Share News

అసలేం జరిగింది..!

ABN , Publish Date - Jan 31 , 2026 | 12:36 AM

ఏలూరులోని జిల్లా సహకార మార్కెటింగ్‌ సొసైటీ (డీసీఎంఎస్‌) సూపర్‌ బజార్‌ మూతవేయడంపై పలు గుసగుసలు శుక్రవారం హల్‌చల్‌ చేశాయి. నెలాఖరు రోజుల్లో చాలామందికి జీతాలు పడు తుంటాయి.

అసలేం జరిగింది..!
మూసివేసిన డీసీఎంఎస్‌ సూపర్‌ బజార్‌

డీసీఎంఎస్‌ సూపర్‌ బజార్‌ మూసివేతపై గగ్గోలు

స్టాకు నిల్వల్లో తేడాలపై అనుమానాలు

మరమ్మతుల కోసం మూశామంటున్న చైర్మన్‌ మురళీకృష్ణ

(ఏలూరు–ఆంధ్రజ్యోతి)

ఏలూరులోని జిల్లా సహకార మార్కెటింగ్‌ సొసైటీ (డీసీఎంఎస్‌) సూపర్‌ బజార్‌ మూతవేయడంపై పలు గుసగుసలు శుక్రవారం హల్‌చల్‌ చేశాయి. నెలాఖరు రోజుల్లో చాలామందికి జీతాలు పడు తుంటాయి. అమ్మకాలు జోరుగా సాగుతాయి. ఇటువంటి కీలక సమయంలో సూపర్‌ బజార్‌లో మరమ్మతులు చేయడంపై అను మానాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో ఎంతో పేరున్న ఈ బజా ర్‌లో వివిధ నిత్యావసర సరుకుల నిల్వలు వినియోగదారులకు సకాలంలో అందుబాటులో ఉండడం లేదని చెబుతున్నారు. సుదూర ప్రాంతాల నుంచి నిల్వలు తెచ్చి పెట్టడంలో జాప్యం చోటు చేసుకోవడంతో వినియోగదారులు 15 శాతం పైబడి తగ్గిపోయారని ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలో ఆకస్మికంగా శుక్రవారం సూపర్‌ బజార్‌ మూసివేసి లెక్కలు సరిచూడడంపై ఆరోపణలు వచ్చాయి. స్వల్పంగా నిల్వల మొత్తాల్లో తేడాలు చోటు చేసుకున్నాయని, దీంతో గుట్టుచప్పుడు కాకుండా ఇక్కడ సిబ్బందిని వేరేచోట్లకు బదిలీ చేసినట్టు తెలుస్తోంది. భీమవరం, పాలకొల్లు, జంగారెడ్డిగూడెం నుంచి నలుగురు సిబ్బందిని ఇక్కడ నియామకం చేశారు. వాస్త వంగా స్థానిక సిబ్బంది ఉంటే సరుకు నిల్వలు, అమ్మకాల లావా దేవీలు చూసుకుంటే.. అందరికి తలలో నాలుకలో ఉండి కస్టమర్లతో పరిచయాల వల్ల వ్యాపారం జోరుగా సాగుతుంది. దీనికి విరుద్ధంగా వేరేప్రాంత సిబ్బంది వల్ల వ్యాపారం సాగుతుందా? అన్న ప్రశ్న తలెత్తింది. ఎప్పుడు లేని విధంగా సాఫ్ట్‌వేర్‌లో మార్పులపై అలజడి రేగుతోంది. ఇదిలా ఉండగా సూపర్‌బజార్‌లో పనిచేసే సిబ్బందిని ఎరువుల దుకాణంలోకి మార్పు చేయడం విమర్శలకు తావిచ్చింది. అనుభవం ఉన్నవారిని ఒక్కర్ని కూడా ఇక్కడ ఉంచలేదని తెలు స్తోంది. చైర్మన్‌ తన ప్రాంతంలోని సిబ్బందినే ఇక్కడ నియమించు కుంటున్నారన్న విమర్శలు లేకపోలేదు.

Updated Date - Jan 31 , 2026 | 12:36 AM