Share News

పంచాయతీల విభజన..

ABN , Publish Date - Mar 12 , 2026 | 12:35 AM

పంచాయ తీరాజ్‌ శాఖలో సంస్కరణల పర్వం మొదలైంది. జి ల్లాల విభజనకు తగ్గట్టుగా పల్లెల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇందులో భాగంగా జిల్లాలోని గ్రామ పంచాయతీలను స్వతంత్ర గ్రామ పంచాయతీలుగా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

పంచాయతీల విభజన..

పల్లెల పట్టణీకరణకు నాంది

పునర్విభజన కసరత్తు పూర్తి

4 గ్రేడ్‌లుగా విభజన.. మొదటి గ్రేడ్‌లో రూర్బన్‌ గ్రామ పంచాయతీలు

మిగిలినవి 3 గ్రేడ్‌లుగా విభజన

రాష్ట్ర ప్రభుత్వం జీఓ జారీ

ఏలూరు సిటీ, మార్చి 11(ఆంధ్రజ్యోతి): పంచాయ తీరాజ్‌ శాఖలో సంస్కరణల పర్వం మొదలైంది. జి ల్లాల విభజనకు తగ్గట్టుగా పల్లెల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇందులో భాగంగా జిల్లాలోని గ్రామ పంచాయతీలను స్వతంత్ర గ్రామ పంచాయతీలుగా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో జిల్లాల్లో ఉన్న క్లస్టర్‌ వ్యవస్థను రద్దు చేసి అన్ని గ్రామ పంచాయతీలను స్వతంత్ర గ్రామ పంచాయతీలుగా పరిగణలోకి తీసుకోవాలని నిర్ణయించింది. గ్రామ పంచాయతీల బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం కేటగిరీల వారీగా జనాభా ప్రాతి పదికన పంచాయతీలను పునర్విభజన (రీ కేటగిరై జేషన్‌) చేయాలని నిర్ణయించింది. ఆయా గ్రామాలలో అభివృద్ధి పనులు జరగటానికి ఈ పునర్విభజన ఎంతో ఉపయోగపడుతుందని ప్రభుత్వం భావించింది. దీనికి అనుగుణంగా ఏలూరు జిల్లాలో మొత్తం 547 గ్రామ పంచాయతీలుండగా వీటిలో చొప్ప రామన్నగూడెం పంచాయతీకి ఎన్నికలు నిర్వహించలేదు. జిల్లాలో ఉన్న 546 గ్రామ పంచాయతీల్లో 16 గ్రామ పంచా యతీలను రూర్బన్‌ పంచాయతీలుగాను, 179 గ్రామ పంచాయతీలను గ్రేడ్‌–1 పంచాయతీలు గాను, 130 గ్రామ పంచాయ తీలను గ్రేడ్‌–2 పంచాయతీలు గాను, 221 గ్రామ పంచాయతీలను గ్రేడ్‌–3 పంచాయ తీలుగాను విభజన చేిసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జీవో విడుదల చేసింది.

గ్రేడ్‌ల వారీగా పంచాయతీల పునర్విభజన

ఏలూరు జిల్లాలో 546 గ్రామ పంచాయతీలు న్నాయి. వీటిని 4 గ్రేడ్‌లుగా విభజించాలని నిర్ధే శించా రు. నాన్‌ ట్రైబుల్‌ పంచాయతీలకు, ట్రైబుల్‌ పంచాయ తీలకు వేర్వేరుగా మార్గదర్శకాలు రూపొందించారు.

నాన్‌ ట్రైబల్‌ పంచాయతీలలో (ప్లెయిన్‌ ఏరియా లోని)రూర్బన్‌ పంచాయతీలకు 10 వేలు పైగా జనాభా ఉండాలని, పంచాయతీల ఆదాయం కోటి రూపాయిలు పైగా ఉండాలని నిర్ధేశించారు. గ్రేడ్‌– 1 పంచాయతీకి 4 వేలకు పైగా 10 వేల లోపు జనాభా ఉండాలని, ఆదాయం రూ. 50 లక్షల పైన కోటి లోపు ఉండాలని (మండల కేంద్రంలోని పంచాయతీగా ఉండవచ్చునని) నిర్ణయించారు. గ్రేడ్‌–2 పంచాయతీకి 2 వేలకు పైగా 4 వేలు లోపు జనాభా ఉండాలి. గ్రేడ్‌– 3 పంచాయతీకి 2 వేలలోపు జనాభా ఉండాలని నిర్ధేశించారు.

ఫట్రైబల్‌ పంచాయతీలలో (షెడ్యూలు ఏరియా లోని) రూర్బన్‌ పంచాయతీలకు 5 వేల లోపు జనా భా ఉండాలని, గ్రేడ్‌– 1 పంచాయతీకి 3 వేలకు పైగా 5 వేలు లోపు జనాభా ఉండాలని (మండల కేంద్రం లోని పంచాయతీగా ఉండవచ్చునని), గ్రేడ్‌–2 పంచా యతీకి 1500కు పైగా 3 వేలకు లోపు జనాభా, గ్రేడ్‌–3 పంచాయతీకి 1500 జనాభా ఉండాలని నిర్ధేశించారు. ఈ ప్రక్రియ ప్రకారం 4 కేటగిరీలలో పంచాయతీల పునర్విభజన నిర్వహించారు.

జిల్లాలోని రూర్బన్‌ పంచాయతీలు ఇవే..

ఏలూరు జిల్లాలో రూర్బన్‌ పంచాయతీలుగా 16 గ్రామ పంచాయతీలను విభజించారు. భీమడోలు మం డలంలోని భీమడోలు, గుండుగొలను, పూళ్ల, బుట్టాయ గూడెం మండలంలోని బుట్టాయిగూడెం, దొరమామిడి, రెడ్డిగణపవరం, చింతలపూడి మండలంలోని ప్రగఢ వరం, దెందులూరు మండలంలోని దెందులూరు, కైకలూరు మండలంలోని కైకలూరు, కలిదిండి మండ లంలోని కలిదిండి, కామవరపుకోట మండలంలోని కామవరపుకోట, కొయ్యలగూడెం మండలంలోని పరింపూడి, పెదపాడు మండలంలోని వట్లూరు, పోలవరం మండలంలోని పోలవరం, టి. నరసాపురం మండలంలోని టి.నరసాపురం, వేలేరుపాడు మండలంలోని తాట్కూరుగొమ్ము పంచాయతీలను రూర్బన్‌ పంచాయతీలుగా ప్రకటించారు. మిగిలిన పంచాయతీలను గ్రేడ్‌–1, 2, 3 పంచాయతీలుగా విభజించారు. పంచాయతీల రీ కేటగిరైజేషన్‌కు సం బంధించి జీఓ విడుదల కావటంతో ప్రతి పంచా యతీకి గ్రామ కార్యదర్శి ఉండేలా చర్యలు చేపడతారు. అలాగే ఆయా పంచాయతీలకు అదనపు సిబ్బందిని కూడా నియమించే అవకాశాలున్నాయి.

ఇదిలా ఉండగా అధిక జనాభా కలిగిన పంచాయ తీలను రూర్బన్‌ పంచాయతీలుగా గుర్తించి, వాటికి అధికారులుగా గ్రేడ్‌–1 పంచాయతీ కార్యదర్శులకు పదో న్నతులు కల్పించి నియమిస్తారని చెబుతున్నారు. ఇక నుంచి గ్రామ పంచాయతీ కార్యదర్శులను పంచాయతీ అభివృద్ధి అధికారులు (పీడీఓ)గా పిలవనున్నారు. రూర్బన్‌ పంచాయతీలకు డిప్యూటీ ఎంపీడీవో క్యాడర్‌ అధికారులను నియమించాలని ప్రభుత్వం నిర్ణయిం చింది. జూనియర్‌ అసిస్టెంట్‌/ జూనియర్‌ అసిస్టెంట్‌ కమ్‌ బిల్‌ కలెక్టర్లలో సీనియార్టీని బట్టి పదోన్నతులు కూడా కల్పిస్తారని చెబుతున్నారు. వారిని రూర్బన్‌ పంచాయతీలలోనే సీనియర్‌ అసిస్టెంట్లుగా నియమిం చి పాలన మరింత మెరుగుపరచాలని నిర్ణయించారు.

పంచాయతీరాజ్‌ ప్రక్షాళనలో భాగంగా మున్సిపాల్టీ తరహాలో పలు విభాగాలను పంచాయతీల్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. పంచాయతీల్లో కూడా పలు విభాగాల ద్వారా విస్తృతమైన సేవలను అందుబాటు లోకి తేనున్నారు. పారిశుధ్యం, తాగునీటి సరఫరా, గ్రామీణ ప్రణాళికా విభాగం, వీధిలైట్ల విభాగం, ఇంజనీరింగ్‌, రెవెన్యూ విభాగాలుగా విభజిస్తారు. ఈ విభాగాల ద్వారా ప్రజలకు విస్తృత సేవలందిం చేం దుకు అవసరమైతే కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బం దిని నియమించుకోవచ్చునని ప్రభు త్వం సూచిస్తోంది. వారికి పంచాయతీల సాధారణ నిధుల నుంచి జీతా లు చెల్లిస్తారని తెలుస్తోంది. అదనంగా ఉన్న ఇంజ నీరింగ్‌ అసిస్టెంట్లు, డిజిటల్‌ అసిస్టెంట్లను ఇక పంచాయతీల్లో గ్రామీణ ప్లానింగ్‌ అసిస్టెంట్లుగా గుర్తిం చి వారి సేవలను వినియోగించుకుంటారు. వారి ఆధ్వ ర్యంలో గ్రామాల్లో భవనాలు, లేఅవుట్‌ రూల్స్‌ అమలు జరుగుతుందని చెబుతున్నారు. పంచాయతీ రాజ్‌లో ప్రత్యేక ఐటీ విభాగాన్ని ఏర్పాటు చేసి అదనంగా ఉన్న డిజిటల్‌ అసిస్టెంట్లు, ఇతర అర్హత కలిగిన సిబ్బందిని ఉపయోగించి పంచాయతీల్లో డిజిటల్‌ విభాగాన్ని అభివృద్ధి చేస్తారు. పంచాయతీల్లో రికార్డు లు డిజిటలైజ్‌ చేసి రియల్‌ టైమ్‌లో పంచాయతీల ద్వారా సర్వీసులు అందించేందుకు యంత్రాంగాన్ని బలోపేతం చేయాలని నిర్ణయించింది.

‘పశ్చిమ’లో

భీమవరం రూరల్‌: పశ్చిమగోదావరి జిల్లాలో 409 గ్రామాలు ఉన్నాయి. వీటిలో 20 రూర్బన్‌ గ్రామాలుగాను, 140 గ్రామాలు గ్రేడ్‌–1, వంద గ్రామాలు గ్రేడ్‌––2 149 గ్రామాలు గ్రేడ్‌–3గా కేటాయించారు. రూర్బన్‌ పంచాయతీల కింద ఆచంట, అత్తిలి, కె. అన్నవరం, చిన అమిరం, రాయలం, గణపవరం, రేలంగి గ్రామాలను కేటాయించారు. వాటితోపాటు పెద అమిరం, మొగల్తూరు, శృంగవృక్షం, విస్సాకోడేరు, పాలకొల్లు గ్రామీణ, పెంటపాడు, పెనుగొండ గ్రామాలు రూర్బన్‌ పరిధిలోకి వెళ్ళాయి. అంతే కాక సిద్ధాంతం, తాడేపల్లి, దువ్వ, వేల్పూరు, ఉండి, వీరవాసరం కూడా ఉన్నాయి.

Updated Date - Mar 12 , 2026 | 12:35 AM