Share News

డోంట్‌ కేర్‌!

ABN , Publish Date - Apr 04 , 2026 | 01:06 AM

జిల్లాలో పలు నియోజకవర్గాలో మట్టి మాఫియా బరితెగించి అక్రమంగా ప్రైవేట్‌ స్థలాల్లో, ప్రభుత్వ భూముల్లో మట్టి, గ్రావెల్‌ను తరలిస్తున్నారు.

డోంట్‌ కేర్‌!
ఉంగుటూరులో పోలవరం కాల్వ గట్టు వద్ద తవ్వకాలు

ఉంగుటూరులో విచ్చలవిడిగా మట్టి, గ్రావెల్‌ దందా

పెదపాడు, కొవ్వలిలో చేపల చెరువు తవ్వకాలు

నేడు మంత్రి నాదెండ్ల ఆధ్వర్యంలో డీఆర్సీ సమావేశం

జిల్లాలో పలు నియోజకవర్గాలో మట్టి మాఫియా బరితెగించి అక్రమంగా ప్రైవేట్‌ స్థలాల్లో, ప్రభుత్వ భూముల్లో మట్టి, గ్రావెల్‌ను తరలిస్తున్నారు. పర్యవేక్షించాల్సిన జలవనరులశాఖ, మైనింగ్‌శాఖ, విజిలెన్స్‌ (మైనింగ్‌), రెవెన్యూ శాఖలు చోద్యం చూస్తున్నా యి. మట్టి మాఫియాపై నిఘా ఏర్పాటు చేయాలని ఇటీవల జరిగిన డీఆర్సీ సమావేశాల్లో మంత్రులు నాదెండ్ల మనోహర్‌, కొలుసు పార్థసారథి ఆదే శాలు ఇచ్చినా.. కనీసం ఆ దిశగా అధికారులు కదలడం లేదు. దీంతో డీఆర్సీ చర్చలకు విలువ ఉందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

(ఏలూరు–ఆంధ్రజ్యోతి)

జిల్లా కలెక్టరేట్‌లో ఇన్‌చార్జి మంత్రి నాదెండ్ల మనోహర్‌ అధ్యక్షతన శనివారం ఉదయం 10.30 గంటలకు జిల్లా సమీక్షా సమావేశం (డీఆర్సీ) జరగనుంది. ఇందులో ప్రభుత్వం అమలు చేస్తున్న పది సూత్రాలు, ధాన్యం కొను గోలు, హౌసింగ్‌, రోడ్లు, భవనాలు, వైద్యం, రెవె న్యూ అంశాలపై సమీక్షించనున్నారు. అయితే ప్రతిసారీ అధికారుల నుంచి చూస్తాం.. చేస్తాం అనే సమాధానాలే వస్తున్నాయి. మట్టిని స్థానిక రైతుల పంట పొలాల్లోకి తీసుకెళ్లేందుకు క్యూబి క్‌ మీటరుకు రూపాయికి ఇచ్చేలా ప్రభు త్వం ఇటీవల నిర్ణయం చేయడంతో.. అది మాఫియా కు బాగా కలిసి వచ్చింది. మట్టి మాఫియా బరి తెగింపుకి ఫుల్‌స్టాప్‌ పెడతారా? తూతూ మంత్రంగా వదిలేస్తారా? అన్న ఆసక్తి నెలకొంది. ‘జిల్లాలో కూటమి పార్టీల బలం పెరగాలి.. ఇప్పుడున్న బలం ఎంతమాత్రం సరిపోదు.. ప్రజల్లోనే మీరంతా ఉండా’లంటూ సీఎం ఇటీ వల జరిగిన జిల్లా సమీక్షలో ఎమ్మెల్యేలకు నూరి పోశారు. తీరా ఆచరణలో మాత్రం మట్టి, గ్రావెల్‌ అక్రమ తవ్వకాల్లో పలు నియోజక వరా ్గలు ముందు వరుసకు చేరుతున్నాయి.

ఉంగుటూరు, నూజివీడుల్లో ఇటీవల మట్టి మాఫియా చెలరేగిపోయి మట్టి, గ్రావెల్‌ అక్రమంగా తవ్వకాలను చేస్తూ సొమ్ము చేసు కుంటున్నాయి. ఉంగుటూరులో రెవెన్యూ అధికారులు, వీఆర్వోలు పూర్తిగా చేతులెత్తేసినట్టు ఆరోప ణలు వినవస్తున్నాయి. ఇటీవల ఉంగుటూరు నియోజక వర్గంలో కలెక్టర్‌ వెట్రిసెల్వి సామూహిక గృహ ప్రవేశాల కార్యక్రమంలో ఎమ్మెల్యే ధర్మరాజుతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మట్టి, గ్రావెల్‌ అక్రమ రవాణా వైపు తొంగి చూడలేదని, కనీసం హెచ్చరికలు జారీ చేయలేదంటూ విమర్శలు వస్తున్నాయి.

పెదపాడులో డ్రెయిన్‌ను కలిపేసుకుని..

పెదపాడు మండలం నాయుడుగూడెంలో 82 ఎకరాల్లో చెరువుల తవ్వకాలకు అనుమతులు తీసుకుని.. దానికి అదనంగా డ్రెయిన్‌ భూములను కలిపేసుకుని స్థానికంగా ఓ సొసైటీ చైర్మన్‌ బినామీ పేర్లతో తవ్వకాలను భారీగా చేపడుతున్నారు. ఫిబ్రవరి 9న అప్సడా కింద మత్య్సశాఖ నుంచి రిజిస్ర్టేషన్‌ చేయించుకుని అనుమతి తీసుకోగా వేగంగా అనుమతులు రావడం విశేషం. జిల్లా స్థాయి కమిటీలో చర్చించి.. ఆమోదించారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తవ్వుతున్న చెరువుల పరిస రాల్లో బుడమేరు పొంగి ప్రవహించే ప్రాంతం. ఏటా వరదల సందర్భంలో బుడమేరు పొంగితే వ్యవసాయం ఖాళీ అయ్యే పరిస్థితి ఇక్కడ ఉంది. తవ్వుతున్న చెరువుల మధ్య పంట పొలా లకు వెళ్లే డ్రెయిన్‌ను కలిపేసుకుని మరీ చెరువులు తవ్వుతు న్నారు. జిల్లా స్థాయి కమిటీ అక్కడ చెరువుల తవ్వకాలపై కనీసం పరిశీలన చేయకపోవడం కొసమెరుపు. సోషల్‌ మీడియా, ఏదైనా పత్రికల్లో వార్తలు వస్తే ఆయా ప్రాంతాలను కనీసం తహసీల్దార్లు పరిశీలించ కుండానే వ్యతిరేక వార్త అంటూ ఖండనలు పంపడం పరిపాటిగా మారిందన్న ఆరోపణలు న్నాయి. కొవ్వలిలోను పాత అనుమతులతో చెరువుల తవ్వకాలు జరుగుతున్నట్లు ఆరోపణలున్నాయి.

పెదలంకలో మురుగుబోదె తవ్వకం

కలిదిండి మండలం పెద్దలంకలో చెరువుల మధ్య సర్వే నంబర్‌ 453/4బి సమీపంలో మురుగుబోదెను తవ్వి చెరువులో కలిపేసుకునే ప్రయత్నాలను కొందరు స్థానికులు మొదలెట్టారు. ఇక్కడ పుంత, మురుగుబోదే వ్యవహారంలో ఇంజక్షన్‌ ఆర్డర్‌ ఉన్నా ఎక్సవేటర్‌తో తవ్వకాలు చేసేలా ప్రయత్నాలు సాగు తున్నాయి. తద్వారా 79 సెంట్ల పుంత భూమి అన్యాక్రాంతం కానుందని రైతులు ఆరోపిస్తున్నారు. దీనిపై నిలదీస్తే స్థానిక ప్రజాప్రతినిధుల పేరుతో బెదిరిస్తున్నట్టు చెబుతున్నారు.

ఉంగుటూరులో భారీగా తవ్వకాలు

ఉంగుటూరు నియోజకవర్గంలో పోలవరం కుడి కాల్వ పరిసరాల్లో ఎక్స్‌వేటర్లతో ఎర్రమట్టి, గ్రావెల్‌ తవ్వి భారీ వాహనాల్లో తరలిస్తున్నారు. ప్రధానంగా నల్లమాడు, గొల్లగూడెం, అక్కుపల్లి గోకవరంలో భారీగా మట్టి దందా సాగుతోంది. నిడమర్రుకు చెందిన కొందరు కూటమి నేతల పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ట్రిపు రూ.ఐదు వేల చొప్పున రోజుకు 100 ట్రిపుల్లో అక్రమంగా మట్టి, గ్రావెల్‌ తరలు తోంది. ఈ మేరకు రూ.ఐదు లక్షల పైబడి ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోంది. గ్రావె ల్‌ను పాలకొల్లు, నరసాపురం చేర్చి సొమ్ము చేసుకుంటున్నారు. స్థానిక అవసరాలకు రైతు లు పొలాల నుంచి తోలుకునేందుకు అవకాశం ఉండడం లేదు. కాలనీల్లో మెరక పనులు చేయించకుండా మొత్తం మట్టి, గ్రావెల్‌ తరలిపోవడం విమర్శలకు తావిస్తోంది. ఈ వ్యవహారంలో తహసీల్దార్‌, వీఆర్వోలు చేతు లెత్తేశారు. మైన్స్‌, విజిలెన్స్‌ శాఖలు అటువైపు కన్నెత్తి చూడడం లేదు. మరోవైపు మండల స్థాయిలో కమిటీ పర్యవేక్షణ లేనేలేదు.

Updated Date - Apr 04 , 2026 | 01:06 AM