గడువు పెంపు!
ABN , Publish Date - Jun 02 , 2026 | 12:55 AM
జిల్లా వ్యాప్తంగా ఇళ్ల గణనలో పునర్విచారణకు ఈ నెల ఏడో తేదీ వరకు గడువు పెంచారు. 2011 జనాభాతో సరిపోలిస్తే కొన్ని మండలాల్లోని గ్రామాల్లో జనాభా తగ్గింది.
జనాభా తగ్గుదలపై ఆరా
మండలాల్లో రక్షేతస్థాయిలో విచారణలు
(ఏలూరు–ఆంధ్రజ్యోతి)
జిల్లా వ్యాప్తంగా ఇళ్ల గణనలో పునర్విచారణకు ఈ నెల ఏడో తేదీ వరకు గడువు పెంచారు. 2011 జనాభాతో సరిపోలిస్తే కొన్ని మండలాల్లోని గ్రామాల్లో జనాభా తగ్గింది. ఇది ఇళ్ల గణనపై ప్రభావం చూపుతోంది. ఇవన్నీ సరి చేయాల్సి రావడండో ఇళ్ల గణన గడువును మరో వారం పెంచారు. పోలవరం నియోజకవర్గంలో నిర్వాసిత ప్రాంతాల్లో గ్రామాల్లోని ప్రజలను ఖాళీ చేసి వేరొక చోటుకు పంపారు. అందులో వాస్తవంగా ఉండాల్సిన జనాభాకంటే తక్కువగా ఇప్పుడు నమోదులో ఎందుకు వచ్చారో రీ –వెరిఫికేషన్ చేస్తున్నారు. నిడమర్రు, ఉంగుటూరు, కుక్కునూరు, వేలేరుపాడు, బుట్టాయగూడెం, దెందులూరు, చాట్రాయిల్లోని కొన్ని గ్రామాల్లో గతం కంటే జనాభా పెరుగుదల తక్కువగా ఉంది. దీనికి వలసలు కారణమా? అసలు నమోదు చేయలేదా? అంటూ గ్రామాల్లో మళ్లీ ఇంటింటికీ వెళ్లి ర్యాండమ్‌గా వెరిఫికేషన్లు చేస్తున్నారు.
కదిలిన తహసీల్దార్లు, ఎన్యూమరేటర్లు
వాస్తవంగా ఇళ్ల గణన కార్యక్రమం మే 31వ తేదీనే ముగిసింది. పలు మండలాల్లో జనాభా పెరుగుదల కంటే తక్కువగా నమోదైన గ్రామాల్లో తహసీల్దార్లు, నియోజకవర్గ ప్రత్యేకాధికారులు పర్యవేక్షణలో ఆయా గ్రామాల్లో మళ్లీ సర్వే రిపోర్టులను వ్యక్తిగత యాప్‌లో నమోదు చేసిన వివరాలను సరిపోల్చుతున్నారు.
జనాభా తగ్గిన ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టి :కలెక్టర్
2011 జనాభా లెక్కలతో పోలిస్తే ప్రస్తుత జనాభా సంఖ్య పెరగాలని, కొన్ని ప్రాంతాల్లో తక్కువగా ఉంది. దీని దృష్ట్యా ఆయా ప్రాంతాల్లో అందుకు గల కారణాలను లోతుగా విశ్లేషించి, జనన, మరణ వివరాలు, రేషన్‌కార్డులు, పెన్షన్ దారుల వివరాలను పరిశీలించాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. జనగణనపై ఆమె అధికారులతో సోమవారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇళ్ల గణనను నిర్థేశించిన సమయంలో పూర్తి చేయాల్సిన బాఽధ్యత తహసీల్దారపైనే ఉందన్నారు. జేసీ అభిషేక్ గౌడ, డీఆర్వో దేవకిదేవి, నూజివీడు సబ్ కలెక్టర్ వినూత్న, జడ్పీ సీఈవో జగదాంబ, ఆర్డీవోలు ప్రసన్నలక్ష్మి, రమణ, తహసీల్దార్లు పాల్గొన్నారు.