డీసీఎంఎస్ వ్యాపార విస్తరణ
ABN , Publish Date - May 16 , 2026 | 01:07 AM
జిల్లా ’సహకార మార్కెటింగ్ సొసైటీ(డీసీఎంఎస్) కూటమి ప్రభుత్వంలో వ్యాపారాల విస్తరణ దిశగా అడుగులు వేస్తోంది.
ప్రజాఆరోగ్యానికి గానుగ నూనెలు.. ఏలూరులో ప్రయోగం సక్సెస్
సూపర్‌బజార్లు పెంపుదలపై అడుగులు.. తాజాగా ఐదు ఎరువుల డిపోలు ఏర్పాటు
గత వైసీపీ పాలనలో ఎదుగుబొదుగులేని జిల్లా ’సహకార మార్కెటింగ్ సొసైటీ(డీసీఎంఎస్) కూటమి ప్రభుత్వంలో వ్యాపారాల విస్తరణ దిశగా అడుగులు వేస్తోంది. ఉమ్మడి జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ చాగంటి మురళీకృష్ణ బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తి కాకుండానే పలు సంస్కరణలకు తెర తీశారు. దీర్ఘకాలికంగా పాతుకుపోయిన ఉద్యోగుల బదిలీ చేపట్టారు. ఏలూరులో ప్రయోగాత్మకంగా రూ.15లక్షల పైబడి యంత్రాలతో గానుగ ఏర్పాటు చేసి కల్తీ లేని వంట నూనెల అమ్మకాలతో సక్సెస్ సాధించడంతో పలుచోట్ల ఈ వ్యాపారాలను విస్తరించేందుకు చర్యలు చేపట్టారు. మరోవైపు సూపర్‌బజార్లు, ఎరువులు, విత్తనాలు డిపోలు పెంపుదలకు శ్రీకారం చుట్టారు. దీంతో డీసీఎంఎస్ టర్నోవర్ రూ.100 కోట్ల నుంచి 150 కోట్లకు చేరేలా ప్రణాళిక రూపకల్పన సాగుతోంది.
(ఏలూరు–ఆంధ్రజ్యోతి) :
ఉమ్మడి జిల్లా డీసీఎంఎస్ నూతన వ్యాపార పంథా అనుసరిస్తూ కొత్త వ్యాపారాల విస్తరణ దిశగా అడు గులు వేస్తోంది. ఇప్పటి వరకు 20 సహకార ఎరువుల, విత్తనాలు బ్రాంచిలుండగా.. ఇటీవల ఐదు ఎరువులు, విత్తనాల డిపోలను ఏర్పాటు చేశారు. కొయ్యలగూడెం, భీమడోలు, ఉండి, నర్సాపురం, టి నర్సాపురం తదితర కేంద్రాల్లో ఒక్కొక్కచోట రూ.50లక్షల నుంచి 70లక్షల విలువైన సరుకులను అందుబాటులోకి తీసుకొచ్చారు. చింతలపూడి మండలం సీతానగరంలో త్వరలో ఏర్పా టు చేయనున్నారు. ప్రధానంగా ఎరువులను కూడా ఒకే కంపెనీకి కాకుండా క్రిబ్‌కో, ఇఫ్‌కో, కోరమండల్, ఐపిఎల్ మొజాయిక్, పీపీఎల్, ఫ్యాక్ట్ కంపెనీల ఎరువు లను అందుబాటులోకి ఉంచారు.
గానుగ నూనెలు విక్రయాలు సక్సెస్
ప్రజల ఆర్యోగ పరిరక్షణలో వంటనూనెలు కీలకం. దీన్ని గమనించిన డీసీఎంఎస్ పర్యవేక్షణలో ఏలూ రులో తాజాగా అప్పటికప్పుడు గానుగలో ఆడి వంట నూనెలు విక్రయాలను రెండు నెలలు క్రితం ప్రారం భించారు. రోజుకు సగటున రూ.1లక్ష విలువైన నూనె ల విక్రయాలను చేపడుతోంది. ప్రజల ఆరోగ్యాన్ని పరి రక్షించేందుకు ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ విక్రయా లు జోరందుకుంటున్నాయి. ప్రధానంగా నాణ్యమైన సన్‌ప్లవర్ కిలో రూ.420, వేరుశెనగ 300, పప్పు నూనె 350, కొబ్బరి నూనె 300లకు, అమ్ముతున్నారు. మఽధ్య వర్తిత్వం లేకుండా డీసీఎంఎస్ ప్రతినిధులే ఈ ముడి సరుకులను పరిశీలించి నేరుగా మిల్లర్లు ద్వారా కొంటు న్నారు. ఈ గానుగలను నర్సాపురం, నిడదవోలు, భీమ వరాల్లో విస్తరించనున్నారు.
సూపర్‌బజార్లు విస్తరణ కూడా..
ఏలూరు సూపర్‌బజార్‌లో ఇటీవల సీసీ కెమెరాల పర్యవేక్షణతో అమ్మకాలు చేపడుతుండగా, కంప్యూటర్ బిల్లులు కూడా వాట్సాప్ ద్వారా కొనుగోలుదారులకు చేరేలా ఏర్పాట్లు చేశారు. ప్రధానంగా ఆదివారం గతంలో సెలవు ఇచ్చి మూసి వేస్తుండేవారు. కొద్ది నెలల నుంచి పండుగల తప్ప అన్ని రోజుల్లో సూపర్ బజార్లు తెరిచే ఉంచుతున్నారు. దీంతో వ్యాపారం మరింత పెరిగింది. వీటిని ఏలూరు మరో రెండుచోట్ల విస్తరణ చేపట్టాలని, నిడదవోలు, భీమవరం, నర్సాపు రాల్లోను సూపర్ బజార్లు విస్తరణ దిశగా ప్రయత్నాలు మొదలెట్టారు.
త్వరలో సుగంధ ద్రవ్యాల ప్యాపారం
జిల్లాలో వివిధ రకాలు సుగంధ ద్రవ్యాలు, మసాల దినుసులు కూడా నేరుగా ఆయా కంపెనీల వద్ద ప్యాకింగ్‌లు చేసే అమ్ముడం వలన వినియోగదా రులకు తక్కువ ధరలకు అందుబాటులో ఉంటాయని డీసీఎంఎస్ చెబుతోంది. ఇవి వివిధ కంపెనీల వద్ద చిన్నచిన్న ప్యాకెట్లు కొని మార్జిన్ లేకుండా అమ్మకాలు చేస్తున్నారు. దాని వలన ఉపయోగం ఉండటం లేదని గుర్తించి.. ఈ వ్యాపారం సొంతంగా చేయాలని నిర్ణయించారు.