Share News

మార్మోగిన గోవింద నామస్మరణ

ABN , Publish Date - Aug 09 , 2026 | 12:13 AM

గోవింద నామ స్మరణతో చినవెంకన్న క్షేత్రం మార్మోగింది. శ్రీవారికి ఇష్టమైన రోజు శనివారం దాదాపు 15వేల మంది పైబడి భక్తులు స్వామి, అమ్మవార్లను దర్శించినట్లు ఆలయ వర్గాలు భావిస్తున్నాయి.

మార్మోగిన గోవింద నామస్మరణ
నూతన క్యూలైన్లలో భక్తులు

ద్వారకాతిరుమల, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): గోవింద నామ స్మరణతో చినవెంకన్న క్షేత్రం మార్మోగింది. శ్రీవారికి ఇష్టమైన రోజు శనివారం దాదాపు 15వేల మంది పైబడి భక్తులు స్వామి, అమ్మవార్లను దర్శించినట్లు ఆలయ వర్గాలు భావిస్తున్నాయి. భక్తులు క్యూలైన్లలో శ్రీవారి దర్శనం కోసం ఉండడంతో క్షేత్రపరిసరాలు సందడిగా మారాయి. స్వామి, అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించి, ఉచిత తీర్థ, ప్రసాదాలను స్వీకరించారు.

Updated Date - Aug 09 , 2026 | 12:13 AM