ఉద్యోగార్థుల కోసం ఏలూరులో డిజిటల్ లైబ్రరీ
ABN , Publish Date - Jan 09 , 2026 | 12:27 AM
ఉద్యోగ పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు ఉపయోగ పడేలా రూ.2 కోట్ల వ్యయంతో దేశంలో తొలి డిజిటల్ లైబ్రరీని ఏలూరులో ఏర్పాటు చేస్తామని ఎంపీ పుట్టా మహేశ్ కుమార్ తెలిపారు.
ఏఐ కంప్యూటర్ ల్యాబ్‌లను ప్రారంభించిన ఎంపీ పుట్టా మహేశ్
ఏలూరు అర్బన్, జనవరి 8 (ఆంధ్ర జ్యోతి) : ఉద్యోగ పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు ఉపయోగ పడేలా రూ.2 కోట్ల వ్యయంతో దేశంలో తొలి డిజిటల్ లైబ్రరీని ఏలూరులో ఏర్పాటు చేస్తామని ఎంపీ పుట్టా మహేశ్ కుమార్ తెలిపారు. ఏలూరు జిల్లాలోని ఏడు కళాశాలలు, నాలుగు పాఠశాలల్లో ఓఎన్జీసీ రూ.2.50కోట్ల సీఎస్‌ఆర్ నిధులు ఏర్పాటు చేసిన కృత్రిమ మేథ(ఏఐ)ఆధారిత కంప్యూటర్ ల్యాబ్‌లను గురువారం ఏలూరులోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో ఆయన ప్రారంభించి మాట్లాడారు. సమాచార, సాంకేతిక వ్యవస్థలో ఏఐ, మెషీన్ లెర్నింగ్ కోర్సులకు ఎంతో డిమాండ్ ఉందని, రాష్ట్రంలో క్వాంటం కంప్యూటర్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం ద్వారా యువతకు సాఫ్ట్‌వేర్ రంగంలో ఉద్యోగావకాశాలు లభిస్తాయన్నారు. ఎమ్యెల్యే బడేటి చంటి మాట్లాడుతూ రాష్ట్ర రాజధానికి ఏలూరు చేరువగా ఉన్నందున నగర పరిసరాల్లో సాఫ్ట్‌వేర్ కంపెనీలు ఏర్పాటుకు చొరవచూపాలని కోరారు. కలెక్టర్ వెట్రిసెల్వి, డీఈవో వెంకటలక్ష్మమ్మ, ఆర్టీసీ రీజినల్ చైర్మన్ అప్పలనాయుడు, ఇడా చైర్మన్ శివప్రసాద్, ఓఎన్‌జీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సత్యప్రసాద్, ప్రాజెక్టు డైరెక్టర్ నిహా, ప్రిన్సిపాల్ గిరిబాబు, తదితరులు పాల్గొన్నారు.