Share News

స్వచ్ఛమైన తాగునీరు అందించండి

ABN , Publish Date - Jul 02 , 2026 | 12:21 AM

పట్టణంలోని 31వ వార్డులో స్వచ్ఛమైన తాగునీరు అందించాలని సీపీఐ ఆధ్వర్యంలో బుధవారం ప్రజలు సబ్‌కలెక్టర్‌ కార్యాలయం వద్ద అందోళన చేశారు.

స్వచ్ఛమైన తాగునీరు అందించండి
ఆర్డీవో దాసి రాజుకు వినతిపత్రం అందిస్తున్న గ్రామస్థులు

నరసాపురం టౌన్‌, జూలై 1(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని 31వ వార్డులో స్వచ్ఛమైన తాగునీరు అందించాలని సీపీఐ ఆధ్వర్యంలో బుధవారం ప్రజలు సబ్‌కలెక్టర్‌ కార్యాలయం వద్ద అందోళన చేశారు. పురపాలకం ద్వారా సరఫరా చేసే మంచినీరు దుర్వాసన వస్తుందని, వీధిలైట్లు వెలగడం లేదని తక్షణమే సమస్యల్ని పరిష్కరించాలని ఆర్డీవో దాసి రాజుకు వినతిపత్రం అందించారు. స్పందించిన ఆర్డీవో తక్షణం మునిసిపల్‌ అధికారులతో చర్చించి సమస్యను పరిష్కారిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నెక్కంటి క్రాంతికుమార్‌, వెంకటేశ్వరరావు, త్రినాఽథ్‌, ధరణి, పొతురాజు, పేరా రాజు, బళ్ల శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 02 , 2026 | 12:21 AM