Share News

అభివృద్ధి.. సంక్షేమం బాగుంది!

ABN , Publish Date - Jan 13 , 2026 | 01:04 AM

అమరావతిలోని సచివాలయం నుంచి మంత్రులు, కార్యదర్శులతో కలిసి సీఎం చంద్రబాబు నాయుడు సోమవారం కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు.

అభివృద్ధి.. సంక్షేమం బాగుంది!
సీఎం వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్‌ వెట్రిసెల్వి, ఎస్పీ కిశోర్‌, జేసీ అభిషేక్‌ గౌడ

వైద్య, ఆరోగ్య సేవల్లో ప్రథమ స్థానం

సంతృప్తిస్థాయిపై ప్రజాభిప్రాయం

ప్రాజెక్టుల వేగ వంతం చేయాలి.. వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం చంద్రబాబు ఆదేశం

మైన్స్‌ డిప్యూటీ డైరెక్టర్‌పై కలెక్టర్‌ ఆగ్రహం

జిల్లాలో అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ప్రగతి సూచికల పరంగా ఏలూరు జిల్లా ఓవరాల్‌గా రాష్ట్రంలో ఐదో స్థానం దక్కించుకుంది. జిల్లాలో వివిధ సంక్షేమ పథకాలు అమలు తీరుపై ప్రజల నుంచి ఇటీవల చేపట్టిన ప్రజాభిప్రాయాల సేకరణ, పనుల ప్రగతి సూచికల మేరకు ఈ స్థానం దక్కించుకుం ది. జిల్లా పరిపాలనపై ఓవరాల్‌గా 69.9 శాతం బాగుందని, 30.1 శాతం బాగా లేదని తేల్చి చెప్పారు.

(ఏలూరు–ఆంధ్రజ్యోతి):

అమరావతిలోని సచివాలయం నుంచి మంత్రులు, కార్యదర్శులతో కలిసి సీఎం చంద్రబాబు నాయుడు సోమవారం కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఉదయం 10.30 గంటల నుంచి ఏకబికిన మధ్యాహ్నం 3.20 గంటల వరకు ఆయన ప్రధాన కార్యదర్శి విజయానంద్‌తో పాటు సమీ క్షించారు. ప్రధానంగా జీఎస్‌డీపీ, 10 సూత్రాలు, కేంద్ర పథకాల అమలు, ఆర్టీజీఎస్‌, పట్టాదారు పాస్‌ పుస్తకా లు తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ జిల్లాలో మంజూరైన ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తి చేసేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరారు. వివిధ పథకాలకు మంజూరు చేసిన నిధులను ఈ నెలాఖరులోగా వినియోగించాలన్నారు. కలెక్టర్‌ వెట్రిసెల్వితో పాటు ఎస్పీ కె.ప్రతాప్‌ శివ కిశోర్‌, జేసీ అభిషేక్‌ గౌడ, సీపీవో సీహెచ్‌ వాసుదేవరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

జిల్లాలో టాప్‌–5లో నిలిచిన పథకాలు ఇవే..

వైద్య ఆరోగ్యసేవల్లో జిల్లా ప్రఽథమ స్థానం దక్కించుకుంది. డాక్టర్లు అందుబాటులో ఉన్నారా? ఉచిత మందుల పంపిణీ, ఆసుపత్రుల్లో అవినీతి, పరిశుభ్రత తదితర అంశాలపై ప్రజాభిప్రాయ సేకరణలో 100 శాతానికి 68.4శాతం బాగుందని, 31.6 శాతం బాగాలేదని సమాధానం ఇచ్చారు.

ఽధాన్యం కోనుగోళ్లు విషయంలో టాప్‌–3లో ఏలూరు నిలిచింది. బియ్యం సేకరణకు గోనెసంచులు, రవాణా సౌకర్యాలు, నిర్దేశించిన మద్దతు ధరలు అందివ్వడం తదితర అంశాలపై 83.0 శాతం బాగుందని, 17 శాతం బాగా లేదని తేల్చి చెప్పారు.

దీపం –2 గ్యాస్‌ పంపిణీలో ప్రజల స్పందన భేషుగ్గా ఉంది. జిల్లా టాప్‌–3గా నిలిచింది. ప్రధానంగా డెలివరీ బాయ్‌ ప్రవర్తన, అదనంగా డబ్బులు వసూళ్లపై అభిప్రాయ సేకరణ చేశారు. ఇందులో 72.9 శాతం బాగుందని, 27.15 బాగా లేదని తేల్చారు.

రవాణాశాఖ పరంగా పన్నుల వసూళ్లలో మూడో స్థానంలో నిలిచింది. నాణ్యత ప్రమాణాలు, పర్మిట్లు, అవినీతి అంశాలపై ప్రజల అభిప్రాయ సేకరణలో 72.1 శాతం బాగుందని, 27.9 శాతం బాగా లేదన్నారు.

గ ంజాయి, డ్రగ్స్‌ను అరికట్టడంలో పోలీసుల స్పందన, భద్రతా ప్రమాణాలు తదితర అంశాల్లో మూడో స్థానంలో నిలిచింది. సేవలు బాగున్నాయని 73.4 శాతం, బాగా లేదని 26.39 ప్రజలు చెప్పారు.

సాంఘిక సంక్షేమశాఖపరంగా సేవలందించడంలో నాల్గొవ స్థానంలో ఏలూరు నిలిచింది. వసతి గృహాల్లో మెనూ, వార్డెన్‌ల పనితీరు, మంచినీరు, ఇతర వసతుల పరంగా 70.9 శాతం బాగుందని, 29.1 శాతం బాగాలేదని సమాఽధానం ఇచ్చారు.

ఫ ఫైర్‌ ఎన్‌వోసీల జారీలో అట్టడుగున జిల్లాల్లో దిగువ నుంచి మూడో స్థానంలో నిలిచాం. ఈ సేవలపై 55.89 శాతం బాగుందని, 44.2 శాతం బాగా లేదని తెలిపారు.

మధ్యస్తంగా నిలిచిన శాఖలివే

జిల్లాలో వివిధ శాఖల్లో ప్రజాభిప్రాయ సేకరణలో ప్రజల సంతృప్తి మధ్యస్థంగానే వచ్చింది. అంటే ఈ కీలకశాఖల్లో ప్రజల సంతృప్తి స్థాయిలో వెనుకబడి ఉన్నట్లే. వీటిలో ప్రధానంగా ఆర్టీసీ బస్టాండ్‌ల నిర్వ హణ, రేషన్‌ పంపిణీ, అన్న క్యాంటీల నిర్వహణ, ఆల యాల్లో వసతుల కల్పన, విద్యుత్‌సేవల పంపిణీ, గృహ నిర్మాణ రంగం, ఇసుక సరఫరా, ఏపీ పొల్యూషన్‌ కంట్రో ల్‌ బోర్డు, వ్యవసాయానికి విత్తనాలు సరఫరా, జిల్లా ఆసుపత్రుల నిర్వహణ, జలవనరులశాఖ, యూరియా సరఫరా, క్రీడా వసతులు, వాహన్‌ సేవలు, బీసీ వెల్ఫేర్‌ కింద వసతి గృహాలు, మైనార్టీ సంక్షేమం, స్కూల్‌ ఎడ్యు కేషన్‌, కాలేజీ, ఎడ్యుకేషన్‌, చిన్న పిల్లల ఆరోగ్య సంరక్షణ, గర్భిణులు, బాలింతలు, పట్టణ అర్బన్‌ విద్యుద్దీకరణలో, పట్దాదార్‌ పాస్‌ పుస్తకాల పంపిణీ, మధ్యాహ్నభోజన పంపిణీ, పట్టణాల్లో మంచినీటి సరఫరా,ఎకో టూరిజం, పంచాయతీరాజ్‌ సర్వీసుల్లో మధ్యస్థంగా జిల్లాలోని శాఖలు నిలిచాయి.

అభివృద్ధి పురోగతి ఇలా...

వ్యవసాయ, అనుబంధ రంగాల పురోగతిలో జిల్లా 11వ స్థానంలో నిలిచింది. 39 ఇండికేటర్లతో 86 మార్కుల స్కోర్‌తో గ్రేడ్‌–ఏను సాధించగా, పరిశ్రమల రంగంలో ఏలూరు 25వ స్థానంలో నిలిచింది. 4 ఇండికేటర్లతో 47 మార్కులతో ‘సీ’ గ్రేడ్‌లో నిలిచింది. సేవా రంగంలో టాప్‌–5 సాధించింది. ఏడు ఇండి కేటర్లతో 87 మార్కులతో ‘ఏ’గ్రేడ్‌ను వశం చేసుకుంది.

కలెక్టర్‌ వెట్రిసెల్వి ఆగ్రహం

ప్రధానంగా జిల్లా అభివృద్ధి ప్రగతి సూచికల నిర్వహణలో కీ పెర్మార్మెన్స్‌ ఇండికేటర్స్‌, సస్టెన్‌బుల్‌ డెవలప్‌మెంట్‌ గోల్స్‌, ఎకానిమిక్‌ గోల్స్‌ ప్రభావితం చూపిస్తాయి. ప్రధానంగా 321 ప్రగతి సూచికల పరిశీలనలో భాగంగా జిల్లాలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను నిరంతరం ఆన్‌లైన్‌లో ఎంట్రీ చేసే విషయంలో జిల్లాలో భూగర్భ గనులశాఖ, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ శాఖలో 10 ఇండికేటర్స్‌ (ప్రగతి సూచిక) వెనుకబడ్డాయి. ఈ కారణంగా జిల్లా 90 శాతం ప్రగతినే సాధించి 26వ స్థానంలో నిలిచింది. దీనిపై సీఎం చంద్రబాబు సైతం ఆరా తీశారు. ఈ విషయం కలెక్టర్‌కు కోపం తెప్పించింది. సమీక్షలో పాల్గొన్న మైన్స్‌ డిప్యూటీ డైరెక్టర్‌ పి.పాపారావుపై అసహనం వ్యక్తం చేశారు. ‘మీరెందుకు వివరాలను నమోదు చేయడం లేదు. మీ కోసం నేను సమాధానం చెప్పుకోవాలి’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పలు శాఖల ప్రగతిలో జిల్లా ‘ఏ’ గ్రేడ్‌లో నిలవడంతో టాప్‌–5లో నిలిచిందని, ఇక ముందు నిర్లక్ష్యంగా వ హిస్తే సహించేది లేదని హెచ్చరించారు.

Updated Date - Jan 13 , 2026 | 01:04 AM