Share News

చెదిరిన కల

ABN , Publish Date - Jun 22 , 2026 | 12:37 AM

పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించాం.. ప్రభుత్వమే ఇళ్లు కట్టించి ఇస్తుందని గత వైసీపీ ప్రభుత్వం ఊదర గొట్టింది.

చెదిరిన కల
అసంపూర్తిగా ఇళ్ల నిర్మాణాలు

లక్ష్మీపురం, కొమడవోలులో అసంపూర్తిగా 6 వేల ఇళ్లు

వృథాగా పడిఉన్న నిర్మాణ సామగ్రి

కాంట్రాక్టర్‌కు నిర్మాణ పనులు అప్పగించిన గత వైసీపీ ప్రభుత్వం

మధ్యలోనే వదిలేసిన కాంట్రాక్ట్‌ సంస్థ

రాంక్రీట్‌ సంస్థపై చర్యలు శూన్యం

(ఏలూరు–ఆంధ్రజ్యోతి)

పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించాం.. ప్రభుత్వమే ఇళ్లు కట్టించి ఇస్తుందని గత వైసీపీ ప్రభుత్వం ఊదర గొట్టింది. వేల ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నట్లు ప్రకటిం చింది. సొంత ఇల్లు సమకూరుతుందని పేదలు కలలు కన్నారు. ప్రచార హడావుడిలో పదో వంతు కూడా కార్యాచరణ లేకపోవడంతో పేదల కల చెదిరింది. కాం ట్రాక్టర్‌ మధ్యలోనే పనులు వదిలేసి పోవడంతో లబ్ధిదా రులు నిరాశ చెందగా నిర్మాణ సామగ్రి పనికిరాకుండా పోతోంది. ఏలూరు నియోజకవర్గంలో పేదల ఇళ్ల నిర్మాణ పనులు కాంట్రాక్ట్‌ తీసుకున్న రాంక్రీట్‌ సంస్థ మధ్యలోనే వదిలేసింది. కాంట్రాక్టర్‌పై అప్పటి వైసీపీ ప్రభుత్వం ఏమాత్రం చర్యలు తీసుకోలేదు. కూటమి ప్రభుత్వం కూడా సంబంధిత కాంట్రాక్ట్‌ సంస్థపై చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది.

ఏలూరు నియోజకవర్గం చొదిమెళ్లలోని లక్ష్మీపురం, కొమడవోలులో జగనన్న కాలనీల్లో ఎన్నికల సంవత్సరం లో సెంటు పట్టా కింద ఇళ్లను మంజూరు చేశారు. ఆ ప్రభుత్వాన్ని ప్రజలు సాగనంపడంతో కాంట్రాక్టర్లు ఇళ్ల నిర్మాణాలను మధ్యలో వదిలేసిపోయారు. ఆరు వేలకు పైగా అసంపూర్తి నిర్మాణాలు పాలకుల తీరును ప్రశ్నిస్తు న్నాయి. ఇళ్ల కేటాయింపుతో లబ్ధిదారులు పలుమార్లు దరఖాస్తులను పూరించడం, పత్రాల పరిశీలన, మహి ళల పేరిట వ్యక్తిగత బ్యాంకు ఖాతాలు తెరవడానికి లబ్ధిదారులు వందల సార్లు తిరిగారు. ఎట్టకేలకు నిర్మాణాలు చేపట్టినా మధ్యలోనే వదిలేశారు. చాలా ఇళ్లు బేస్‌మెంట్‌ స్థాయి, కొన్ని పిల్లర్లు స్థాయికి చేరుకున్నాయి. పోణంగిలో కేవలం 319 ఇళ్లు పూర్తి చేసినట్లు హౌసింగ్‌ అధికారులు చెబుతున్నారు. అసం పూర్తి కట్టడాలతో పాటు ఏళ్ల తరబడి పడివున్న సామ గ్రి కూడా పాడైపోతోంది. నిర్మాణ పనులు అర్ధాంతరంగా ఆగిపోవడంతో లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు.

మంత్రి హెచ్చరించినా..

అసంపూర్తి నిర్మాణాలపై స్పందించిన గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ఆయా కాంట్రాక్ట్‌ సంస్థలపై క్రిమినల్‌ కేసులను నమోదు చేస్తామని హెచ్చరించారు. అయినప్పటికీ సంబంధిత కాంట్రాక్ట్‌ సంస్థ ముందుకు రాలేదు.

డీఆర్‌సీలో చర్చ.. కేసు న మోదు

ఆగిపోయిన ఇళ్ల విషయంపై ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి గత ఏడాది జిల్లా సమీక్షా కమిటీ సమా వేశంలో ప్రస్తావించారు. రాంక్రీట్‌ సంస్థపై రాష్ట్రవ్యాప్తం గా కేసుల నమోదుకు చర్యలు తీసుకుంటామని మంత్రి కొలుసు స్పష్టం చేశారు. ఏలూరు జిల్లాలో నిర్మాణ పనులు నిలిచిపోవడంపై మూడు నెలలు క్రితం రాంక్రీట్‌ సంస్థపై త్రీటౌన్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. జిల్లా హౌసింగ్‌ అఽధికారులను సంప్రదించగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు.

Updated Date - Jun 22 , 2026 | 12:37 AM