Share News

ముసునూరు ఆసుపత్రిపై ఆరోపణలు.. విచారణ

ABN , Publish Date - Mar 05 , 2026 | 12:28 AM

ముసునూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్వహణకు సంబంధించి వస్తున్న ఆరో పణలపై జిల్లా ఇన్‌చార్జి వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి యు.శోభ బుధవారం క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టారు.

ముసునూరు ఆసుపత్రిపై ఆరోపణలు.. విచారణ
విచారణ జరుపుతున్న ఇన్‌చార్జి డీఎంహెచ్‌వో శోభ

ముసునూరు, మార్చి 4(ఆంధ్రజ్యోతి): ముసునూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్వహణకు సంబంధించి వస్తున్న ఆరో పణలపై జిల్లా ఇన్‌చార్జి వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి యు.శోభ బుధవారం క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టారు. రికార్డు లను తనిఖీ చేశారు. ఆసుపత్రిలో జరుగు తున్న పరిణామాలపై ఇద్దరు వైద్యులు, ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లతో కలిపి 33 మంది అభిప్రాయాలను లిఖితపూర్వకంగా తీసుకున్నారు. వైద్యులు, వైద్య సిబ్బందిని విడివిడిగా విచారించారు. ఈ క్రమంలో కొంతమంది బాధితులు ప్రథమ వైద్యురా లు పనితీరుపై ఇన్‌చార్జి డీఎంహెచ్‌వోకు ఫిర్యాదు చేశారు. అనంతరం ఇన్‌చార్జి డీఎంహెచ్‌వో మాట్లాడుతూ ఆసుపత్రి నిర్వహణ, వైద్యులు, సిబ్బంది మధ్య విబే ధాలపై డిప్యూటీ డీఎంహెచ్‌వో పద్మావతి, నూజివీడు మెడికల్‌ ఆఫీసర్‌ నరేంద్ర కృష్ణలతో కలిసి విచారణ జరిపినట్టు తెలిపారు. సమగ్ర విచారణ చేసి తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. దిగవల్లి పీహెచ్‌సీ వైద్యులు డాక్టర్‌ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 05 , 2026 | 12:28 AM