కూటమి పాలనలో వికాసం
ABN , Publish Date - Jun 21 , 2026 | 01:05 AM
గత ప్రభుత్వ విధ్వంసం వైపు పయనిస్తే కూటమి ప్రభుత్వం వికాసం వైపు పయనిస్తోందని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు.
నూజివీడులో కూటమి రెండేళ్ల పాలన విజయోత్సవం.. అన్నదాత సుఖీభవ సభ
నూజివీడు, జూన్ 20(ఆంధ్రజ్యోతి):గత ప్రభుత్వ విధ్వంసం వైపు పయనిస్తే కూటమి ప్రభుత్వం వికాసం వైపు పయనిస్తోందని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. నూజివీడు చిన్న గాంధీ బొమ్మ సెంటర్‌లో కూటమి రెండేళ్ల పాలన విజయోత్సవ సభతో పాటు అన్నదాత సుఖీభవ నిధుల విడుదల నేపథ్యంలో శని వారం బహిరంగ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభు త్వం ప్రజా వేదిక కూల్చివేతతో విధ్వంసకర పాలన ప్రారంభిస్తే కూటమి ప్రభుత్వం 16 ఉద్యోగాల కల్పనతో డీఎస్సీపై సంతకం, ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు మంజూరుపై సంతకాలతో వికా సం వైపు పాలన ప్రారంభించిందన్నారు. గత ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందించిందని చెప్పుకుంటున్న వారికి తాను ఎక్కడైనా చర్చకు సిద్ధమన్నారు. కూటమి ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకువచ్చి యువతను ఉపాధి వైపు అడుగులు వేయిస్తోం దన్నారు. గత ప్రభుత్వంలో యువతకు గంజాయి బ్యాచ్‌గా తయారు చేశారని, అదే రీతిన మాజీ ఎమ్మెల్యే తాను రౌడీనంటూ, రఫరఫా అంటూ ప్రసంగాలు చేస్తే.. ఆయన కార్యకర్తలు గంజాయి తాగి కొట్టుకుంటున్నారని, చెట్లను కట్ చేసే రంపంతో దాడులకి దిగార న్నారు. రైతుకు వ్యవసాయాన్ని లాభదాయకం చేయాలన్నది కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులను త్వరలో ప్రారంభించి పూర్తి చేస్తామన్నారు. నూజివీడు నియోజకవర్గం రూ.360 కోట్లతో అభివృద్ధి పరుస్తున్నట్టు మంత్రి సారథి తెలిపారు. తాను వచ్చాక టిడ్కో ఇళ్లను పూర్తి చేసి ఇస్తున్నామని, ఇటు ఇండోర్ స్టేడియంను పూర్తిచేసి క్రీడకారు లకు కానుకగా ఇస్తానన్నారు. మాజీ శాసన సభ్యులు మర్లపాలెంకు తనకు దారి తెలుసా.. అని అడిగారని దారి తనకు తెలుసో లేదో కానీ రూ.రెండు కోట్లతో ఆ దారిని అభివృద్ధి చేయడం మాత్రం తనకు తెలుసన్నారు. కార్యక్రమంలో నూజివీడు సబ్ కలెక్టర్ బి.వినూత్న, కూటమి నాయకులు, పాల్గొన్నారు.
కూటమి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ
నూజివీడు టౌన్ : కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన నేపథ్యంలో శని వారం నూజివీడు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వ హించారు. మంత్రి కొలుసు క్యాంప్ కార్యాల యం నుంచి ర్యాలీని ప్రారంభించారు. పట్టణ టీడీపీ అధ్యక్షుడు మల్లిశెట్టి జగదీష్ ద్విచక్ర వాహనంపై ర్యాలీలో మంత్రి పాల్గొన్నారు. కూటమి కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు.