Share News

ఔషధానికి సుస్తీ!

ABN , Publish Date - Sep 10 , 2026 | 12:59 AM

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో డ్రగ్స్‌ నియం త్రణాధికారులపై సస్పెన్షన్‌ వేటు పడింది. మందుల దుకాణాల నిర్వహణ, లైసెన్సులు, తనిఖీల విషయంలో అధికారులపై చాలాకాలంగా వస్తున్న ఆరోపణలపై సాగిన విచారణలు కొలిక్కి రావడంతో ఏలూరు అసి స్టెంట్‌ డైరెక్టర్‌ డీబీకేఎం చక్రవర్తి, భీమవరం డ్రగ్‌ ఇన్‌ స్పెక్టర్‌ అబిద్‌ అలీ షేక్‌ను విధుల నుంచి సస్పెండ్‌ చే శారు.

ఔషధానికి సుస్తీ!

మెడికల్‌ షాపుల తనిఖీల వేళ యథేచ్ఛగా ముడుపులు.. డ్రగ్స్‌ నియంత్రణాధికారులపై వేటు

ఏలూరు ఏడీ చక్రవర్తి, భీమవరం డీఐ అబిద్‌ అలీ సస్పెన్షన్‌.. ఇన్‌చార్జులకు బాధ్యతల అప్పగింత

(ఏలూరు–ఆంధ్రజ్యోతి):

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో డ్రగ్స్‌ నియం త్రణాధికారులపై సస్పెన్షన్‌ వేటు పడింది. మందుల దుకాణాల నిర్వహణ, లైసెన్సులు, తనిఖీల విషయంలో అధికారులపై చాలాకాలంగా వస్తున్న ఆరోపణలపై సాగిన విచారణలు కొలిక్కి రావడంతో ఏలూరు అసి స్టెంట్‌ డైరెక్టర్‌ డీబీకేఎం చక్రవర్తి, భీమవరం డ్రగ్‌ ఇన్‌ స్పెక్టర్‌ అబిద్‌ అలీ షేక్‌ను విధుల నుంచి సస్పెండ్‌ చే శారు. డ్రగ్స్‌ నియంత్రణ శాఖ డిప్యూటీ జనరల్‌(డీజీ) పి.అరుణ్‌బాబు ఈ మేరకు ఉత్తర్వులు జారీచేశారు. చక్రవర్తిపై జంగారెడ్డిగూడెంలో ఐదు మెడికల్‌ ఏజెన్సీ లపై నిబంధనలకు విరుద్ధంగా కేసులు నమోదు చేశా రన్న ఆరోపణలతో విచారణ జరిగింది. కొత్త షాపులకు లైసెన్సుల మంజూరు, రెన్యువల్స్‌, తనిఖీల పేరుతో ము డుపులు డిమాండ్‌ చేసేవారన్న ఆరోపణలు ఉన్నాయి. నిబంధనల ప్రకారం నడుస్తున్న దుకాణాల్లోనూ ఏదో ఒక కొర్రీ పెట్టి అదనపు వసూళ్లకు పాల్పడేవారన్న వి మర్శలు వచ్చాయి. ఈ వ్యవహారాలపై జరిగిన విచార ణ అనంతరం చక్రవర్తిని సస్పెండ్‌ చేసినట్లు తెలిసింది.

అబిద్‌ అలీపై ఆరోపణలు

భీమవరం డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న అబిద్‌ అలీ షేక్‌ గతంలో జంగారెడ్డిగూడెం ఇన్‌చార్జి డ్రగ్‌ ఇన్‌ స్పెక్టర్‌గా వ్యవహరించారు. ఆ సమయంలో బుట్టాయ గూడెం, కొయ్యలగూడెం, జంగారెడ్డిగూడెం ప్రాంతాల్లోని మెడికల్‌ షాపుల్లో వయగ్రా, నిద్రమాత్రలు, ప్రెగ్నెన్సీ కిట్లు, కాలం చెల్లిన మందుల తనిఖీల పేరుతో డబ్బు లు డిమాండ్‌ చేసేవారన్న ఆరోపణలు వచ్చాయి. తాను నేరుగా డబ్బులు తీసుకోకుండా మెడికల్‌ అసోసియేషన్‌ ద్వారా వ్యవహారం నడిపేవారన్న ఆరోపణలు ఉన్నాయి. దీర్ఘకాలంగా ఉమ్మడి జిల్లాలోనే విధులు నిర్వహించిన అబిద్‌ అలీపై గతంలో వచ్చిన ఫిర్యాదులు, ఆరోపణల పై కొద్దినెలల క్రితం రాష్ట్రస్థాయి అధికారులు షాపుల వద్ద విచారణ చేపట్టారు. తుది నివేదికను ఉన్నతాధికా రులకు అందించిన అనంతరం ఆయనను సస్పెండ్‌ చేసినట్లు తెలిసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో జంగారెడ్డి గూడెంలో మెడికల్‌ ఏజెన్సీ ఏర్పాటుకు ఓ వ్యక్తి ఆన్‌ లైన్‌లో దరఖాస్తు చేసుకున్నాడు. లైసెన్సు మంజూరు చేసేందుకు అప్పటి డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ కంపా సురేష్‌ బాబు రూ.20 వేలు లంచం డిమాండ్‌ చేసినట్లు ఆరోప ణలు వచ్చాయి. ఆ మొత్తాన్ని మెడికల్‌ అసోసియేషన్‌ నాయకుడు రామకృష్ణకు చెందిన షాపు వద్ద ఇవ్వాలని సురేష్‌బాబు సూచించారు. అసోసియేషన్‌ నాయకుడు డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టు కున్నారు. ఫోన్‌లోని రికార్డుల ఆధారంగా సురేష్‌బాబు ను అధికారులు అరెస్టు చేసి, అనంతరం సస్పెండ్‌ చేశారు. తణుకు డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ మల్లికార్జునరావు జంగారెడ్డిగూడెం ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్నారు.

ట్రమడాల్‌ ఇంజెక్షన్ల రాకెట్‌పైనా విచారణ

జంగారెడ్డిగూడెం పరిసరాల్లో ట్రమడాల్‌ ఇంజెక్షన్ల రాకెట్‌ వెలుగులోకి రావడంతో ఈ వ్యవహారంపైనా డ్రగ్స్‌ నియంత్రణాధికారులు విచారణ చేపట్టారు. ఐదు షాపుల లైసెన్సుల రద్దుకు చర్యలు తీసుకోనున్నా రు. పూర్తిస్థాయి విచారణ జరిగితే మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. మెట్ట ప్రాంతంలో గర్భవిచ్ఛితి ఇంజెక్షన్లు విచ్చలవిడిగా సరఫరా అవుతు న్నట్లు వెలుగులోకి రావడం మందుల దుకాణాలు, ఏజెన్సీలపై పర్యవేక్షణ లోపాలను స్పష్టం చేస్తోంది. చక్రవర్తి సస్పెన్షన్‌తో ఏలూరు జిల్లా డిప్యూటీ డైరెక్టర్‌ ఎ.రమాదేవికి ఏడీ పోస్టు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగిం చారు. అబిద్‌ అలీ స్థానంలో ఏలూరు డ్రగ్‌ ఇన్‌ స్పెక్టర్‌ ఎం.విక్రమ్‌కు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగిస్తూ ఉత్త ర్వులు వెలువడ్డాయి.

Updated Date - Sep 10 , 2026 | 12:59 AM