Share News

మాటల యుద్ధం

ABN , Publish Date - May 27 , 2026 | 12:41 AM

నూజివీడులో రాజకీయ నేతల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. 2024 ఎన్నికల వరకు మిత్రులుగా సాగిన కొలుసు పార్థసారథి, మాజీ ఎమ్మెల్యే మేక వెంకట ప్రతాప అప్పారావు ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పిస్తున్నారు.

మాటల యుద్ధం

పుర పోరుకు సమాయత్తం

(నూజివీడు – ఆంధ్రజ్యోతి)

నూజివీడులో రాజకీయ నేతల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. 2024 ఎన్నికల వరకు మిత్రులుగా సాగిన కొలుసు పార్థసారథి, మాజీ ఎమ్మెల్యే మేక వెంకట ప్రతాప అప్పారావు ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పిస్తున్నారు. సౌమ్యు డిగా పేరున్న అప్పారావు చివరికి వైసీపీ భాషతో విరుచుకు పడడం నియోజకవర్గంలో చర్చనీయాంశమైంది. మంత్రి పార్థసారథి, అనుచురులు ధీటుగా బదులివ్వడంతో రాజకీయ వేడి రాజుకుంటోంది. పురపోరుకు ఇరు పార్టీలు సమాయత్తం అవుతున్నాయని పరిశీలకులు భావిస్తుంటే అసలు సమస్యలు పక్కదారి పడుతున్నాయని ప్రజలు వాపోతున్నారు.

పక్కదారి పట్టిన అసలు సమస్య

మామిడి, మొక్కజొన్న రైతుల సమస్యతో మంత్రి, మాజీ ఎమ్మెల్యే మధ్య మాటల యుద్ధం ఆరంభమైంది. రైతుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వైసీపీ ఆధ్వర్యంలో ప్రతాప్‌ నూజివీడులో రైతు సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో మాజీ మంత్రులైన పేర్ని నాని, జోగి రమేష్‌, మాజీ ఎమ్మెల్యే ప్రతాప్‌, ఆయన అనుచరులు మంత్రి పార్థసారథిపై పలు అవినీతి ఆరోపణలు చేశారు. దీనికి ప్రతిగా మంత్రి పార్థసారథి అదే స్ధాయిలో సమాధానం చెప్పారు. దానికి ప్రతిగా మాజీ శాసనసభ సభ్యులు ప్రతాప్‌ శనివారం కార్యకర్తలు సమావేశం ఏర్పాటు చేసి మంత్రి సారథికి ప్రతి సవాల్‌ విసిరారు. సవాళ్లు ప్రతి సవాళ్ల మధ్య తమ సమస్య పక్కదారి పట్టిందని రైతులు వాపోతున్నారు.

పుర పోరుకు తయారు..!

పురపాలక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నేతలు పరస్పర ఆరోపణలు చేస్తున్నారని ప్రచారం ఉంది. పుర పోరులో తమ పట్టు నిరూపించకోవడానికి ఇరు పార్టీలు సమాయత్తం అవుతున్నాయి. తమ పార్టీ నుంచి ఏడుగురు కౌన్సిలర్లను తెలుగుదేశంలోకి చేర్చుకోవడంపై ప్రతాప్‌ ఆగ్రహంతో ఉన్నారు. ఇంతవరకు నూజివీడు మునిసిపా లిటీలో 7 వార్డులకు మించి గెలవలేని తెలుగుదేశం పార్టీకి ఈసారి తన హయాంలో పురపాలక అధికారాన్ని కట్టబె ట్టాలని మంత్రి పార్థసారథి పట్టుదలతో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ ఇద్దరి నాయకులు ఒకరి తప్పులు ఒకరు బయట పెట్టుకుంటూ రాజకీయ క్రీడ ప్రారంభించారు. రానున్న రోజుల్లో ఈ రెండు పార్టీలు మధ్య స్థానికంగా మరింత వేడి పుంజుకొనే అవకాశం కనిపిస్తోంది.

తాటాకు చప్పుళ్లకు బెదరం: మంత్రి పార్థసారథి

రాష్ట్ర అభివృద్ధిని ఆటకంపరిచే వైసీపీ తాటాకు చప్పుళ ్లకు తాము బెదిరిపోయే ప్రసక్తే లేదని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. నూజివీడులోని మంత్రి క్యాంప్‌ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మా ట్లాడారు. అభివృద్ధికి ఆటంకపరచాలనే ఉద్దేశంతో వైసీపీ కుయుక్తులు పన్నుతూ అధికారులపై బెదిరింపులకు దిగు తోందన్నారు. కనీసం అసెంబ్లీ సమావేశాలకు రాకుండా వైసీపీ వ్యవహరిస్తున్న తీరు దారుణమన్నారు. జగన్‌ ఐదేళ్లు చేతకాని పాలన, బీసీ, ఎస్సీలపై దమనకాండకు చంద్రయ్య, సుధాకర్ల మృతి నిదర్శనం అన్నారు. వారి పాలన చూసి ఛీ కొట్టిన ప్రజలు కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదని గుర్తుంచుకోవాలన్నారు. స్థానికంగా వైసీపీ దొరగారు దువ్వెనతో మీసాలు రుద్దుతూ రౌడీలకే రౌడీని అని చెప్పడానికి ప్రయత్నిస్తున్నారంటే భయానక వాతావరణం సృష్టించేందుకు నిదర్శనం అన్నారు. బాధ్యత గల ప్రతిపక్షంగా ఏ అభివృద్ధి పనులు చేపట్టాలో సలహాలు సూచనలు ఇస్తే బాగుంటుందన్నారు. రైతు సమస్యలపై మీరు గతంలో ఏంచేశారు గుర్తుకు తెచ్చుకోవాలన్నారు.

గ్రావెల్‌ తవ్వకాలపై పరిశీలిద్దాం రండి

అమరావతి అభివృద్ధి పనులకు గ్రావెల్‌ అవసరం. నూజివీడు, గన్నవరం, గుంటూరు జిల్లాలో కొన్ని ప్రాంతా లలో గ్రావెల్‌ దొరుకుతుంది. ఇక్కడి నుంచి అనుమతులు తీసుకుని తరలిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో భారీ కందకాలు కొట్టి గ్రావెల్‌ను అక్రమ తరలించడం ప్రజలకు తెలుసన్నారు. గ్రావెల్‌ తరలిస్తున్న ప్రాంతాలకు రాజకీయ పక్షాల నాయకులు, మీడియాతో కలిసి వెళదామంటూ ప్రతాప్‌ను ఆయన ఆహ్వానించారు.

Updated Date - May 27 , 2026 | 12:41 AM