చిన వెంకన్న క్షేత్రంలో భక్తుల రద్దీ
ABN , Publish Date - Aug 22 , 2026 | 11:58 PM
ఓం నమో వేంకటేశాయ.. అనే నామస్మరణతో చినవెంకన్న క్షేత్రం మార్మోగింది.
ద్వారకాతిరుమల, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి): ఓం నమో వేంకటేశాయ.. అనే నామస్మరణతో చినవెంకన్న క్షేత్రం మార్మోగింది. శ్రీవారికి ఇష్టమైన రోజు కావ డంతో శనివారం ఆలయానికి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. శ్రావణమాసం శని వారం కావడంతో ఉదయం నుంచి ఆలయంలో రద్దీ ప్రారంభమైంది. దాదాపు 15వేల మంది పైబడి భక్తులు స్వామి, అమ్మవార్లను దర్శించినట్లు ఆలయ వర్గాలు భావిస్తున్నాయి. వీరంతా క్షేత్రానికి చేరుకుని మొక్కుబడులు తీర్చుకుని క్యూలైన్లలో శ్రీవారి దర్శనం కోసం వేచి చూశారు. వైకుంఠ క్యూ కాంప్లెక్స్‌లోని 5 కంపార్ట్‌మెంట్లు నిండిపోవడంతో స్వామివారికి దర్శనానికి సుమారు రెండు గంటల సమయం పట్టింది. ఈమేరకు క్షేత్రపరిసరాలు సంద డిగా మారాయి. వారంతా కొంతసమయం వేచిఉండి స్వామి, అమ్మవార్లను దర్శించి పూజలు నిర్వహించి, ఉచిత తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.