వరుడైన చిన తిరుమలేశుడు
ABN , Publish Date - Oct 22 , 2026 | 01:06 AM
చిన తిరుమలేశుడు బుధవారం ఉదయం పెండ్లి కుమారునిగా ముస్తాబయ్యారు. ఉభయ దేవే రులు పెండ్లి కుమార్తెలయ్యారు.
వరుడైన చిన తిరుమలేశుడు
ఘనంగా ప్రారంభమైన ఆశ్వయుజ బ్రహ్మోత్సవాలు.. భారీగా తరలివచ్చిన భక్తులు
ద్వారకాతిరుమల, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): చిన తిరుమలేశుడు బుధవారం ఉదయం పెండ్లి కుమారునిగా ముస్తాబయ్యారు. ఉభయ దేవే రులు పెండ్లి కుమార్తెలయ్యారు. అర్చకుల వేద మంత్రోచ్ఛరణలు, భక్తుల గోవిందనామ స్మరణ లు, మేళతాళాలు, మంగళవాయిద్యాలు తోడైన వేళ.. ఈ అద్భుత వేడుకను వీక్షించిన భక్తులు పరవశించారు. శ్రీవారి ఆశ్వయుజ మాస దివ్య బ్రహ్మోత్సవాల ప్రారంభానికి శ్రీకారం చుట్టారు. ప్రత్యేకంగా అలంకరించిన ఈ వేదికపై ఏర్పా టుచేసిన సువర్ణ సింహాసనంపై స్వామి, అమ్మ వార్ల కల్యాణ మూర్తులను ఉంచి ఆలయ అర్చ కులు హారతులిచ్చి ఈ తంతును వేదవిద్యా ర్థుల మంత్రోచ్ఛరణల నడుమ శాస్త్రోక్తంగా నిర్వహించారు.
క్షేత్రంలో నేత్రపర్వంగా శమీ పూజ
రాజాధిరాజ వాహనంపై ఉభయదేవేరులతో కొలువుదీరిన చినవెంకన్న విజయదశమి పర్వ దినాన రాత్రివేళ శమీపూజ నిమిత్తం నృశింహ సాగరం వద్ద నున్న దసరా మండపం వద్దకు వెళ్లి పూజలందుకున్నారు. మేళతాళాల నడుమ క్షేత్రపురవీధుల గుండా నృశింహసాగరం వద్ద ఉన్న మండపం వద్దకు చేరుకోగా.. జమ్మిచెట్టు వద్ద అర్చకులు విశేషపూజలు చేసి హారతులి చ్చారు. విజయదశమి పర్వదినాలు పూర్తికావ స్తున్న నేపథ్యంలో భవానీ దీక్షాదారులు, భక్తు లతో చినవెంకన్న క్షేత్రం కిటకిటలాడింది. విజయవాడలో దుర్గమ్మను దర్శించిన భక్తులు మార్గమధ్యలోని శ్రీవారి క్షేత్రానికి విచ్చేశారు.
మహావిష్ణువుగా చినవెంకన్న
మహావిష్ణువుగా చినవెంకన్న భక్తులకు దర్శనమి చ్చారు. శ్రీవారి ఆశ్వయుజమాస బ్రహ్మోత్సవాల్లో భాగంగా జరుగుతున్న అలంకారోత్సవాల్లో శ్రీవారు ప్రతీ రోజూ ఓ ప్రత్యేక అలంకరణలో దర్శనమిస్తారు, ఇందులో తొలిరోజైన బుధవారం శంఖు, చక్ర గదా ధారియైు ఉభయదేవేరులతో విశేష పుష్ప అలంకారాల్లో మహావిష్ణువు అలంకారంలో ఉన్న స్వామిని అధిక సంఖ్యలో భక్తులు దర్శించి తరించారు.