Share News

ఇన్‌చార్జ్‌లే దిక్కు!

ABN , Publish Date - Jun 13 , 2026 | 12:57 AM

జిల్లాలో వివిధ ప్రభుత్వశాఖల్లో అధికారుల పోస్టుల ఖాళీలు పెరిగిపోతున్నాయి. కీలకమైన పదిశాఖలకు పైనే అధికారుల పోస్టులు ఖాళీలు అనూహ్యంగా ఏర్ప డ్డాయి.

ఇన్‌చార్జ్‌లే దిక్కు!

జిల్లాలో ఇన్‌చార్జుల పాలన.. డీఆర్వో పోస్టు భర్తీ ఎప్పుడో ?

బీసీ సంక్షేమ శాఖలు ఖాళీ .. వీడ్కోలు సత్కారాల్లేవు

జిల్లాలో వివిధ ప్రభుత్వశాఖల్లో అధికారుల పోస్టుల ఖాళీలు పెరిగిపోతున్నాయి. కీలకమైన పదిశాఖలకు పైనే అధికారుల పోస్టులు ఖాళీలు అనూహ్యంగా ఏర్ప డ్డాయి. బదిలీ లేదా ఉద్యోగ విరమణ తర్వాత కీలక పోస్టులు భర్తీ లేక ఇతరశాఖల అధికారులకు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించాల్సి పరిస్థితులు ఏర్పడ్డాయి.

(ఏలూరు–ఆంధ్రజ్యోతి)

జిల్లాలో ఇప్పటికే పరిశ్రమల కేంద్రం జీఎం, జలవనరులశాఖ ఎస్‌ఈ, డీఆర్వో పోస్టులు ఖాళీగా ఏర్పడి చాలాకాలం అవుతోంది. జల వనరులశాఖ ఈఈ సీహెచ్‌ దేవప్రకాశ్‌ ఎస్‌ఈగా, కృష్ణాజిల్లా పరి శ్రమల కేంద్రం జీఎం వెంక్రటావు ఏలూరుకు ఇన్‌చార్జిగా, కలెక్టరేట్‌ లోనే సివిల్‌ సప్లయ్స్‌ విజిలెన్స్‌ స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ ఎల్‌.దేవకీ దేవి డీఆర్వోగా ఈ ముగ్గురు పూర్తి అదనపు బాధ్యతలను మోస్తు న్నారు. మరోవైపు సీపీవో వాసుదేవరావును కలెక్టర్‌ జనవరిలో సరెం డర్‌ చేయగా, అప్పటి నుంచి కార్యాలయ ఏడీ శ్రీదేవి ఇన్‌చార్జి సీపీ వోగా వ్యవహరిస్తున్నారు. ఈమె ఈ నెలాఖరున ఉద్యోగ విరమణ చేస్తున్నారు. తర్వాత ఈ పోస్టులో మరొకరు ఇన్‌చార్జి ఇవ్వాల్సి ఉం టుంది. కాగా గత నెలాఖరున బీసీ కార్పొరేషన్‌ ఈడీ ఎన్‌.పుష్పలత, బీసీ సంక్షేమాధికా రి ఆర్‌వీ నాగ రాణి, సెట్వెల్‌ సీఈవో ప్రభాకర్‌రావు ఉద్యోగ విరమ ణ చేశారు. ఇందులో పుష్పలత, ప్రభాకర్‌రావు కార్పొ రేషన్‌లకు చెందిన వారు కావడంతో వారికి రెండేళ్ల ఉద్యోగ విరమణ వయస్సు పెంచుతారని భావించినా అదీ జరగలేదు. దీంతో వారిద్దరు ఉద్యోగ విరమణ చేశారు. ఒకవేళ వయో పరిమితి పెంచితే ఇక్కడకు మళ్లీ పోస్టింగ్‌ ఇవ్వడం అనుమానంగానే చెబుతున్నారు. ఇదిలా ఉండగా బీసీ కార్పొరేషన్‌ ఈడీగా సాంఘిక సంక్షేమశాఖ జేడీ విశ్వమోహన్‌రెడ్డి, బీసీ సంక్షేమాధికారి ఇన్‌చార్జిగా ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ ముక్కంటిలకు బాధ్య తలు అప్పగిస్తూ కలెక్టర్‌ ఇటీవల ఉత్తర్వులు ఇచ్చారు. సెట్‌వెల్‌ ఇన్‌చార్జి సీఈవోగా ఉపాధి కల్పనాధికారి పీవీ రమేష్‌బాబుకు అప్పగించగా, మైనా ర్టీ కార్పొరేషన్‌ అధికారి బాధ్యతలు కూడా ఈయనకే ఇన్‌చార్జిగా అప్పగిం చారు. జిల్లా వైద్యఆరోగ్యశాఖ, డీసీహెచ్‌ఎస్‌ పోస్టులు ఖాళీ ఏర్పడగా, ఇన్‌చార్జులు ఈ బాఽధ్యతలను మోస్తున్నారు.

డీఆర్వో పోస్టు భర్తీ ఎప్పుడో?

జనవరిలో ఖాళీ ఏర్పడిన డీఆర్వో పోస్టు ఐదు నెలలుగా ఖాళీగానే ఉంది. స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్లు ఇటీవల పెద్దఎత్తున బదిలీలు, పదోన్న తులను ప్రభుత్వం కల్పించినా ఈ పోస్టు ఇంకా భర్తీ కాలేదు. కర్నూలు నుంచి ఐసీడీఎస్‌ ఆర్‌జేడీని నియమిస్తే ఆమె విధుల్లో చేరలేదు. దీంతో ఈ పోస్టు భర్తీ ఎప్పుడో అని ఇన్‌చార్జి డీఆర్వో ఎదురు చూస్తు న్నారు.

ఉద్యోగ విరమణ చేసిన వారికి సత్కారాలు తూచ్‌

జిల్లాలో రెండేళ్ల నుంచి ఉద్యోగ విరమణ చేసిన అధికారులకు కనీసం వీడ్కోలు సభలను కూడా యంత్రాంగం నిర్వహించకపోవడం తీవ్ర విమ ర్శలకు తావిస్తోంది. బదిలీలపై వెళ్లిన వారికి కూడా వారు కొత్తస్థానంలో చేరాక అయినా వారిని గౌరవించి, ఒక శాలువా, మెమెంటో ఇచ్చి వీడ్కోలు సభను నిర్వహించేవారు. ఇదిలా ఉండగా కొద్దినెలలు క్రితం బదిలీపై వెళ్లిన జేసీ ధాత్రిరెడ్డి మొదలుకుని ఇతర

అధికారులకు కలెక్టర్‌, ఇతర అధికారులు కనీసం వీడ్కోలు సభను నిర్వహించక పోవడం తీవ్ర చర్చనీయాంశమైవుతోంది. ఎన్నో ఏళ్లుగా ఎక్కడెక్కడో సర్వీసు చేసి, చివరగా ఉద్యోగ విరమణ రోజు నిరాశతో ఎవరికి చెప్పకుండా రిలీవ్‌ అయిపోవడం ఎంతవరకు సమంజసం అన్న చర్చ సాగుతోంది. జిల్లా అధికారుల అసోసియేషన్‌ కింద పలుశాఖల అధికారులతో కార్యవర్గం ఉన్న లేనట్లేగా ప్రస్తుత పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఉద్యోగ విరమణ చేసిన వారికి కనీసంగా ఒక శాలువా కప్పి సత్కరించే ఆచారం ఎందుకు మరిచారో మిస్టరీగానే మారింది. దీన్ని కొనసాగించే దిశగా యంత్రాంగం పునరాలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Updated Date - Jun 13 , 2026 | 12:57 AM