Share News

'ఢీ'జిల్‌.... క్యూ

ABN , Publish Date - Apr 25 , 2026 | 12:40 AM

డీజిల్‌ కష్టాలు శుక్రవారం మరింత పెరిగాయి. అమె రికా–ఇరాన్‌ యుద్ధం నేపథ్యంలో కొద్ది రోజులుగా బంకులకు డీజిల్‌ సరఫరాలో కోత విధించారు.

'ఢీ'జిల్‌.... క్యూ

కొనసాగుతున్న కష్టాలు.. వరి, ఆక్వా రైతుల పాట్లు

రెవెన్యూ, పోలీసు పహారాలో పంపిణీ

ఆటోలకు రూ.500, పెద్ద వాహనాలకు రూ.1,000కే పరిమితం

తాడేపల్లిగూడెంలో నడవని ఆటోలు

రొయ్యల చెరువులకు తహశీల్దార్లు లెటర్ల ఆధారంగా సరఫరా

టిన్నులతో బంకులకు క్యూ కట్టిన రైతులు

ఎలాంటి కొరత లేదంటున్న కలెక్టర్‌, జేసీ

కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు తప్పవని హెచ్చరిక.. కలెక్టరేట్‌లో టోల్‌ ప్రీ నెంబరు

భీమవరం/టౌన్‌/తాడేపల్లిగూడెం/పెనుమంట్ర/ఆకివీడు/వాసవి పెనుగొండ, ఏప్రిల్‌ 23(ఆంధ్రజ్యోతి): డీజిల్‌ కష్టాలు శుక్రవారం మరింత పెరిగాయి. అమె రికా–ఇరాన్‌ యుద్ధం నేపథ్యంలో కొద్ది రోజులుగా బంకులకు డీజిల్‌ సరఫరాలో కోత విధించారు. ఈ కారణంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని చాలా బంకులకు అవసరమైన మేర సరఫరా కావడం లేదు. అసలే వరి కోతల సమయం. మరోవైపు ఆక్వా చెరువుల్లో ఆక్సిజన్‌ లోపం రాకుండా ఏరియేటర్లను నిరంతరం తిప్పాలి. వరి కోతల మిషన్లు, ఇంజన్లకు అవసర మైన డీజిల్‌ కోసం రైతులు టిన్ను లతో బంకుల వద్దకు క్యూకట్టారు. దీంతో సరఫరాను పరిమితం చేశారు. రెవెన్యూ అధికారులు, పోలీసు బందోబస్తు మధ్య సర ఫరా చేస్తున్నారు. పశ్చిమలో ఏప్రిల్‌కు వచ్చేసరికి 30 శాతం వినియోగం పెరిగింది. జిల్లాలో తాడేపల్లిగూడెం, తణుకు, భీమవరం, పాల కొల్లు, నరసాపురం, ఆచం ట, పెనుమంట్ర, పెను గొండ, ఆకివీడు తదితర ప్రాంతాల్లో చాలా బంకు ల వద్ద ఇదే పరిస్థితి నెలకొంది. ఇంధన కంపెనీలు బంకులకు డీజిల్‌ సరఫరాను నియంత్రించడంతో పౌర సరఫరాల కమిషనర్‌ శుక్ర వారం విజయవాడలో డీలర్లతో సమా వేశమయ్యారు. సరఫరా పెంచాలని కోరారు. పశ్చిమ గోదావరిలో పరిస్థితిపై నరసాపురం మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు మంత్రి లోకేశ్‌ దృష్టికి తీసుకువెళ్లారు. ఆయన పరిస్థితిని సరిదిద్దాలని జిల్లా అధికారులకు ఆదేశాలు జారీచేశారు. పెట్రోలుకు ఎలాంటి ఇబ్బంది లేకపో యినప్పటికి వాహనదారులు ముందు జాగ్రత్తగా ట్యాం కులు ఫుల్‌ చేయించుకుంటున్నారు. తాడేపల్లిగూడెం, తణుకు, ఆచంట తదితర పట్టణా ల్లో పోలీసు బందోబస్తు మధ్య డీజిల్‌ విక్రయాలు జరి గాయి. డీజిల్‌ కొరత కారణంగా తాడేపల్లిగూడెంలో కొం దరు డ్రైవర్లు ఆటోలు నడపలేదు. దీంతో ప్రయాణి కులు ఇబ్బందులు పడ్డారు. డీజిల్‌ అందుబాటులోకి వచ్చిందని తెలియడంతో ఆటోలు, వాహనదారులు బం కుల వద్దకు టిన్నులతో క్యూకట్టారు. విచిత్రం ఏమిటం టే పట్టణంలోని అన్ని బంకుల వద్ద డీజిల్‌ అందు బాటులోకి వచ్చింది. డీజిల్‌ దొరకదనే పుకార్లతో బంకు ల వద్ద క్యూకట్టారు. కోత మిషన్‌దారులకు తహసిల్దార్‌ నుంచి తెచ్చుకున్న లెటర్‌కు అనుగుణంగా డీజిల్‌ కొడు తున్నారు. మిగిలిన పెద్ద వాహనాలకు రూ.1,000కు, ఆటోలకు రూ.500కు నింపుతున్నారు. ఆచంట, వాసవి పెనుగొండ మండలాల్లో బంకుల వద్ద డీజిల్‌ లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొడమంచిలిలో డీజిల్‌ ఉందని సమాచారంతో జనం ఒక్కసారిగా అక్కడకు పరుగులు తీశారు. ఫలితంగా అక్కడ ఒక్కొ క్కరికి రెండు లీటర్లు మాత్రమే కొడుతున్నారు. వరి కోత మిషన్లు, ఆటోలు, ట్రాక్టర్లు, లారీల యజమానులు ఒక్కసారిగా బంకుల వద్దకు రావడంతో కిక్కిరిసింది. డీజిల్‌ కోసం తెచ్చిన డబ్బాలను లైన్‌లో పెట్టి మరీ వేచి ఉన్నారు. రెవెన్యూ, పోలీసు అధికారులు దగ్గరుండి బంకు వద్ద డీజిల్‌ అమ్మకాలు కొనసాగించారు. పెనుమంట్ర మండలంలోను ఇదే పరిస్థితి. రైతులు బంకుల వద్దకు వచ్చి నో స్టాక్‌ బోర్డులను చూసి వెనుదిరిగారు. పొలమూరు, బ్రాహ్మణచెరువు, ఆలమూరు, వెలగలేరు, నెగ్గిపూడి పెట్రోల్‌ బంకుల్లో డీజిల్‌ కొరరత ఏర్పడి నో స్టాక్‌ బోర్డులు వెలిశాయి. ఆకివీడులోని పెట్రోల్‌, డీజిల్‌ బంకుల వద్ద శుక్రవారం రాత్రి వాహనాలు, టిన్నులతో జనం బారులు తీరారు. ట్రాక్టర్లు, కార్లు జాతీయ రహదారి పొడవునా లైన్లలో నిలిపారు. బంకుల వద్ద ముం దస్తుగా తహశీల్దార్‌ పరూక్‌, ఎస్‌ఐ నాగరాజు బందో బస్తు ఏర్పాటు చేయించారు. ఫేక్‌ ప్రచారాలు నమ్మవద్దని బంకు యాజమాన్యం, పోలీసులు కోరుతున్నారు.

ఆక్వా రైతులకు కొరత రానివ్వం

నాయకులతో కలెక్టర్‌ నాగరాణి హామీ

భీమవరం టౌన్‌, ఏప్రిల్‌ 24(ఆంధ్రజ్యోతి):‘ఆక్వా రైతులకు డీజిల్‌, పవర్‌ కట్‌ ఇబ్బందులు లేకుండా చూస్తాం. కొన్ని బంక్‌లకు ఆక్వా రైతు పర్మిషన్‌ సర్టి ఫికెట్లు తెస్తే డీజిల్‌ ఇచ్చేలా ఏర్పాటు చేస్తాం’ అని కలెక్టర్‌ నాగరాణి హామీ ఇచ్చారు. శుక్రవారం రాజ్యసభ సభ్యుడు పాకా వెంకట సత్యనారాయణతో కలి సి జిల్లా రొయ్యి రైతుల సంఘం నాయకులు కలెక్ట ర్‌ను కలిసి వినతి పత్రం అందించారు. ఐస్‌ ఫ్యాక్టరీలకు, ఇండస్ర్టియల్‌ పవర్‌ కట్‌ నుంచి మినహాయిం చాలని కోరారు. ట్రాన్స్‌కో ఎస్‌ఈకి వినతిపత్రం అం దించారు. తులసీ రాంబాబు, సుబ్బరాజు, వీరవల్లి చంద్రశేఖర్‌ ఉన్నారు.

డీజిల్‌, పెట్రోల్‌ కొరత లేదు

దాళ్వా వరి కోతలకు, ఆక్వా అవసరాల దృష్ట్యా పెట్రోల్‌, డీజిల్‌ సరఫరా అంతరాయం లేకుండా చర్యలు చేపట్టాం. జిల్లాలోని 165 పెట్రోల్‌ బంకుల వద్ద తగిన నిల్వలు ఏర్పాటు చేసి సరఫరా పెంచు తున్నాం. అవసరానికి మించి పెట్రోల్‌, డీజిల్‌ కొను గోలు చేసి నిల్వ చేసుకోవద్దు. ఇంధన సరఫరాలో ఇబ్బందులు ఉంటే కలెక్టరేట్‌ కంట్రోల్‌రూమ్‌ టోల్‌ ఫ్రీనంబర్‌ 8121676653కు సమాచారం అందించాలి.

– జేసీ రాహుల్‌కుమార్‌రెడ్డి

Updated Date - Apr 25 , 2026 | 12:40 AM