విజృంభిస్తున్న డయేరియా
ABN , Publish Date - Apr 18 , 2026 | 11:52 PM
మండలంలోని పలు గ్రామాల్లో డయేరియా కేసులు రోజు రోజుకు పెరుగు తున్నా యి. కలుషిత నీరే కారణమని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కలుషిత నీరే కారణమంటున్న బాధితులు
పట్టని పంచాయతీ, వైద్యశాఖల అధికారులు
ముసునూరు, ఏప్రిల్ 18(ఆంధ్రజ్యోతి):మండలంలోని పలు గ్రామాల్లో డయేరియా కేసులు రోజు రోజుకు పెరుగు తున్నా యి. కలుషిత నీరే కారణమని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్నిరోజుల నుంచి డయేరియా లక్షణాలు వాంతు లు, విరోచనాలతో అనారోగ్యం పాలైన బాధితులు ప్రభుత్వ ఆసుపత్రికి, ఆర్‌ఎంపీలు, ప్రైవేట్ ఆసుపత్రులకు క్యూ కడుతు న్నారు. ముసునూరు పీహెచ్‌సీ పరిధిలోని ముసు నూరు, గోపవరం, చింతలవల్లి, కొర్లకుంట తదితర గ్రామాల్లో డయేరియా కేసులు ఎక్కువగా ఉన్నాయి. క్రమం తప్పకుండా మంచినీటి సరఫరా ట్యాంక్‌లను క్లోరినేషన్ చేసి, పైప్‌లైన్, వాల్ లీకేజీ లను ఆరికట్టాల్సిన పంచాయతీ, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుండడం వల్లనే కలుషిత నీరు సరఫరా అయి అనారోగ్య సమస్యలు వస్తున్నా యని స్థానికులు చెబుతున్నారు. దీనితోడు ట్యాంక్‌ల్లో నీరు, మినరల్ వాటర్ ప్లాంట్లలో నీరును సైతం నిబంధనల ప్రకా రం పరీక్షలు చేయా ల్సిన వైద్య సిబ్బంది ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ముసునూరు, గోగులం పాడు తదితర గ్రామాల్లో వాల్, పైప్‌లైన్ లీకేజులు ఏళ్ల తరబడి ఉన్నప్పుటికి నేటికి వాటి గురించి పట్టించుకున్న నాథుడే లేడని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై వైద్యాధికారిణి డాక్టర్ ఇవాంజలిని వివరణ కోరగా కొన్ని రోజుల నుంచి డయేరియా కేసులు వస్తున్నాయని, ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం కూడా కారణ మని, పీహెచ్‌సీ పరిధి లో ఉన్న తొమ్మిది గ్రామా ల్లో మంచినీటి ట్యాంక్‌లలో నీరుతోపాటు, మినరల్ ప్లాంట్లలో నీటిని పరీక్షలకు పంపించి నట్టు వైద్యులు తెలిపారు.