Share News

ఎటు చూసినా చెత్తే..!

ABN , Publish Date - Mar 23 , 2026 | 12:21 AM

నరసాపురం పట్టణంలో మళ్లీ చెత్త సమస్య తలెత్తింది.

ఎటు చూసినా చెత్తే..!
సబ్‌ జైల్‌ వద్ద కుండీలు నిండిపోయి బయటకు వచ్చిన చెత్త

నరసాపురంలో నాలుగు రోజులుగా నిలిచిపోయిన చెత్త సేకరణ

ఏ సెంటర్‌లో చూసినా చెత్తకుప్పలే

అంటురోగాలు వస్తాయని భయం

తీరని డంపింగ్‌ యార్డు సమస్య

నరసాపురం, మార్చి 22(ఆంధ్రజ్యోతి) : నరసాపురం పట్టణంలో మళ్లీ చెత్త సమస్య తలెత్తింది. నాలుగు రోజులుగా మునిసిపాల్టీ చెత్త సేకరణ నిలిపివేసింది. దీంతో ప్రజలు ఇళ్లల్లో చెత్తను రోడ్లపై, ప్రధాన కూడళ్ల వద్ద ఏర్పాటు చేసిన డస్ట్‌బిన్‌ల వద్ద పడేస్తు న్నారు. ఇప్పటికే డస్ట్‌బిన్‌లు చెత్తతో నిండి పోయాయి. దీంతో తెచ్చిన చెత్తను వాటి సమీపానే పడేస్తున్నారు. ఈ కారణంగా ప్రధాన కూడళ్లలో ఎక్కడ చూసినా చెత్త కుప్పలే కనిపిస్తున్నాయి. వీటి చుట్టూ కుక్కలు, పశువులు వచ్చి చేరుతుండటంతో పారిశుఽధ్యం అస్తవ ్యస్తంగా మారింది. కొన్ని సెంటర్ల మీదుగా వెళ్లాలంటే వాసన భరించలేక ముక్కులు మూసుకోవాల్సిన దుస్ధితి నెలకొంది. మరోవైపు చెత్త ట్రాక్టర్లు, ఇతర చెత్త సేకరణ వాహనాలు కూడా చెత్తతో నిండుకున్నాయి.వాటిని ఎక్కడ వేయాలో తెలియక పురపాలక కార్యాల యాల్లో నిలిపివేశారు. పరిస్థితి ఇంత దారు ణంగా మారినా మునిసిపల్‌ అధికారులు మాత్రం పట్టించుకోకపోవడంపై ప్రజల ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు.

జాగా దొరక్క ఇబ్బందులు

పట్టణంలో 31 వార్డులు ఉన్నాయి. నిత్యం సుమారు 30 నుంచి 35 టన్నుల చెత్త వస్తుంది. గతంలో సేకరించిన చెత్తను గోదా వరి ఒడ్డున ఉన్న స్మృతివనం వద్ద వేసే వారు. గ్రీన్‌ ట్రిబ్యునల్‌ ఆదేశాలతో అక్కడ చెత్త వేయడం నిలిపివేశారు. డంపింగ్‌ యార్డు కోసం మునిసి పాల్టీ రూ.3.70 కోట్లతో కొనుగోలు చేసిన స్ధలం వద్ద కూడా ప్రజలు నుంచి ప్రతిఘటనలు ఎదురయ్యాయి. దీంతో చెత్త సమస్య తలెత్తింది. కొద్ది రోజులు సేకరించిన చెత్తను లారీల్లో గుంటూరులోని జింథాల్‌ సంస్ధకు తరలించారు. ట్రాన్స్‌ పోర్టుకు లక్షలు ఖర్చు అవుతుండ టంతో ఈ పని నిలిపివేశారు. పట్టణ పరిధిలో ఖాళీగా ఉన్న స్థలాల్లో వేయాలని ప్రయత్నించినా ప్రజలు నుంచి ఆందోళనలు ఎదురయ్యాయి. ఈ ఏడాది జనవరి నుంచి సేకరించిన చెత్తను మొగల్తూరు మండలంలోని ఓ గ్రామంలో వేస్తూ వచ్చారు. ప్రస్తుతం అది కూడా నిండిపోయింది. దీంతో చెత్త వేసేందుకు స్ధలం లేకుండా పోయింది. మరో మూడు నాలుగు రోజులు పరిస్థితి ఇదే విధంగా కొనసాగితే అంటురోగాలు ప్రబలుతాయన్న భయం ప్రజల్లో నెలకొంది. ప్రస్తుతం స్టీమర్‌ రోడ్డులోని సబ్‌జైల్‌, కనకదుర్గ ఆర్చ్‌, వలంధర్‌ రేవు సమీపం, పాత ఎక్సైజ్‌ కార్యా లయం రోడ్డు, రైతు బజార్‌, గంటాలయ్మ గుడి సమీపం, మొగల్తూరు రోడ్డు. పాత బజార్‌, రుస్తుంబాద, రాయపేట ఇలా పలు ప్రధాన కూడళ్ల నివాసాల సమీపాల్లో చెత్త కుప్పలే దర్శనమిస్తున్నాయి.

నేడు క్లియర్‌ చేస్తాం..

దీనిపై కమిషనర్‌ వెంకట్రామిరెడ్డి వివరణ కోరగా రెండు రోజుల్లో సమస్యను పరిష్క రిస్తాం. ఒక స్థలాన్ని గుర్తించాం.. మునిసి పాల్టీకి స్థలం దొరికే వరకు అక్కడే వేస్తాం. అవసరమైతే తాత్కాలికంగా లారీల్లో గుంటూరు పంపేందుకు కూడా రెడీగా ఉన్నాం. సోమవారం సాయంత్రానికి ఉన్న చెత్తను క్లియర్‌ చేస్తాం..అని చెప్పారు.

Updated Date - Mar 23 , 2026 | 12:21 AM