Share News

26 నుంచి 29 వరకు శ్రీవారి దివ్య పవిత్రోత్సవాలు

ABN , Publish Date - Aug 18 , 2026 | 12:29 AM

చిన్న తిరుమలేశుని దివ్య పవిత్రోత్సవాలు శ్రీవారి సన్నిఽధిలో ఈనెల 26 సాయంత్రం నుంచి 29వరకు నాలుగురోజుల పాటు ఘనంగా నిర్వహించనున్నారు.

26 నుంచి 29 వరకు శ్రీవారి దివ్య పవిత్రోత్సవాలు
శ్రీవారి ఉత్సవమూర్తులు

నిత్యార్జిత కల్యాణాలు, ఆర్జిత సేవలు రద్దు

ద్వారకాతిరుమల, ఆగస్టు 17(ఆంధ్రజ్యోతి): చిన్న తిరుమలేశుని దివ్య పవిత్రోత్సవాలు శ్రీవారి సన్నిఽధిలో ఈనెల 26 సాయంత్రం నుంచి 29వరకు నాలుగురోజుల పాటు ఘనంగా నిర్వహించనున్నారు. ఏడాది పొడవునా ఆల యంలో తెలిసి తెలియక జరిగిన తప్పుల ప్రాయఃశ్చిత్తం నిమిత్తం ప్రతీ ఏటా వీటిని నిర్వహించడం సంప్రదాయం. ఉత్సవాల్లో భాగంగా 26న సాయంత్రం అంకురార్పణ, 27న పవిత్రాధివాసం, 28న పవిత్రారోపణ, 29న జరిగే మహాపూర్ణాహుతితో ఉత్సవాలు పరిసమాప్తమవుతాయని అధికారులు తెలిపారు. ఉత్సవాలు జరిగే ఆయా రోజుల్లో శ్రీవారి నిత్యార్జిత కల్యాణాలు. ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నట్టు ఆలయ ఈవో త్రినాథరావు వివరించారు.

Updated Date - Aug 18 , 2026 | 12:29 AM