Share News

అనుమతుల్లేకుండా వైద్యం చేస్తే చర్యలు..

ABN , Publish Date - May 09 , 2026 | 12:36 AM

ఏజె న్సీ ప్రాంతాల్లో అనుమతుల్లేకుండా ప్రజలకు వైద్యసేవలు అందిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్యాధికారి డా.శోభా రాణి స్పష్టం చేశారు.

అనుమతుల్లేకుండా వైద్యం చేస్తే చర్యలు..
చినజీడిపూడిలో గిరిజనులతో మాట్లాడుతున్న డిఎంహెచ్‌వో డాక్టరు శోభారాణి

గిరిజన బాలిక మరణంపై విచారణ జరిపిన డీఎంహెచ్‌వో శోభారాణి

ఆర్‌ఎంపీ క్లినిక్‌, ల్యాబ్‌ సీజ్‌

డీఎంహెచ్‌వోను చుట్టుముట్టిన గిరిజనులు.. వైద్య ఆరోగ్యశాఖ పనితీరుపై ఆగ్రహం

ఆర్‌ఎంపీపై చర్యలు వద్దంటూ విజ్ఞప్తి

బుట్టాయగూడెం, మే 8(ఆంధ్రజ్యోతి): ఏజె న్సీ ప్రాంతాల్లో అనుమతుల్లేకుండా ప్రజలకు వైద్యసేవలు అందిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్యాధికారి డా.శోభా రాణి స్పష్టం చేశారు. కోర్సవారిగూడెంకు చెంది న బాలిక కారం సంగీత ఇటీవల జ్వరం బారిన పడి మరణించడంతో ఆమెకు వైద్యం అందించి న చినజీడిపూడికి చెందిన ఆర్‌ఎంపీ రమేష్‌ను శుక్రవారం విచారించారు. వైద్యం చేయడానికి ఆర్‌ఎంపీ రమేష్‌కు ఏ అనుమతులు లేవని, క్లినిక్‌ను, ల్యాబ్‌ను సీజ్‌ చేసినట్టు తెలిపారు. ఈమేరకు నోటీసులను డిప్యూటీ డీఎంహెచ్‌వో డా.సురేష్‌కుమార్‌ చేతుల మీదుగా అందజేశారు. అనం తరం దొరమామిడి ఆసుపత్రిని సంద ర్శించారు. వైద్యం పొందుతున్న రోగులను, గర్భిణులను ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. కాగా బాలిక మరణంపై రమేష్‌ను విచారిస్తున్న సమయంలో గిరిజ నులు డీఎంహెచ్‌వోను చుట్టుముట్టారు. బాలిక మృతి విషయంలో ఆర్‌ఎంపీ రమేష్‌ తప్పేమిలేదన్నారు. అతనిపై చర్యలు తీసుకుం టే ఊరుకునేది లేదని తేల్చిచెప్పారు. జ్వరంతో బాధ పడుతున్న సంగీతను మొదట దొర మామిడి ప్రాధమిక ఆరోగ్య కేంద్రానికే తీసు కెళ్లారని, అక్కడి వైద్యులు రక్తపరీక్షలు చేసి ఏమి లేదని ఇంటికి పంపారని, ఏమి లేన ప్పుడు బాలిక ఎందుకు అనారోగ్యం పాలై య్యిందని ప్రశ్నించారు. జ్వరంతో బాధ పడుతున్న బాలికకు రమేష్‌ వైద్యపేవలు అందించాడని, ఇప్పటివరకు అతని వైద్యం వల్ల ఎవరూ మరణించిన దాఖలాలు లేవన్నారు. బయట రక్తపరీక్షలు చేయిస్తే డెంగీ అని బయట పడిందని వెంటనే మెరుగైన వైద్యం కోసం జంగారెడ్డిగూడెం, ఇతర ప్రాంతాలకు రమేష్‌ సాయంతోనే తల్లిదండ్రులు తీసుకెళ్లారన్నారు. రమేష్‌పై చర్యలు తీసుకుంటే ఏలూరులో డీఎంహెచ్‌వో ఆఫీసును ముట్టడిస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రులకు వెళుతుంటే పట్టించుకున్నవారు లేరని, వైద్యులు, వైద్య సిబ్బంది గ్రామాలకు రారని తెలిపారు. గ్రామానికి సరైన రోడ్డు లేదన్నారు. దీనిపై స్పందించిన డీఎంహెచ్‌వో వైద్యం చేసేందుకు ప్రభుత్వం, వైద్య ఆరోగ్యశాఖ ద్వారా అనుమతులు తెచ్చుకుంటే తమకు ఏ అభ్యంతరం లేదన్నారు. ఆమె వెంట డెమో డా.పూజ, డీఎంవో ప్రసాద్‌, వైద్యాధికారిణి నందినీ, నరేష్‌, ఆర్‌ఐ గంగారాజు, వీఆర్వో, కార్యదర్శి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - May 09 , 2026 | 12:36 AM