Share News

శభాష్‌ పశ్చిమ

ABN , Publish Date - Mar 12 , 2026 | 12:12 AM

ప్రభుత్వ పనితీరుపై జిల్లా ప్రజలు జై కొట్టారు. వివిధ శాఖల సేవలపై సంతృ ప్తి చెందారు.

శభాష్‌ పశ్చిమ

వివిధ శాఖల పనితీరులో జిల్లా ప్రథమం..

ఐవీఆర్‌ఎస్‌ సర్వేలో 74.1శాతం సంతృప్తి

సచివాలయంలో రెండు రోజుల కలెక్టర్ల సదస్సు ప్రారంభం..

హాజరైన జిల్లా కలెక్టర్‌ నాగరాణి

(భీమవరం–ఆంధ్రజ్యోతి)

ప్రభుత్వ పనితీరుపై జిల్లా ప్రజలు జై కొట్టారు. వివిధ శాఖల సేవలపై సంతృ ప్తి చెందారు. ప్రభుత్వం గడిచిన మూడు నెలల కాలానికి శాఖల పనితీరుపై ఐవీ ఆర్‌ఎస్‌ సర్వే ద్వారా ఆరా తీసింది. జిల్లా లో 74.1 శాతం మంది ప్రజలు సాను కూల దృక్పథంతో ఉన్నారు. రాష్ట్రంలోనే అత్యధికంగా సంతృప్తి చెందిన జిల్లాగా పశ్చిమ నిలిచింది. గతంలో ఇసుక విధా నం అమలులో సంతృప్తి చెందిన జిల్లాగా నిలవగా, ఇప్పుడు అనేక శాఖలు అదే వరుసలో నిలిచాయి. కలెక్టర్‌ నాగరాణి, జేసీ రాహుల్‌కుమార్‌రెడ్డి ఇతర శాఖాధిప తులు నిత్యం మండలాల్లో పర్యటించారు. ప్రభుత్వ విభాగాల పనితీరును మెరుగు పరిచేలా చర్యలు తీసుకున్నారు. ప్రభుత్వ సేవలు, పథకాల అమలు, ప్రజలకు అం దుతున్న సౌకర్యాలపై ప్రభుత్వం ఐవీఆర్‌ ఎస్‌ సర్వే నిర్వహించింది. మొత్తంపైన 41 అంశాలపై ఆరా తీసింది. అందులో పశ్చి మ తొలిస్థానంలో నిలవడంతో సీఎం చం ద్రబాబు నుంచి ప్రశంసలందుకున్నారు. సీఎం రెండు రోజులపాటు నిర్వహిస్తున్న కలెక్టర్ల సదస్సులో జిల్లాల వారీగా గణాంకాలను సమర్పించారు. అన్న క్యాం టీన్ల నిర్వహణ, పట్టణ, ప్రాథమిక ఆరో గ్య కేంద్రాల సేవలు, పాఠశాల విద్య, పౌరసరఫరాలో రేషన్‌ పంపిణీ, ఎన్టీఆర్‌ భరోసా పెన్షన్ల పంపిణీ, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో యూరియా సరఫరా, ఆర్‌ అండ్‌ఆర్‌ రిజిస్ర్టేషన్‌లు, గృహ నిర్మాణం, పారిశుధ్య నిర్వహణ, పంచాయతీలు అం దిస్తున్న సేవలు తదితర అంశాల్లో ప్రభు త్వ సర్వే ద్వారా ప్రజల స్పందన తెలుసు కుంది.

పెన్షన్‌ల పంపిణీ పక్కాగా

ఎన్టీఆర్‌ భరోసా పెన్షన్‌లను త్వరితగ తిన అందజేయడంలో ముందున్నారు. ప్రజా ప్రతినిధులు, కూ టమి నేతలు ప్రజల్లోకి వెళ్లి అందిస్తున్నారు. అధికారులు నిత్యం పర్యవేక్షిస్తున్నారు. వస తి గృహాలను సందర్శిం చి అక్కడ భోజన నాణ్య త, సౌకర్యాలపై కలెక్టర్‌ ప్రతి నెలా పరిశీలిస్తు న్నారు.వ్యవసాయ శాఖ గడచిన రబీలో యూరియా పంపిణీ ప్రణాళికతో చేపట్టింది. సీఎం సహాయ నిధి నుంచి ప్రజలకు వైద్య బిల్లులు మం జూరు చేయడంలో ప్రజా ప్రతినిధులు, కూటమి నేతలు పోటీ పడుతున్నారు. విద్యుత్‌ రంగంలోనూ మెరుగైన సేవలు అందుతున్నాయి. ఇటీవల ప్రభుత్వ వైద్య సేవలు మెరుగయ్యాయి. విలువ ఆధారిత ఉత్పత్తులో పశ్చిమ మూడో స్థానంలో ఉంది. ఇక్కడ ఆక్వా ప్రోసెసింగ్‌ యూని ట్‌లు, రైస్‌ మిల్లింగ్‌ పరిశ్రమతో ఇది సాధ్యపడింది.

పారిశ్రామిక, సర్వీస్‌ రంగంలో జిల్లా కాస్త వెనుకపడింది. పరిశ్రమల్లో దిగువ నుంచి ఏడో స్థానంలో ఉంది. జిల్లాల వారీగా స్థూల విలువ ఆధారిత ఉత్పత్తుల్లో 11వ స్థానం, వ్యవసాయ అనుబంధ రంగాల్లో మూడో స్థానం, జిల్లా స్థూల జాతీయ ఉత్పత్తిలో 11వ ర్యాంకు సాధించింది. ఒక్క వ్యవసాయ అనుబంధ రంగాలే జిల్లాను గట్టెక్కిస్తున్నాయి. మిగిలిన రంగాలు వృద్ధి చెందాలి.

ఫైళ్ల పరిష్కారంలో ఎస్పీకి రెండో ర్యాంకు

ఫైళ్ల పరిష్కారంలో జిల్లా ఎస్పీ నయీమ్‌ రాష్ట్రంలో రెండో ర్యాంకు సాధించారు. దాదాపు 612 ఫైళ్లను సగటున 10.30 గంటల వ్యవధిలోనే పరిష్కరించారు. దీనిపై పోలీసు వర్గాల్లో జోష్‌ నెలకొంది.

Updated Date - Mar 12 , 2026 | 12:12 AM