నగర కమిషనర్‌ను విధుల నుంచి తొలగించాలి
ABN , Publish Date - May 19 , 2026 | 12:44 AM
ఏలూరులో డ్రెయిన్లు, రహదారులు, ఫుట్‌పాత్‌లపై యథేశ్ఛగా ఆక్ర మణలు జరుగుతున్నప్పటికీ కార్పొరేషన్ అధికారులు పట్టించుకోవడం లేదని సామాజిక కార్యకర్త స్వర్ణలత ఆరోపించారు.
సామాజిక కార్యకర్త స్వర్ణలత నిరాహార దీక్ష
ఏలూరు రూరల్, మే 18(ఆంధ్రజ్యోతి):ఏలూరులో డ్రెయిన్లు, రహదారులు, ఫుట్‌పాత్‌లపై యథేశ్ఛగా ఆక్ర మణలు జరుగుతున్నప్పటికీ కార్పొరేషన్ అధికారులు పట్టించుకోవడం లేదని సామాజిక కార్యకర్త స్వర్ణలత ఆరోపించారు. సమస్యల పరిష్కారంలో విఫలమైన నగర కమిషనర్ భాను ప్రతాప్‌ను విధుల నుంచి తొలగించి, ఆక్రమణలపై తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆక్రమణల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. సమస్యలపై పీజీఆర్‌ఎస్‌లో పలుమార్లు ఫిర్యాదు చేసినా స్పందన లేదని ఆరోపిస్తూ సోమవారం కలెక్టరేట్ వద్ద ఆమె నోటికి నల్లరిబ్బను కట్టుకొని నిరాహార దీక్షకు దిగారు. సోమవారం రాత్రి 11 గంటల వరకు కూడా దీక్ష కొనసాగించడంతో ఇద్దరు మహిళా కాని స్టేబుళ్లను ఆమెకు రక్షణగా ఉంచారు.