కొల్లేరులో బోదె తవ్వకాలు నిలిపివేత
ABN , Publish Date - Apr 17 , 2026 | 11:48 PM
కొల్లేరు అభయారణ్య పరిధిలో ఎక్కడ తవ్వకాలు చేసినా వైల్డ్‌లైఫ్ చట్ట ప్రకారం కేసులు నమోదు చేస్తామని ఏలూరు డివిజనల్ ఫారెస్ట్ అధికారి డాక్టర్ ఎ.త్రిమూర్తులరెడ్డి హెచ్చరించారు.
కైకలూరు, ఏప్రిల్ 17(ఆంధ్రజ్యోతి): కొల్లేరు అభయారణ్య పరిధిలో ఎక్కడ తవ్వకాలు చేసినా వైల్డ్‌లైఫ్ చట్ట ప్రకారం కేసులు నమోదు చేస్తామని ఏలూరు డివిజనల్ ఫారెస్ట్ అధికారి డాక్టర్ ఎ.త్రిమూర్తులరెడ్డి హెచ్చరించారు. ‘బోదె ముసుగులో కొల్లేరులో అక్రమ తవ్వకాలు’ శీర్షికన శుక్రవారం ‘ఆంధ్రజ్యోతి’లో వచ్చిన కథ నానికి స్పందించిన ఆయన క్షేత్రస్థాయిలో పరిశీ లించారు. కైకలూరు మండలం చటాకాయ్ గ్రామంలో కొల్లేరులో నుంచి చేపల చెరువులకు నీరు తరలించేందుకు బోదె తవ్వుతున్నట్టు చెబుతూ భారీ గా తవ్వకాలు చేపట్టినట్టు ఆయన గుర్తించారు. దీనిపై గ్రామస్థులతో మాట్లాడి పనులును నిలుపుదల చేశారు. ఎక్కడ తవ్వకాలు చేసినా చట్టరీత్యా కేసులు నమోదు చేస్తామని సుప్రీంకోర్టు పరిఽధిలో ఉన్నందున అనుమతులు తీసుకుని మాత్రమే తవ్వకాలు చేయాలని హెచ్చరించారు. రేంజర్ రామలింగాచార్యులు, సిబ్బంది పాల్గొన్నారు.