వీడిన అపోహలు..!
ABN , Publish Date - Apr 25 , 2026 | 12:56 AM
పోలవరం ప్రాజెక్టు 45.72 కాంటూరు లెవెల్‌లో 2వ దశ నిర్మాణానికి లైన్ క్లియర్ అయినట్టు ఈనెల 22న ‘ఆంధ్రజ్యోతి’ ప్రధాన సంచికలో వచ్చిన కథనం మూడు రోజులుగా ఏలూరు జిల్లాలోని నిర్వాసిత గ్రామాల్లో చర్చనీయాంశ మైంది.
‘ఆంధ్రజ్యోతి’లో కథనం.. నిర్వాసిత గ్రామాల్లో చర్చ
కొత్త ఇళ్ల నిర్మాణంపై నిర్వాసితుల వెనుకడుగు
కుక్కునూరు, ఏప్రిల్ 24 (ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టు 45.72 కాంటూరు లెవెల్‌లో 2వ దశ నిర్మాణానికి లైన్ క్లియర్ అయినట్టు ఈనెల 22న ‘ఆంధ్రజ్యోతి’ ప్రధాన సంచికలో వచ్చిన కథనం మూడు రోజులుగా ఏలూరు జిల్లాలోని నిర్వాసిత గ్రామాల్లో చర్చనీయాంశ మైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా 41.15 కాంటూరు లెవెల్‌లో దశలో ముంపు నకు గురవుతున్న గ్రామాల్లోని నిర్వాసితు లకు వ్యక్తిగత పునరావాస పరిహారం, కోల్పోతున్న ఇళ్లకు పరిహారం, పునరా వాసంలో భాగంగా కాలనీల్లో ఇళ్ల నిర్మాణం ప్రక్రియ వేగంగా జరుగుతోంది. 41.15 కాంటూరు పరిధిలో వేలేరుపాడు మండ లంలోని 80 శాతం గ్రామాలకు, కుక్కు నూరు మండలంలో 8 గ్రామాలకు ఆర్ అండ్‌ఆర్ పరిహారం చెల్లించే ప్రక్రియ కొన సాగుతోంది. ఇదిలా ఉండగా పోలవరం ప్రాజెక్టు ఆథారిటీ పీపీఏ అధికార వెబ్ సైట్‌లో సైతం 41.15 కాంటూరు లెవెల్‌లో 115 టీఎంసీల నీటి నిల్వకి ప్రాజెక్టు పరి మితం చేసే గణాంకాలు కనిపించాయి. ఈ నేపథ్యంలో 45.72 కాంటూరు లెవెల్‌లో పునరావాస ప్రక్రియ జాప్యం జరు గుతుం దనే ఆపోహ నిర్వాసితుల్లో నెలకొంది. ఈ క్రమంలో రెండేళ్లుగా 45.72 కాంటూరు లెవెల్‌లో ఉన్న నిర్వాసితులు ఆయా గ్రా మాల్లో లక్షలాది రూపాయలు ఖర్చు చేసి ఇళ్ల నిర్మాణం చేపట్టారు. ఇళ్ల స్థలాలూ కొనుగోలు చేస్తున్నారు. ప్రధాన సెంటర్‌ల లో సైతం షాపింగ్ కాంప్లెక్స్‌లు నిర్మిసు ్తన్నారు. 41.15 కాంటూరు లెవెల్‌లో పరి హారం అందుకున్న గ్రామాల్లో సైతం నిర్వా సితులు లక్షలాది రూపాయలు వెచ్చించి ఇళ్ల నిర్మాణం జరుపుతున్నారు. దీనికంతటికి ప్రధాన కారణం పునరావాస కాలనీలకు తరలించే ప్రక్రియ జాప్యం జరుగుతుందని నిర్వాసితుల ఆలోచన. అయితే ‘ఆంధ్ర జ్యోతి’లో 45.72 కాంటూరు లెవెల్‌లో ప్రాజెక్టు నిర్మా ణం జరుగుతుందని, పునరావాస ప్రక్రియకు అయ్యే ఖర్చును సైతం వెల్లడించింది. దీంతో నిర్వా సితుల్లో చర్చ మొదలైంది. పోలవరం తొలిదశ పనులు 2027 జూన్ నాటికి పూర్తి చేసి నీటి నిల్వ చేస్తామని సీఎం చంద్రబాబు ఇప్పటికే ప్రకటించారు. అనంతరం రెండో దశ ప్రక్రియ ఆరంభమవుతుందని స్పష్టం చేశారు.