Share News

మా పొట్టలు కొట్టొద్దు..!

ABN , Publish Date - Jul 02 , 2026 | 12:41 AM

రిజిస్ర్టేషన్ల శాఖలో భారీ సంస్కరణలు దిశగా కూటమి ప్రభుత్వం అడు గులు వేస్తోంది. ఇప్పటికే వేగవంతంగా అన్ని రిజిస్ర్టేషన్ల కార్యాలయాల్లో స్లాట్‌ బుకింగ్‌ వ్యవస్థతో లావాదేవీలను చేస్తోంది.

మా పొట్టలు కొట్టొద్దు..!
ఏలూరులో దస్తావేజు లేఖరుల ఆందోళన

రిజిస్ర్టేషన్ల శాఖలో సంస్కరణలు

వేగంగా సేవలందించేందుకు సేవా కేంద్రాలు

(ఏలూరు–ఆంధ్రజ్యోతి)

రిజిస్ర్టేషన్ల శాఖలో భారీ సంస్కరణలు దిశగా కూటమి ప్రభుత్వం అడు గులు వేస్తోంది. ఇప్పటికే వేగవంతంగా అన్ని రిజిస్ర్టేషన్ల కార్యాలయాల్లో స్లాట్‌ బుకింగ్‌ వ్యవస్థతో లావాదేవీలను చేస్తోంది. మరోవైపు పీపీపీ మోడ్‌లోనే ప్రభుత్వ, ప్రైవేట్‌ భాగస్వామ్యంతో దళారులు, మఽధ్యవర్తుల ప్రమేయం తగ్గిం చడానికి జిల్లాస్థాయిలో సేవాకేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. ప్రామిసరీ నోట్‌ తరహాలోనే ఇక అన్ని రిజిస్ర్టేషన్లు ప్రైవేట్‌ వ్యక్తుల చేతుల మీదుగా రికార్డు లతో రిజిస్ర్టేషన్లు జరగనున్నాయి. మరోవైపు ఈ విధానంలోను రిజిస్ట్రార్లు తనిఖీ చేశాకే.. రిజిస్ర్టేషన్లు లావాదేవీలు జరుగుతాయి. ప్రైవేట్‌ వ్యక్తులే అన్ని వసతులను కల్పించుకుని సిబ్బంది, ఆపరేషన్స్‌, నిర్వహణతో పాటు ఫెసిలి టేషన్‌ కింద రూ.5,200 ఒక డాక్యుమెంట్‌కు వసూలు చేస్తారు. దీన్ని నుంచి ప్రతీ డాక్యుమెంట్‌కు రూ.2వేల చొప్పున ప్రభుత్వానికి జమ చేయనున్నారు. ఈ విధానం వల్ల ప్రభుత్వానికి రిజిస్ర్టేషన్ల కింద అదనపు అదాయం సమ కూరుతుందని అంచనా వేస్తున్నారు. జిల్లా కేంద్రంలో సేవా కేంద్రం ద్వారా సింగిల్‌ విండో కింద లావాదేవీలను వేగంగా చేయడానికి చర్యలు చేపట్టను న్నారు. ఇవి పాస్‌పోర్టు కేంద్రాల మాదిరిగానే శరవేగంగా సేవలందిస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే ఈ విధానం మహరాష్ట్ర తదితర రాష్ర్టాలు అమలు చేస్తున్నాయి. కాగా రిజిస్ర్టేషన్‌ శాఖను ప్రైవేట్‌ పరం చేసే ఆలోచన విరమించుకోవాలని డిమాండ్‌ చేస్తూ ఏలూరు జిల్లా రిజిస్ర్టార్‌ కార్యాలయం వద్ద దస్తావేజు లేఖరులు నల్లబ్యాడ్జీలను ధరించి బుధవారం ధర్నా నిర్వహించారు. రిజిస్ర్టేషన్‌శాఖ సేవల ప్రైవేటీకరణతో మా పొట్టలు కొట్టదంటూ నినాదాలు చేశారు. లేఖరుల, స్టాంపు వెండర్లు, డీటీపీ ఆపరేటర్లు ఉసురు తీయవద్దని పేర్కొన్నారు. రాష్ట్ర దస్తావేజు లేఖరుల అసోసియేషన్‌ అఽధ్యక్షుడు పెనుమాక వెంకట సుబ్బారావు మాట్లా డుతూ గతంలోనూ ఈవిధంగా రిజిస్ర్టేషన్ల సేవల ప్రైవేటీకరణకు ప్రభు త్వం ప్రయత్నించిందని ఆరోపించారు. ఇళ్లు, ఇళ్ల స్థలాలు, భూముల రిజి స్ర్టేషన్లు ప్రభుత్వం పీపీపీ విధానంలో ప్రైవేట్‌పరం చేస్తే రిజిస్ర్టేషన్‌లపై ఆధారపడిన మా ఉపాధిని తీస్తే ఊరుకోం.. భవిష్యత్‌లో మరిన్ని ఉద్య మాలు చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నామన్నారు.

Updated Date - Jul 02 , 2026 | 12:41 AM