Share News

డీజిల్‌ నో స్టాక్‌

ABN , Publish Date - Apr 24 , 2026 | 12:45 AM

జిల్లాలో డీజిల్‌కు డిమాండ్‌ ఏర్పడింది. రబీ కోతలకు వరి కోత యంత్రాలు వచ్చేశాయి.

డీజిల్‌ నో స్టాక్‌
తాడేపల్లిగూడెం మార్కెట్‌లోని బంక్‌ వద్ద వాహనాల క్యూ

సరఫరా చేయలేక చేతులెత్తేస్తున్న బంకులు

నేడు కంపెనీ ప్రతినిధులతో సమావేశం

జిల్లాకు వరికోత యంత్రాలు

బంకుల నుంచే పరిశ్రమల కొనుగోళ్లు.. పెరిగిన వినియోగం

గత ఏడాది కోటా ఆధారంగానే సరఫరా

(భీమవరం – ఆంధ్రజ్యోతి)

జిల్లాలో డీజిల్‌కు డిమాండ్‌ ఏర్పడింది. రబీ కోతలకు వరి కోత యంత్రాలు వచ్చేశాయి. ఎండలు మండిపోతుం డడంతో ఆక్వా సాగులో డీజిల్‌ విని యోగం అధికమైంది. గత ఏడాది మాదిరి గానే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు కంపెనీలు కోటా విడుదల చేస్తున్నాయి. డిమాం డ్‌ పెరగడంతో బంకుల్లో నిల్వలు తరిగిపోతు న్నాయి. కొరత ఏర్పడింది. ఖాతాదారులకు డీజిల్‌ ఇవ్వలేకపోతున్నామని బంకు యజమానులు లబో దిబోమంటున్నారు. ఇంధన కంపెనీలకు సమాచారం ఇచ్చారు. అయినా ఫలితం కానరాలేదు. గత ఏడాది మాదిరిగానే కోటా ఇచ్చేశామంటూ కంపెనీలు స్పష్టం చేస్తున్నాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరిలో 300 పెట్రోలు బంకులున్నాయి. ఒక్క పశ్చిమలోనే 165 బంకుల్లో డీజిల్‌ సరఫరా అవుతోంది. ఉమ్మడి జిల్లాకు ప్రతి రోజు 10 లక్షల లీటర్ల డీజిల్‌ అవసరం. కంపెనీల నుంచి ఆ మేరకు సరఫరా కావడం లేదు. దీనిపై పౌరసరఫరాల కమిషనర్‌కు బంకుల యజమానులు ఫిర్యాదు చేశారు. శుక్రవారం కంపెనీ అధికా రులతో పౌరసరఫరాల కమిషనర్‌ విజయవాడలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. జిల్లా నుంచి పెట్రోల్‌ బంకుల యజమానుల సంఘం ప్రతినిధులు సమావేశానికి హాజరవుతున్నారు.

బంకులపై పడ్డ కంపెనీలు

అమెరికా–ఇరాన్‌ యుద్ధం కారణంగా కేంద్ర ప్రభుత్వం పరిశ్రమలు, కంపెనీలకు సరఫరా చేసే డీజిల్‌ ధరను లీటరుపై రూ.25 పెంచింది. ఇంధన సంస్థల నుంచి నేరు గా డీజిల్‌ కొనుగోళ్లు తగ్గిపోయాయి. గతంలో ఇంధన సంస్థల నుంచి రప్పించుకుంటే తక్కువ పడేది. దీంతో బంకులకు వచ్చేవారు కాదు. పోలవరం ప్రాజెక్ట్‌తో పాటు, జిల్లాలోని పరిశ్రమలు పెట్రో కంపెనీల నుంచి రప్పించుకునేవి. ఇప్పుడు పరిశ్రమలకు, పోలవరం ప్రాజెక్ట్‌కు అవసరమైన డీజిల్‌ కోసం నేరుగా బంకుల వద్దకు వెళుతున్నారు. దీనివల్ల మెట్ట ప్రాంతం, డెల్టాలోని బంకుల్లో డీజిల్‌ కు డిమాండ్‌ ఏర్పడింది. కొరత అనివార్య మైంది. ఫలితంగా డీజిల్‌ను సక్రమం గా సరఫరా చేయలేకపోతున్నారు. మరోవైపు వరి కోత యంత్రాల కు డీజిల్‌ వినియోగం పెర గడంతో కొరత ఉందని బంకు యజమా నులు చెబు తున్నారు. రెండు లేదా మూడు రోజులు మాత్రమే ఇటువంటి ఇబ్బంది ఉంటుందని అంచనా వేస్తున్నారు.

అత్యవసరమైన డీజిల్‌

పెట్రోలు కంటే డీజిల్‌ అత్యవసరం. ఇది అందుబాటులో లేకపోతే వరి కోత యంత్రాలు నిలిచిపోనున్నాయి. కోతలకు ఇబ్బంది ఎదురవుతోంది. ఆక్వా ప్రాసెసింగ్‌ యూనిట్లలో బాయి లర్లు నిలిచిపోతాయి. ఆక్వా చెరువుల్లో మిషన్లు పనిచేయవు. చేపలు, రొయ్యలకు ఆక్సిజన్‌ సమస్యలు ఉత్పన్నం కానున్నా యి. రవాణా రంగం నిలిచిపోనుంది. ఇందుకోసమే డీజిల్‌ అత్య వసరమంటూ బంకు యజమానులకు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. కానీ, పరిశ్రమలకు డీజిల్‌ ధరను ఇంధనకంపెనీల నుంచి కొనుగోళ్లు నిలిచిపోయాయి. నష్టం వస్తోందని, పెంచిన ధరలతో ఫలితం లేకపోయిందంటూ కంపెనీల ప్రతినిధులు ఘొల్లుమంటున్నారు. దీంతో బంకులకు కాస్త పరిమితులు విధించారు. గతంలో వున్న డిమాండ్‌ మేరకే సరఫరా చేస్తు న్నారు. ఈ ఏడాది పోలవరం ప్రాజెక్ట్‌, ఇతర పరిశ్రమలు బంకుల నుంచి కొనుగోళ్లు చేస్తున్నాయి. దీనివల్ల బంకుల్లో విని యోగం పెరిగింది. అయినా కంపెనీలు ససేమిరా అంటు న్నాయి. దీనిపైనే ఇప్పుడు పౌరసరఫరాల కమిషనర్‌ స మావేశం ఏర్పాటుచేశారు. ప్రభుత్వ స్థాయిలో చొరవ చూపితేనే పరిశ్రమలను అధికధరలకు కొను గోలు చేస్తాయి. లేదంటే బంకుల నుంచి కొంటాయి. ఇది తమ చేతిలో లేని సమస్య అంటూ బంకు యజమానులు చెబుతున్నారు. మరో వైపు సక్రమంగా సరఫరా చేయలేక ఇబ్బం దులు పడుతున్నారు. దీనిపై వాహనదారుల్లో ఆందోళ న మొదలైంది.

బంకుల వద్ద వాహనాల క్యూ

తాడేపల్లిగూడెం, ఏప్రిల్‌ 23(ఆంధ్రజ్యోతి): జిల్లాలో వెయ్యికి పైగా వరి కోత యంత్రాలను వినియోగిస్తున్నట్లు అంచనా. ఒక్కొక్క మిషన్‌కు రోజుకు 100 నుంచి 150 లీటర్ల వరకు డీజిల్‌ వినియోగం అవుతుంది. ఈ క్రమంలో డీజిల్‌ వినియోగం పెరిగింది. డీజిల్‌ కొరత వస్తుందంటూ పుకార్లు రావడంతో బంకుల వైపు వాహదారులు క్యూ కడుతున్నారు. దీంతో అవసరానికి మించి ట్యాంకులు నింపుకోవడంతో కొరతకు మరో కారణం. సాధారణ రోజుల్లో రోజుకు మూడు లక్షల లీటర్ల వినియోగం వుంటే.. ప్రస్తుతం అది ఆరు లక్షల లీటర్లకు పెరిగినట్లు అధికారులు ధ్రువీకరిస్తున్నారు. తాడేపల్లిగూడెంలో 11 పెట్రోలు బంకులు వున్నాయి. మార్కెట్‌లోని బంక్‌ మినహా మిగిలిన అన్ని బంకుల్లోను డీజిల్‌ నో స్టాక్‌ బోర్డులు పెట్టారు. ఈ కారణంగా డీజిల్‌ వున్న బంకు వద్దకు పట్టణం లోని వాహనాలన్నీ క్యూ కట్టాయి. ఈ బంకు వద్ద ఉదయం 15 వేల లీటర్ల స్టాక్‌ వుంటే.. సాయంత్రానికి 10 వేల లీటర్లు అమ్ముడుపోయింది. గతంలో ఈ బంకు వద్ద ఒక్క రోజంతా అమ్మినా మూడు వేల నుంచి నాలుగు వేల మధ్యే సేల్‌ ఉండేది. ఇదైనా ఖాతాదారులకు అరువు ఇవ్వడంతో ఈ మాత్రమైనా ఉండేదని బంకు నిర్వాహకులు చెబుతు న్నారు. తమ రెగ్యులర్‌ ఖాతాదారులకు మాత్రమే ఆయిల్‌ కొడతామని, మిగిలిన వారికి కొట్టబోమని చెబుతుంటే వాహనదారులు గొడవకు దిగారు. దీంతో బంక్‌ నిర్వాహకులు ఆటోకు రెండు లీటర్లు, పెద్ద వాహ నానికి ఐదు లీటర్ల చొప్పున డీజల్‌ నింపడంతో గొడవ సద్దుమణిగింది.

Updated Date - Apr 24 , 2026 | 12:45 AM