Share News

కిడ్నాప్‌ కేసులో ప్రధాన నిందితుల కోసం వేట

ABN , Publish Date - Aug 04 , 2026 | 12:40 AM

నూజివీడులో జరిగిన కిడ్నాప్‌ కేసుకు సంబం ధించి నిందితుల వేట కొనసాగు తోందని ఏలూరు డీఎస్పీ శ్రావణ్‌ కుమార్‌ తెలిపారు.

 కిడ్నాప్‌ కేసులో ప్రధాన నిందితుల కోసం వేట
విలేకరులతో మాట్లాడుతున్న డీఎస్పీ శ్రావణ్‌ కుమార్‌

కిడ్నాప్‌ కేసులో ప్రధాన నిందితుల కోసం వేట

ఏలూరు డీఎస్పీ శ్రావణ్‌కుమార్‌

నూజివీడు, ఆగస్టు 3(ఆంధ్రజ్యోతి): నూజివీడులో జరిగిన కిడ్నాప్‌ కేసుకు సంబం ధించి నిందితుల వేట కొనసాగు తోందని ఏలూరు డీఎస్పీ శ్రావణ్‌ కుమార్‌ తెలిపారు. సోమవారం నూజివీడు పట్టణ పోలీస్‌ స్టేషన్‌ లో ఆయన మాట్లాడుతూ కొయ్యలగూడేనికి చెందిన చంద్రరావు, గుంటూరు జిల్లాకు చెందిన ముస్తఫాల మధ్య పొగాకు విక్రయాల్లో వచ్చిన తేడా కిడ్నాప్‌కు దారి తీసినట్లు తెలుస్తోందన్నారు. ఈ కిడ్నాప్‌ కేసులో అట్రాసిటీ కేసు నమోదు చేశామన్నారు. రెక్కీ నిర్వహించి, రెండు వాహనాలలో వచ్చి కిడ్నాప్‌ చేసినట్లు తెలిపారు. ప్రత్యేక పోలీస్‌ బృం దాలు ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని కోర్టుకు హాజరు పరి చామన్నారు. ప్రధాన నిందితులైన వైసీపీ మాజీ ఎమ్మెల్యే ముస్తఫా, అతని కుమా రుడు బషీర్‌ పరారీలో ఉన్నట్లు తెలిపారు. వీరి ఆచూకీ తెలిపిన వారికి నగదు బహుమానం అందిస్తామని ప్రచారం నిర్వహిం చామన్నారు. వీరి కోసం ఇప్పటికే ప్రత్యేక పోలీసు బృందాల వేట కొనసాగుతోం దన్నారు. ఏ క్షణమైనా ప్రధాన నిందితులను అదుపులోకి తీసుకొని కోర్టుకు హాజరుపరచడం జరుగుతుందని స్పష్టం చేశారు. నూజివీడు డీఎస్పీ కేవీవీ ఎన్‌వీ ప్రసాద్‌ పాల్గొన్నారు.

Updated Date - Aug 04 , 2026 | 12:40 AM