కుర్చీ వదిలి కదలరు!
ABN , Publish Date - May 15 , 2026 | 12:59 AM
సాక్షాత్తూ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతానికి సంస్కరణలు పర్వం కొనసాగిస్తున్నారు.
క్షేత్రస్థాయిలో పర్యటించని డిప్యూటీ ఎంపీడీవోలు..
గ్రామాల్లో సమస్యల తిష్ఠ
అవకతవకలపై విచారణలు లేవు
సమస్యలపై తనిఖీల బాట తూచ్
(ఏలూరు–ఆంధ్రజ్యోతి)
సాక్షాత్తూ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతానికి సంస్కరణలు పర్వం కొనసాగిస్తున్నారు. ఉద్యోగులు ఖాళీల భర్తీ.. పదోన్నతుల కల్పనలో దూకుడు కొన సాగిస్తున్నారు. ఎంపీడీవోలపై పనిభారం తగ్గిస్తూ పంచాయతీ రాజ్ పనులకు ఒక డిప్యూటీ ఎంపీడీవో, సచివాలయ స్థాయి లో పర్యవేక్షణకు మరో డిప్యూటీ ఎంపీడీవోలుగా వర్గీకరణ చేపట్టారు. తీరా ఆచరణలో పల్లె ప్రజలు మేలు చేయాల్సిన డిప్యూటీ ఎంపీడీవోలు కార్యస్థానం నుంచి తనిఖీల బాట పట్టకపోవడం విమర్శలకు తావిస్తోంది. తమ పరిధిలోని 15 నుంచి 25 గ్రామాలను నిరంతరం తనిఖీలు చేస్తూ.. కింది స్థాయి ఉద్యోగులను, కార్యదర్శులు, ఇతర అఽధికారులను అప్ర మత్తం చేయాల్సి ఉండగా మా పని కాదన్నట్లుగానే డిప్యూటీ ఎంపీడీవోలు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు లేకపోలేదు. జిల్లా పంచాయతీ అధికారి పర్యవేక్షణలో ఉండే వీరంతా 408, 410 జీవోల ప్రకారం నెలలో 20 రోజుల తనిఖీలు బాట పట్టాల్సి ఉండగా.. దానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలున్నాయి.
విచారణల ఊసేలేదు..
జిల్లాలో అత్యధిక మొత్తంలో అవకతవకలు కైకలూరు మేజర్ పంచాయతీలో బయటపడ్డాయి. దాదాపుగా రూ.4.40 కోట్లకు చిట్టా చేరింది. ఇందులో బాధ్యులైన ఆరుగురు ఈవోపీ ఆర్డీలను పంచాయతీరాజ్ కమిషనర్ సస్పెండ్ చేశారు. భీమడోలు, ముదినేపల్లి, ముసునూరు తదితర మేజర్ పంచా యతీలతో పాటు 50 వరకు మైనర్ పంచాయతీల్లో ఆర్థిక అవకతవకలు రూ.కోట్లలో జరిగాయి. వీటిని విచారణలు జరగడం లేదు. ఎవ్వరికి వారే యమునా తీరే అన్న చందంగా క్షేత్రస్థాయిలో పరిశీలనలు చేయడం లేదు. బాధ్యులపై చర్యలు లేకపోగా.. ఎక్కడ అవినీతి జరిగిందన్న లెక్కలు తీసే వారే కరువయ్యారు. మార్చి నెలాఖరుకు సర్పంచ్‌ల పదవీ కాలం పూర్తి కావడంతో ఏప్రిల్ మొదటి వారం నుంచి ఇన్‌చార్జులు, ప్రత్యే కాధికారుల పాలన ప్రారంభ మైంది. అధికారులంతా సమష్టిగా గ్రామాల్లో తనిఖీలు చేస్తే.. ప్రజాధనం దుర్వినియోగం వ్యవహరాలు బట్టబయలు అయ్యే అవకాశం ఉంది. ఈ దిశగా ఆలోచనలు జరగడం లేదు.
గ్రామాల్లో సమస్యలె న్నో..
పంచాయతీరాజ్ డిప్యూటీ ఎంపీడీవోలు గ్రామాల్లో సమస్యలపై పట్టన ట్టుగా వ్యహరిస్తున్నారు. ప్రధానంగా మంచినీరు, మరుగుదొడ్లు, పారిశుధ్య సమస్యలు, ఎన్‌ఆర్‌ఈజీఎస్, ఇతర ప్రభుత్వ పథకాల పర్యవేక్షణ చేపట్టాల్సి వుంటుంది. నెలలో కనీసం ఐదారురోజులు కూడా తనిఖీలు చేయడం లేద న్న ఆరోపణలున్నాయి. కార్యాలయాల్లో కూర్చొనే కిందస్థాయి సిబ్బందికి ఆదే శాలు జారీ చేస్తున్నారు. ప్రత్యేక పారిశుధ్య పనులతో పాటు గ్రామాల్లో పరి పాలన గాడిన పెట్టే అవకాశం ఉన్న పట్టించుకోవడం లేదు. చాలామంది డిప్యూటీ ఎంపీడీవోలు ఇటీవల పదోన్నతులు పొందిన వారే ఎక్కువగా ఉ న్నారు. వీరికి ప్రభుత్వం కల్పించిన అవకాశాలను క్షేత్రస్థాయిలో వినియో గించకపోవడం.. జిల్లా స్థాయిలో ఉన్నతాఽధికారుల పర్యవేక్షణ లేమి కారణంగా చెబుతున్నారు. గ్రామ పంచాయతీల్లో మితిమీరిన అవినీతి రాజ్యమేలుతోంది.
జలధారలో 2,250 పనులు
కలెక్టర్ వెట్రిసెల్వి
ఏలూరు,మే14(ఆంధ్రజ్యోతి): జిల్లాలో జలధార– జలహారతి కింద 2,250 పనులు మంజూరు చేశాం. వీటి విలువ రూ.250 కోట్లు ఉంటుందని కలెక్టర్ వెట్రిసెల్వి తెలిపారు. కలెక్టరేట్ నుంచి ఈ కార్యక్రమంపై ఆమె జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా పనులపై అధికారులతో గురువారం సమీక్షించారు. నిర్ధేశించిన సమయంలోగా పనులు పూర్తి చేయాలని ఆదేశిం చారు. ఇప్పటికే 2,250 పనులకు గాను కేవలం 1,761 పను ల వివరాలను ఆన్‌లైన్ నమోదు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం సాయంత్రంలోగా మిగిలినవన్నీ ఆన్‌లైన్ చేయాలని ఆదేశించారు. డ్వామా పీడీ వెంకట సుబ్బారావు, పంచాయతీరాజ్, జలవనరులశాఖ ఎస్‌ఈలు రమేష్, దేవప్రకాశ్ పాల్గొన్నారు.