Share News

డిప్యూటీ మేయర్‌గా శ్రీనివాసరావు

ABN , Publish Date - Feb 27 , 2026 | 12:35 AM

ఏలూరు కార్పొరేషన్‌ డిప్యూటీ మేయర్‌గా 12వ డివిజన్‌ కార్పొరేటర్‌ కర్రి శ్రీనివాసరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

 డిప్యూటీ మేయర్‌గా శ్రీనివాసరావు
శ్రీనివాసరావుకు నియామకపత్రం అందజేస్తున్న ఎమ్మెల్యే చంటి, మేయర్‌ నూర్జహాన్‌

ఏలూరు టూటౌన్‌, ఫిబ్రవరి 26(ఆంధ్రజ్యోతి):ఏలూరు కార్పొరేషన్‌ డిప్యూటీ మేయర్‌గా 12వ డివిజన్‌ కార్పొరేటర్‌ కర్రి శ్రీనివాసరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నగర పా లక సంస్థ కార్యాలయంలో గురువారం మేయర్‌ నూర్జహా న్‌ అధ్యతన జరిగిన పాలక మండలి సమా వేశంలో డిప్యూటీ మేయర్‌గా ఆయనను మాజీ డిప్యూటీ మేయర్‌ పప్పు ఉమామహేశ్వరరావు ప్రతిపాదించగా కార్పొరేటర్‌ తంగిరాల అరుణ బలపరిచారు. సభ్యులు మద్దతు ప్రక టించడంతో ఎన్నికల ప్రత్యేకాధికారి విశ్వేశ్వరరావు డిప్యూ టీ మేయర్‌గా శ్రీనివాసరావును ప్రకటించారు. ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ నగరాభివృద్ధే ధ్యేయంగా, పార్టీలకతీతంగా పనిచేయాలని హితవు పలికారు. కమి షనర్‌ భానుప్రతాప్‌, ఇడా చైర్మన్‌ శివప్రసాద్‌, ఏఎంసీ చైర్మన్‌ పార్థసారఽథి, టీడీపీ నగర అధ్యక్షుడు చోడే వెంకట రత్నం, కోఅప్షన్‌ సభ్యుడు పెదబాబు, అడిషనల్‌ కమిషన ర్‌ శ్రీనివాస్‌, డిప్యూటీ కమిషనర్‌ శివారెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Feb 27 , 2026 | 12:35 AM