మా పొట్ట కొట్టొదు!
ABN , Publish Date - Jul 21 , 2026 | 12:50 AM
రిజిస్ర్టేషన్ల శాఖలో పీపీపీ విధానం, జిల్లా కేంద్రంలో సేవాకేంద్రం ఏర్పాటు నిర్ణయాలను వ్యతిరేకిస్తూ దస్తా వేజు లేఖరుల పెన్‌డౌన్‌కు దిగారు. ప్రైవేట్ సిబ్బంది అంతా నల్లబ్యాడ్జీలు ధరించి రిజిస్ర్టేషన్ కార్యాలయాల వద్ద కలియ తిరిగారు.
దస్తా వేజు లేఖరుల పెన్‌డౌన్
జిల్లా వ్యాప్తంగా స్తంభించిన రిజిస్ర్టేషన్లు
ఓవరాల్‌గా 20 రిజిస్ర్టేషన్లు ..రూ.ఎనిమిది లక్షల ఆదాయం
నేటి నుంచి హెల్ప్ డెస్కులు..జిల్లా రిజిస్ర్టార్ శ్రీనివాసరావు
(ఏలూరు–ఆంధ్రజ్యోతి)
రిజిస్ర్టేషన్ల శాఖలో పీపీపీ విధానం, జిల్లా కేంద్రంలో సేవాకేంద్రం ఏర్పాటు నిర్ణయాలను వ్యతిరేకిస్తూ దస్తా వేజు లేఖరుల పెన్‌డౌన్‌కు దిగారు. ప్రైవేట్ సిబ్బంది అంతా నల్లబ్యాడ్జీలు ధరించి రిజిస్ర్టేషన్ కార్యాలయాల వద్ద కలియ తిరిగారు. ఓవరాల్‌గా డాక్యుమెంట్ రైటర్లు, టైపిస్టులు, ఇతర ప్రైవేట్ సిబ్బంది మూకుమ్మడిగా ఆందోళనకు ఉపక్రమించారు. స్థానికంగా రిజిస్ర్టేషన్ కార్యాలయాలకు అనుబంధంగా ఉన్న వివిధ టైపిస్టు, లేఖరుల కార్యాలయాలను బంద్ పాటించేలా అసోసి యేషన్లు నాయకులు ఒప్పించారు. దాదాపుగా 80 శాతం విధులను బహిష్కరించారు. దీంతో జిల్లా రిజిస్ర్టార్ కార్యాలయంతో పాటు 11 సబ్ రిజిస్ర్టార్ కార్యాలయాల్లో రిజిస్ర్టేషన్లు లావాదేవీలు భారీగా తగ్గి పోయాయి. ఎన్నో ఏళ్లుగా రిజిస్ర్టేషన్ శాఖను నమ్ము కుని జీవిస్తున్న మా ఉపాధిని దెబ్బ తీయొద్దని నిరసన తెలిపారు. జిల్లా రిజిస్ర్టార్ కార్యాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో దస్తావేజు లేఖరుల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పెనుమాక వెంకట సుబ్బారావు మాట్లాడు తూ రిజిస్ర్టేషన్ల సేవలను ప్రైవేట్ వ్యక్తుల పరం చేస్తామంటే ఊరుకొనేది లేదని, ప్రభుత్వం దిగి వచ్చే వరకు తమ ఆందోళన ఈనెలాఖరు వరకు కొనసాగిస్తా మన్నారు.
బోసిపోయిన కార్యాలయాలు..
జిల్లా వ్యాప్తంగా రిజిస్ర్టేషన్ల శాఖలో ప్రైవేట్ సిబ్బం ది నిరసనలతో కార్యాలయాలన్నీ బోసిపోయాయి. శని వారం బుక్ చేసుకున్న స్లాట్ల్ రిజస్ర్టేషన్లు అరకొర గానే జరిగాయి. జిల్లా వ్యాప్తంగా 20 రిజిస్ర్టేషన్లు డాక్యు మెంట్‌ల ద్వారా సోమవారం కేవలం 8 లక్షల 35 వేల 070 ఆదాయం సమకూరింది. ఏలూరులో ఒకటి, మండవల్లిలో 4, కామవరపుకోటలో 2, ముదినేపల్లిలో ఒకటి, నూజివీడులో 10, చింతలపూడిలో 2 రిజిస్ర్టేషన్లు జరిగాయి. సగటున 70 నుంచి 80 వరకు రిజిస్ర్టేషన్లు జిల్లా వ్యాప్తంగా జరుగుతుంటాయి. ఓవరాల్‌గా మరో 50 లక్షల ఆదాయం పడిపోయినట్లేనని చెబుతున్నారు. ప్రైవేట్ సిబ్బంది ఆందోళన నేపథ్యంలో జిల్లా రిజిస్ర్టేషన్ శాఖలోని సబ్ రిజిస్ర్టార్లతో పరిస్థితిపై జిల్లా రిజిస్ర్టార్ కె.శ్రీనివాసరావు సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ‘రిజిస్ర్టేషన్లు ప్రక్రియకు మంగళవారం నుంచి విఘాతం కలగకుండా జిల్లా రిజిస్ర్టేషన్ కార్యా లయం, సబ్ రిజిస్ర్టార్ కార్యాలయాల్లో హెల్ప్‌డెస్క్‌లను ఏర్పాటు చేస్తున్నాం. ప్రజలు నేరుగా వచ్చి అధికారుల్ని సంప్రదించి స్లాట్ బుకింగ్‌తో పాటు టైపింగ్, డాక్యుమెంట్లు తయారీ తదితర అంశాలపై తెలుసుకుని లావాదేవీలు చేసుకోవచ్చన్నారు. సబ్ రిజిస్ర్టార్ కార్యాలయాల్లో సూచనలు, సలహాలను అందిస్తామని, ప్రజలు ఎవ్వరు అధైర్య పడకుండా వచ్చి భూమి లావా దేవీలను నిర్వహించుకోవాలని’ జిల్లా రిజిస్ర్టార్ కె.శ్రీనివాస రావు సూచించారు.