Share News

జూనియర్‌ డాక్టర్ల సమ్మె ఉధృతం

ABN , Publish Date - Aug 18 , 2026 | 12:31 AM

తమ సమస్యలు పరిష్కరిం చాలంటూ జూనియర్‌ డాక్టర్లు తమ సమ్మెను తీవ్రతరం చేశారు.

జూనియర్‌ డాక్టర్ల సమ్మె ఉధృతం
ఆస్పత్రి ఆవరణలో ఆందోళన చేస్తున్న వైద్యులు

ఏలూరు క్రైం, ఆగస్టు 17 (ఆంధ్ర జ్యోతి): తమ సమస్యలు పరిష్కరిం చాలంటూ జూనియర్‌ డాక్టర్లు తమ సమ్మెను తీవ్రతరం చేశారు. ఏలూరు ప్రభుత్వసర్వజన ఆసుపత్రిలో 29 మంది సీనియర్‌ రెసిడెన్సిలు, 13 మంది జూనియర్‌ రెసిడెన్సిలు విధు లు నిర్వర్తిస్తున్నారు. తమకు ఇస్టున్న స్టైఫండ్రీని 30 శాతం పెంచి జనవరి నుంచి అమలు చేయాలనే ప్రధాన డిమాండ్‌తో మూడు రోజుల నుంచి సాధారణ వైద్యసేవల విధులను బహి ష్కరించి సమ్మె చేస్తున్నారు. అయితే ప్రభు త్వం కేవలం మూడు శాతం మాత్రమే స్టైఫ ండ్రీ పెంచుతామనడంతో ఆగ్రహించిన జూని యర్‌ డాక్టర్లు సోమవారం నుంచి అత్యవసర వైద్య సేవలు, థియేటర్‌ ఆపరేషన్‌ సేవలను పూర్తిగా నిలిపివేసి ఆసుపత్రి ఆవరణలో షామియానా వేసి తమ నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా జూనియర్‌ డాక్టర్లు మాట్లా డుతూ 2024లో స్టైఫండ్రీ పెంచారని అప్పటి నుంచి ఇంత వరకూ పెంచలేదని పక్క రాష్ట్రా ల్లో 30 శాతం పెంచి ఇస్తున్నారని కనీసం తమకు 15 శాతం అయినా ఇవ్వాలని తాము కోరుతున్నామని వెల్లడించారు. అంతేకాకుండా ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్‌ వయస్సు 62 సంవత్సరాలు ఉండగా వైద్యు లకు మాత్రం మరో మూడు సంవత్సరాలు పెంచి 65 ఏళ్ళు రిటైర్మెంట్‌ చేయడం వల్ల పదోన్నతులు, కొత్తగా ఉద్యోగా లు పొందలేక వైద్యుల్లో కూడా నిరుద్యోగ సమస్య తలెత్తుతుందని వెల్లడించారు. తాము ఏకధాటిగా 36 గంటలు విధులను నిర్వర్తిస్తున్నా మని తమకు సరైన మౌలిక సదు పాయాలు అందుబాటులో లేవని ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యులకు రక్షణ కల్పించాలని కోరారు. తమ సమస్య లను పరిష్కరించకపోతే తాము నిరవధికంగా సమ్మెను కొనసా గించి నిరాహారదీక్షలను చేపడతామని ప్రక టించారు. తాము అత్యవసర విభాగపు విధు లు, ఐసీయు విధులు, థియేటర్‌లో సర్జరీ విధులను పూర్తిగా బహిష్కరిస్తున్నామని ఒక నోటీసును కూడా ఆసుపత్రి మెడికల్‌ సూప రింటెండెంట్‌ డాక్టర్‌ జి.శ్యామలకు అందిం చారు. ఆసుపత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన శిబిరంలో ధర్నా నిర్వహించారు.

Updated Date - Aug 18 , 2026 | 12:31 AM