Share News

చివరికి విషాదం..

ABN , Publish Date - Sep 07 , 2026 | 12:25 AM

చించినాడ బ్రిడ్జిపై నుంచి నలుగురు కుటుంబ సభ్యులు గోదావరిలో దూకేశారు.

చివరికి విషాదం..
గోదావరిలో లభ్యమైన మృతదేహాలు

చించినాడ బ్రిడ్జి పైనుంచి గోదావరిలో దూకిన తండ్రి, కుమారుడు, కుమార్తె మృతదేహాలు లభ్యం

యలమంచిలి, సెప్టెంబరు 6(ఆంధ్రజ్యోతి): చించినాడ బ్రిడ్జిపై నుంచి నలుగురు కుటుంబ సభ్యులు గోదావరిలో దూకేశారు. వారిలో భార్యను స్థానిక జాలర్లు ఒడ్డుకు చేర్చగా భర్త, కుమారుడు, కుమార్తె మృతదేహాలు ఆదివా రం లభ్యమయ్యాయి. గాలింపు చర్యల అనం తరం మృతదేహాలు లభ్యం కావడంతో బంధువుల్లో విషాదం అలుముకుంది.

గోదావరిలో దూకిన తణుకు పట్టణానికి చెందిన నంబూరి శ్రీనివాస్‌(45), కుమారుడు ఈశ్వర్‌(16), కుమార్తె నిత్య(15) మృతదేహా లు ఆదివారం చించినాడ సమీపంలో లభ్యమైనట్లు ఎస్‌ఐ ఎం.రాజ్‌కుమార్‌ ఆదివా రం తెలిపారు. చించినాడ బ్రిడ్జిపై నుంచి నలుగురూ శనివారం వశిష్ఠ గోదావరిలో దూ కారు. భార్యను స్థానిక జాలర్లు రక్షించగా మిగిలిన ముగ్గురి ఆచూకీ లభించలేదు. పాలకొల్లు రూరల్‌ సీఐ జి.శ్రీనివాస్‌, ఎస్‌ఐ ఎం.రాజ్‌కుమార్‌ నేతృత్వంలో ఎస్‌డీఆర్‌ఎఫ్‌, ఫైర్‌, పోలీసు సిబ్బంది రెండోరోజు ఆదివారం గోదావరిలో గాలింపు చర్యలు కొనసాగించారు. భర్త, కుమారుడు, కుమార్తెల మృతదేహాలు చించినాడ సమీపంలో గోదావరిలో లభ్యమ య్యాయి. పాలకొల్లు ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను బం ధువులకు అప్పగించినట్లు ఎస్‌ఐ తెలిపారు.

చికిత్స పొందుతున్న పద్మిని

ఏలూరు క్రైం, సెప్టెంబరు 6(ఆంధ్రజ్యోతి): చించినాడ వశిష్ఠ గోదావరి బ్రిడ్జిపై నుంచి దూకిన కుటుంబంలో మహిళ పద్మినిని జాలర్లు కాపాడగా ఆమె ప్రస్తుతం ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. జాలర్లు ఒడ్డుకు చేర్చిన పద్మిని అపస్మారక స్ధితిలో ఉండడంతో స్ధానికంగా ఉన్న ఆసుప త్రికి అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఐసీయూ విభాగంలోని వెంటిలే టర్‌పై ఆమె చికిత్స పొందుతున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితిపై సోమవారం ప్రత్యేక వైద్య నిపుణులు పరీక్షలు నిర్వహించి వెల్లడించ నున్నారు.

Updated Date - Sep 07 , 2026 | 12:25 AM