9 మంది నకిలీ కేటుగాళ్ల అరెస్టు
ABN , Publish Date - Apr 09 , 2026 | 11:57 PM
ద్వారకాతిరుమల దేవస్థానంలో నకిలీ టిక్కెట్ల వ్యవహారంలో ఇప్పటి వరకూ 9 మందిని అరెస్టు చేసినట్టు ఏలూరు డీఎస్పీ డి శ్రావణ్ కుమార్ చెప్పారు.
9 మంది నకిలీ కేటుగాళ్ల అరెస్టు
ద్వారకాతిరుమల దేవస్థాన నకిలీ టిక్కెట్ల కేసులో పురోగతి
కేసు దర్యాప్తులో ఉందన్న డీఎస్పీ శ్రావణ్ కుమార్
ఏలూరు క్రైం, ఏప్రిల్ 9(ఆంధ్రజ్యోతి): ద్వారకాతిరుమల దేవస్థానంలో నకిలీ టిక్కెట్ల వ్యవహారంలో ఇప్పటి వరకూ 9 మందిని అరెస్టు చేసినట్టు ఏలూరు డీఎస్పీ డి శ్రావణ్ కుమార్ చెప్పారు. ఏలూరు డీఎస్పీ కార్యాల యంలో గురువారం మధ్యాహ్నం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసు వివరా లు వెల్లడించారు. మార్చి 15న ద్వారకాతిరు మల వేంకటేశ్వరస్వామి దేవస్థానంలోని టిక్కె ట్ల కౌంటర్‌లో రూ.200 విలువైన 61 టిక్కెట్లు నకిలీవి విక్రయించినట్లు దేవస్థానం ఈవో భద్రాజీ గుర్తించి ద్వారకాతిరుమల పోలీసు లకు ఫిర్యాదు చేశారరు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరిగిందన్నారు. టిక్కెట్ కౌంటర్‌లో పనిచేస్తున్న ఐనంపూడి సాయిజగ న్నాథరాజు, సెక్యూర్టీ గార్డు మేకా సతీష్‌లపై కేసు నమోదు చేశారు.భీమడోలు సీఐ పి.కృష్ణ పర్యవేక్షణలో ద్వారకాతిరుమల ఎస్‌ఐ టి సుధీర్ సిబ్బంది సాంకేతిక పరిజ్ఞానాన్ని విని యోగించి పరారీలో ఉన్న ఈ కేసుకు సంబం ధించిన నిందితులైన ఐనంపూడి సాయిజగన్నాధ రాజు(26), ములగల రమేశ్(44), తొంటపాక సత్యనారాయణ(45), ఉప్పలపాటి శ్రీనివాస్ (38), సెక్యూర్టీ గార్డు కీర్తి అశోక్‌కుమార్(24), సెక్యూర్టీ సూపర్‌వైజర్ మానుకొండ ఆంజనే యులు(33), ఉంగుటూరు మండలం ఉప్పాక పాడు గ్రామానికి చెందిన సాఫ్టువేర్ ఇంజనీర్ ముత్యాల నాగవెంకట సత్య శ్రీనివాసరావు (45)లను అరెస్టు చేశారన్నారు. దేవస్ధాన అకౌంట్స్ విభాగంలోని కంప్యూటర్ సూపర్ వైజర్ రమేశ్ తన స్నేహితుడైన సాఫ్టువేర్ ఉద్యోగి ముత్యాల నాగ వెంకట సత్య శ్రీనివాస రావు సహకారంతో నకిలీ టిక్కెట్ల సాప్టువేర్ రూపొందించి వాటిని ప్రింటింగ్ చేసి కౌంటర్ ద్వారా భక్తులకు విక్రయంచినట్లు గుర్తించామ న్నారు. గత ఏడాది జూలై నుంచి ఈ సాఫ్టు వేర్ ద్వారా టిక్కెట్లను ప్రింటింగ్ చేసి భక్తుల రద్దీ ఉన్న సమయాల్లో విక్రయించినట్లుగా గుర్తించామన్నారు. ఈ కేసుకు సంబంధించి ఎవరైనా నిందితులు ఉన్నా అరెస్టు చేస్తామని పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగుతుందని నిందితులను పోలీస్ కష్టడీకి తీసుకుని విచా రణ చేస్తామన్నారు. నిందితుల నుంచి నకిలీ టిక్కెట్లు ముద్రించడానికి వినియోగించిన ల్యాప్‌టాప్, టీవీఎస్ ధర్మల్ ప్రింటర్, ఐదు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ కేసు దర్యాప్తులో కీలకంగా విధులు నిర్వర్తిం చిన భీమడోలు సీఐ పి.కృష్ణ, ద్వారకాతిరుమల ఎస్‌ఐ సుధీర్, భీమడోలు సర్కిల్ కార్యాలయ కానిస్టేబుల్ ధర్మరాజు, ద్వారకాతిరుమల కాని స్టేబుల్ పి.లక్ష్మీనారాయణ, ద్వారకాతిరుమల హోం గార్డు వీజే ప్రకాష్ బాబును డీఎస్పీ డి. శ్రావణ్ కుమార్ అభినందించారు.
రూ.పది లక్షల ఆఫర్ !
ద్వారకాతిరుమల, ఏప్రిల్ 9(ఆంధ్రజ్యోతి): ఈ కేసులో తనపై నేరంలేకుండా చేసుకునేం దుకు నిందితుల్లోని ఒకరు ప్రయత్నాలు చేసినట్టు తెలిసింది. సంబంధిత వ్యక్తి నేరాన్ని మరో నిం దితుడు ఒప్పుకుంటే రూ.10 లక్షలు ఇస్తానని బేరమాడినట్టు సమాచారం. గురువారం అరెస్ట్ అయిన వారిలో ఓ వ్యక్తి అందులో ఉన్న మరో ఇద్దరికి ఆఫర్ ఇచ్చినట్లు వార్త గుప్పుమంది. దీనికి అతను ఒప్పుకోలేదని సమాచారం.