Share News

వరుడైన చిన్నతిరుమలేశుడు

ABN , Publish Date - Apr 27 , 2026 | 12:33 AM

ముగ్ధమనోహర రూపలావణ్యాలను ఒలికిస్తున్న అలివేలుమంగ, ఆండాళ్‌ అమ్మవార్లు నడుమ కొలువుతీరిన చిన్నతిరుమలేశుడు పెండ్లి కుమారునిగా ముస్తాబయ్యారు.

వరుడైన చిన్నతిరుమలేశుడు
కల్యాణతంతు

వరుడైన చిన్నతిరుమలేశుడు

ఘనంగా ప్రారంభమైన వైశాఖ బ్రహ్మోత్సవాలు

ద్వారకాతిరుమల, ఏప్రిల్‌ 26(ఆంధ్రజ్యోతి): ముగ్ధమనోహర రూపలావణ్యాలను ఒలికిస్తున్న అలివేలుమంగ, ఆండాళ్‌ అమ్మవార్లు నడుమ కొలువుతీరిన చిన్నతిరుమలేశుడు పెండ్లి కుమారునిగా ముస్తాబయ్యారు. అలాగే ఉభయదేవేరులు పెండ్లి కుమార్తెలయ్యారు. అర్చకులు, పండితులు, ఆగమ విద్యార్థుల వేదమంత్రోచ్ఛరణలు, భక్తుల గోవిందనామ స్మరణలు, మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ జరిగిన ఈ రమణీయ ఘట్టం ఆవిష్కృతమైన వేళ.....వీక్షించిన భక్తజనులు పరవశిం చారు. శ్రీవారి ఆలయ నిత్యకల్యాణ మండప ఆవరణ ఆదివారం ఉదయం ఇందుకు వేదికైంది. ప్రత్యేకంగా అలంకరించిన ఈ వేదికపై ఏర్పాటు చేసిన సువర్ణ సింహాసనంపై స్వామి, అమ్మ వార్ల కల్యాణమూర్తులను ఉంచి ఆలయ అర్చకులు హారతులిచ్చి ఈ తంతును వేదమంత్రోచ్ఛరణల నడుమ శాస్త్రోక్తంగా నిర్వహి ంచారు. దీంతో వైశాఖ మాస దివ్య బ్రహ్మోత్సవాలు ప్రారంభ మయ్యాయి. భక్తులకు స్వామివారి తీర్ధ,ప్రసాదాలను పంపిణీ చేశారు.

శ్రీ భూసమేత మహావిష్ణువుగా శ్రీవారు

ద్వారకాతిరుమల, ఏప్రిల్‌ 26 (ఆంధ్ర జ్యోతి): ఆదిశేషుని పడగన శ్రీభూసమేత మహావిష్ణువు అలంకరణలో శ్రీవారు ఆలయప్రాంగణంలో భక్తజనులకు దర్శన మిచ్చారు. వైశాఖ మాస బ్రహ్మోత్సవాల్లో భాగంగా రోజుకో అలంకరణలో చినవెంకన్న సాక్షాత్కరిస్తారు. ఇందులో భాగంగా ఉత్సవాల ప్రారంభరోజైన ఆదివారం శ్రీదేవి, భూదేవిలతో కలసి శంఖు, చక్ర, గదా ధారియైు విశేష అలంకారాల్లో ఉన్న స్వామిదర్శనం భక్తులకు కనువిందైంది.

గజవాహనంపై ....శ్రీవారి రాజసం

గజవాహనంపై ఉభయదేవేరులతో కొలువుతీరిన చినవెంకన్నస్వామి ఆదివా రం రాత్రి క్షేత్రపురవీఽఽధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. బ్రహ్మోత్సవాలను పుర స్కరించుకుని జరుగుతున్న వాహనసేవల్లో భాగంగా తొలిరోజు శ్రీవారు, అమ్మవార్లు గజవాహనాన్ని అదిరోహించి తిరువీధుల్లో భక్తులకు అభయ హస్తాన్ని అందించారు. ముందుగా ఆలయంలో స్వామి, అమ్మవార్లను గజ వాహనంపై ఉంచి అలంకరించి మేళతాళాలు, మంగళవాయిద్యాలు అర్చకులు, పండితుల వేదమంత్రోచ్చరణల నడుమ అట్టహాసంగా గ్రామంలో ఊరేగించారు.

పెళ్లి కుమారునిగా కాళ్ళకూరు వెంకన్న

కాళ్ళ, ఏప్రిల్‌ 26 (ఆంధ్రజ్యోతి): కాళ్ళకూరు వేంకటేశ్వరస్వామి వార్షిక తిరుకళ్యాణ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. దీనిలో భాగంగా ఆదివారం స్వామివారిని పెళ్లి కుమారునిగా అలంకరించారు. ప్రత్యేక అలంకరణతో తులసీ దళములతో విశేషార్చనతో స్వామివారికి ఎదుర్కోలు సన్నాహం నిర్వహించారు. సోమవారం జరగనున్న కళ్యాణం సందర్భంగా పూజలు జరిగాయని ఆలయ ఛైర్మన్‌ అడ్డాల శివరామరాజు, ఈవో అరుణ్‌ కుమార్‌లు తెలిపారు. భక్తుల కోసం ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

Updated Date - Apr 27 , 2026 | 12:34 AM