయో తేలనుంది. మొండి బకాయిలు ప్రతీ సొసైటీ పరిఽధిలో పేరుకుపోవడం వల్ల సొసైటీల పనితీరు చాలాచోట్ల కుంటుపడింది. రికవరీల కోసం ఏటా స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహణ జరుగు తోంది. ఈ నెలాఖరులోగా సొసైటీల వారీగా చేపట్టిన నిరంతర ఆడిట్ రిపోర్టులను సరి చూసేందుకు శాఖాపరంగా ఆడిటర్లు కార్య రంగంలోకి దిగడం ద్వారా ఆయా సొసైటీల్లో పారదర్శకంగా సేవలందించడానికి అవకాశం ఏర్పడనుంది. తద్వారా ఆయా సొసైటీల పరిధి లో రైతులకు లబ్ధి చేకూర్చేందుకు డీసీసీబీ రుణ ప్రణాళికను పెంచడానికి దోహద పడనుంది. వీలైతే తగ్గించి.. పనితీరు మెరుగ్గా ఉన్న సొసైటీ రుణ పరపతిని పెంచడానికి ఉపకరిం చనుంది.
నష్టాలు తగ్గించే చర్యలు
ఇదిలా ఉండగా జిల్లా వ్యాప్తంగా గతంలో ఏడెనిమిది సంఘాల్లో కోట్లాది రూపాయాల అక్రమాలు చోటు చేసుకున్నాయి. దీనిని నివా రించి నష్టాల బాట నుంచి డీసీసీబీని గట్టెక్కిం చే విధంగా డీసీసీబీ పాలకవర్గ చైర్మన్ గన్ని వీరాంజనేయులు ఆధ్వర్యంలో అధికారులు చర్యలకు ఉపక్రమించారు. ఇటీవలే బ్యాంకు బ్రాంచిల పరిధిలో యూపీఐ సేవలను అందు బాటులోకి తీసుకొచ్చారు. జిల్లా వ్యాప్తంగా ఏటీఎం సెంటర్లను పెంచాలని యోచిస్తున్నా రు. ఈ క్రమంలో డీసీసీబీను పరపతి విష యంలో, ఆర్థికంగా బలోపేతం చేసేందుకు తాజాగా చేపట్టనున్న ఈ–ఆడిట్‌తో సొసైటీల పరిపాలన మెరుగుపడుతుందని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.