Share News

శ్రీవారి హుండీల ఆదాయం రూ. 1.70 కోట్లు

ABN , Publish Date - Apr 17 , 2026 | 12:24 AM

ద్వారకాతిరుమల చినవెంకన్నకు హుండీల సొమ్ము లెక్కింపు ద్వారా భారీ ఆదాయం లభించింది. గడిచిన 17 రోజులకుగాను నగదు రూపేణా రూ.1.70 కోట్లు ఆదాయం లభించినట్టు ఆలయ ఈవో యర్రంశెట్టి భద్రాజీ తెలిపారు.

శ్రీవారి హుండీల ఆదాయం రూ. 1.70 కోట్లు

శ్రీవారి హుండీల ఆదాయం రూ. 1.70 కోట్లు

ద్వారకాతిరుమల,ఏప్రిల్‌16(ఆంధ్రజ్యోతి): ద్వారకాతిరుమల చినవెంకన్నకు హుండీల సొమ్ము లెక్కింపు ద్వారా భారీ ఆదాయం లభించింది. గడిచిన 17 రోజులకుగాను నగదు రూపేణా రూ.1.70 కోట్లు ఆదాయం లభించినట్టు ఆలయ ఈవో యర్రంశెట్టి భద్రాజీ తెలిపారు. స్థానిక ప్రమోద కల్యాణమండప ఆవర ణలో గురువారం భద్రతాఏర్పాట్ల నడుమ హుండీల లెక్కింపు నిర్వహించారు. నగదు రూపంలో రూ1,70,80,167పాటు 116 గ్రాముల బంగారం, 2.135 కేజీల వెండి లభించాయన్నారు. రద్దయిన పాతనోట్లు రూ.500(3), 2000(1)తో పాటుగా విదేశీ కరెన్సీ అధికంగా లభించింది. శ్రీవారికి హుండీల ద్వారా రోజుకు సగటున రూ10.04లక్షల ఆదాయం లభించిందన్నారు. ఆలయ సిబ్బందితోపాటు సేవాదళ సభ్యులు హుండీల సొమ్మును లెక్కించారు.

Updated Date - Apr 17 , 2026 | 12:25 AM