Share News

చినవెంకన్న క్షేత్రం.. భక్తులతో కళకళ

ABN , Publish Date - Aug 10 , 2026 | 12:13 AM

ద్వారకాతిరుమల శ్రీవారి క్షేత్రం ఆదివారం భక్తులతో కళకళలాడింది. వారాంతపు సెలవురోజు కావడంతో ఆలయ పరిసరాలు యాత్రికులతో శోభిల్లింది..

చినవెంకన్న క్షేత్రం.. భక్తులతో కళకళ
చినవెంకన్న దర్శనానికి క్యూలైన్‌లో భక్తులు

ద్వారకాతిరుమల శ్రీవారి క్షేత్రం ఆదివారం భక్తులతో కళకళలాడింది. వారాంతపు సెలవురోజు కావడంతో ఆలయ పరిసరాలు యాత్రికులతో శోభిల్లింది.. స్వామిని దర్శించుకు నేందుకు ఆలయానికి వచ్చిన భక్తులు ముందుగా మొక్కుబడులు తీర్చుకున్నారు. ఆ తరువాత శ్రీవారు, అమ్మవార్లను దర్శించి ప్రత్యేకపూజలు జరుపుకున్నారు. దాదాపు 15వేల మంది పైబడి యాత్రికులు వచ్చి స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. స్వామివారి ఉచిత దర్శనానికి గంటన్నర పైబడి సమయం పట్టింది. – ద్వారకాతిరుమల

Updated Date - Aug 10 , 2026 | 12:13 AM