Share News

శ్రీవారి క్షేత్రంలో భక్తుల రద్దీ

ABN , Publish Date - Sep 20 , 2026 | 12:36 AM

చిన్నతిరుమల వాసుని ఆలయాన్ని శనివారం దాదాపు పదిహేను వేల మంది పైబడి భక్తులు సందర్శిం చారు. ఉదయం అంతంత మాత్రంగా ఉన్న యాత్రికులు సమయం గడిచేకొద్దీ కాస్త పెరిగారు.

శ్రీవారి క్షేత్రంలో భక్తుల రద్దీ
భక్తులతో రద్దీగా ఉన్న ఆలయ పరిసరాలు

ద్వారకాతిరుమల, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి): చిన్నతిరుమల వాసుని ఆలయాన్ని శనివారం దాదాపు పదిహేను వేల మంది పైబడి భక్తులు సందర్శిం చారు. ఉదయం అంతంత మాత్రంగా ఉన్న యాత్రికులు సమయం గడిచేకొద్దీ కాస్త పెరిగారు. అన్ని విభాగాలు భక్తులతో నిండిపో యాయి. ఉచిత దర్శనానికి గంటన్నర పైబడి సమయం పట్టింది. స్వామివారిని భక్తిప్ర పత్తులతో దర్శించు కున్న భక్తులు ఆలయ ప్రాంగణంలో ఉచిత తీర్థప్రసాదాలను స్వీకరించారు. ఆ తరువాత శ్రీవకుళమాత అన్నప్రసాద భవనానికి వెళ్లి స్వామివారి అన్నప్రసాదాన్ని వేలాది మంది భుజించారు.

Updated Date - Sep 20 , 2026 | 12:36 AM